nagidream
కూకట్ పల్లి సమీపంలో ఫ్లాట్ కొనే ఆలోచనలో ఉన్నారా? తక్కువ ధరకు ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. గతంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు కొంచెం తగ్గాయి. ఇప్పుడు కొనడం వల్ల మీకు 4 లక్షలు ఆదా అవుతాయి.
కూకట్ పల్లి సమీపంలో ఫ్లాట్ కొనే ఆలోచనలో ఉన్నారా? తక్కువ ధరకు ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. గతంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు కొంచెం తగ్గాయి. ఇప్పుడు కొనడం వల్ల మీకు 4 లక్షలు ఆదా అవుతాయి.
nagidream
హైదరాబాద్ లో నార్త్, ఈస్ట్, వెస్ట్,సౌత్ జోన్స్ లో స్థలాల రేట్లు ఎలా ఉన్నాయో ఇది వరకే ఇవ్వడం జరిగింది. గత కథనంలో వెస్ట్ హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్ ధరలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఇచ్చాము. ఇవాళ్టి కథనంలో నార్త్ హైదరాబాద్ లో ఫ్లాట్ రేట్లు ఎలా ఉన్నాయో అనేది చూద్దాం. అయితే నార్త్ హైదరాబాద్ లో తక్కువ ధరకే 2 బీహెచ్కే ఫ్లాట్ 42 లక్షలకే అందుబాటులో ఉన్నాయి. అది కూడా కూకట్ పల్లి సమీపంలో అందుబాటులో ఉండడం విశేషం.
నార్త్ హైదరాబాద్ లో ఫ్లాట్ ధరలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో మియాపూర్, కూకట్ పల్లి, ప్రగతినగర్, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, అమీన్ పూర్, గాజుల రామారం, మల్లంపేట ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఏరియాల్లో మియాపూర్ నుంచి స్టార్ట్ మొదలు మల్లంపేట వరకూ.. చదరపు అడుగు ఫ్లాట్ ధర రూ. 6,900 నుంచి రూ. 4,650 రేంజ్ లో ఉన్నాయి. అంటే ఈ 9 ఏరియాల్లో గజం రూ. 41 వేల నుంచి 62 వేల రేంజ్ లో ఉన్నాయి. ఫ్లాట్ కొనాలంటే గజానికి కనీసం 41 వేలు పెట్టుకోవాలి. ఈ లెక్కన 2 బీహెచ్కే ఫ్లాట్ కావాలంటే 110 గజాలకి కనీసం 45 లక్షల అవుతుంది. గరిష్టంగా అయితే 70 లక్షలు అవుతుంది.
తక్కువగా ఉన్న ఏరియాల గురించి చెప్పాలంటే నార్త్ హైదరాబాద్ లో ఇస్నాపూర్, బీరంగూడ ఏరియాలు ఉన్నాయి. ఈ రెండు ఏరియాలు కూకట్ పల్లికి దగ్గరలో ఉన్నాయి. కూకట్ పల్లి నుంచి బీరంగూడ 14 కి.మీ. దూరంలో ఉంటే.. ఇస్నాపూర్ 23 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఏరియాలో ఫ్లాట్ కొనాలంటే చదరపు అడుగుకి రూ. 3,150 నుంచి రూ. 4,200 పడుతుంది. అదే బీరంగూడలో అయితే చదరపు అడుగుకి రూ. 4,250 పడుతుంది. ఇస్నాపూర్ లో 1000 చదరపు అడుగుల ఫ్లాట్ అంటే 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే రూ. 32 లక్షల లోపు అవుతుంది. అదే బీరంగూడలో 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే రూ. 42 లక్షలు అవుతుంది. అయితే గతంతో పోలిస్తే బీరంగూడలో ప్రస్తుతం ఫ్లాట్ ధరలు తగ్గాయి. 2022 జూలై-సెప్టెంబర్ నెలల్లో చదరపు అడుగు రూ. 4,600 ఉండేది. ఇప్పుడది రూ. 4,250గా ఉంది. అంటే 1000 చదరపు అడుగుల మీద రూ. 3,50,000 తగ్గినట్టే. మీరు 2 బీహెచ్కే ఫ్లాట్ కొన్నట్లైతే దగ్గర దగ్గర మీకు 4 లక్షలు ఆదా అయినట్టే.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు