iDreamPost
android-app
ios-app

గజం ల్యాండ్ 2500.. 15 లక్షలతో 600 గజాలు.. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!

  • Published May 14, 2024 | 6:30 PM Updated Updated May 14, 2024 | 6:30 PM

మనకు దగ్గరగా ఉన్న స్థలాలు కొనుక్కోవాలంటే ఆర్థిక పరిస్థితి చాలా దూరంగా ఉండే పరిస్థితి. ఆర్థిక పరిస్థితికి దగ్గరగా ఉన్న స్థలాలు కొనుక్కుంటే భౌతికంగా దూరంగా ఉండే పరిస్థితి. రెండిటిలో ఏది బెస్ట్ అంటే.. రెండోదే బెస్ట్ అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

మనకు దగ్గరగా ఉన్న స్థలాలు కొనుక్కోవాలంటే ఆర్థిక పరిస్థితి చాలా దూరంగా ఉండే పరిస్థితి. ఆర్థిక పరిస్థితికి దగ్గరగా ఉన్న స్థలాలు కొనుక్కుంటే భౌతికంగా దూరంగా ఉండే పరిస్థితి. రెండిటిలో ఏది బెస్ట్ అంటే.. రెండోదే బెస్ట్ అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

గజం ల్యాండ్ 2500.. 15 లక్షలతో 600 గజాలు.. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఆ రేంజ్ లో డెవలప్ కి సిద్ధమైన ఏరియాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హైవేల గురించే. వీటిలో ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే వంటివి ఉన్నాయి. ముంబై హైవేకి మాత్రం ప్రస్తుతం డిమాండ్ అనేది ఉంది. అయితే ఇక్కడ గజం స్థలం 8 వేల నుంచి 20 వేల రేంజ్ లో ఉన్నాయి. ఒక 100 గజాల స్థలం కొనాలంటే కనీసం 8 లక్షల నుంచి 20 లక్షలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే 10 లక్షలకే ఇంతకన్నా నాలుగు రెట్లు ఎక్కువ ల్యాండ్ వచ్చే ఏరియా ఉంది. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే కనుక ఫ్యూచర్ లో కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడి పెడితే ఏడాదికి మంచి రిటర్న్స్ వస్తాయని అంటున్నారు.

ముంబై హైవే:

పెట్టుబడి పెట్టాలనుకుంటే హైదరాబాద్ సిటీకి 60 కి.మీ. పరిధిలో ఎక్కడైనా స్థలాలు కొనుక్కోవచ్చు. హైదరాబాద్-ముంబై హైవే మీద సంగారెడ్డి, రుద్రారం, సదాశివపేట, జహీరాబాద్ వరకూ ఎక్కడ తక్కువ ధరకు స్థలం దొరికితే అక్కడ కొనుక్కుంటే మంచి లాభాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే హైవేకి ఒకటి, రెండు కి.మీ. పరిధిలో ల్యాండ్ కొనుగోలు చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెబుతున్నారు. అయితే పెట్టుబడి మీద 25 నుంచి 30 శాతం రిటర్న్స్ వస్తాయని అంటున్నారు. తక్కువ రేటులో కొనాలంటే వ్యవసాయ భూములే కొనాలి. కనీసం ఒక 5 గుంటలు అంటే 600 గజాలు తీసుకుంటే రిటర్న్స్ అనేవి బాగుంటుంది. సంగారెడ్డి దగ్గర ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి. గజం 10 వేల నుంచి 11 వేలు రేంజ్ లో ఉన్నాయి. హైవే నుంచి కొంచెం లోపలకు వెళ్తే 9 వేలు పలుకుతున్నాయి. జహీరాబాద్ కి 30 కి.మీ పరిధిలో అయితే  గజం 3 వేల నుంచి 6 వేల రేంజ్ లోనే దొరుకుతున్నాయి. 600 గజాలకు 18 లక్షల నుంచి 36 లక్షలు అవుతుంది. 

బెంగళూరు హైవే:

బెంగళూరు హైవే చూసుకుంటే.. షాద్ నగర్ చుట్టుపక్కల 7 వేలు, 8 వేల నుంచి 12 వేల మధ్యలో స్థలాల రేట్లు ఉన్నాయి. రాజాపూర్, బాలానగర్, మహబూబ్ నగర్ ఏరియాల్లో కూడా ఇవే రేట్లు ఉన్నాయి. అయితే మహబూబ్ నగర్ కి అతి దగ్గరలో ఫార్మ్ ల్యాండ్స్ ని డెవలప్ చేస్తున్నారు. అక్కడ గజం స్థలాన్ని 2500కే అమ్ముతున్నారు. అంటే 600 గజాలకు 15 లక్షలు అవుతుంది. పదేళ్ళలో ఈ ఏరియా డ్రాస్టిక్ పెర్ఫార్మెన్స్ చూడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ ని కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే ఫ్యూచర్ లో కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. చదరపు అడుగు ప్రస్తుతం 300 రూపాయల లోపు ఉంటే.. రానున్న రోజుల్లో దాని విలువ కనీసం 3 వేల అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అప్పుడు గజం 27 వేలు అవుతుందని అంటున్నారు. ఈ లెక్కన 600 గజాల విలువ కోటి 62 లక్షలు అవుతుందని చెబుతున్నారు. రాబోయే పదేళ్లలో హైదరాబాద్ లో మాదిరి ఇక్కడ ల్యాండ్ రేట్లు పెరిగిపోతాయని అంటున్నారు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.