iDreamPost
android-app
ios-app

Airtel నుంచి అదిరిపోయే ప్లాన్.. 149 ప్లాన్ తో 20 OTT సేవలు ఫ్రీ

  • Published Jul 15, 2024 | 10:48 PM Updated Updated Jul 15, 2024 | 10:48 PM

ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎయిర్ టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. 149 ప్లాన్ తో 20 ఓటీటీలను ఫ్రీగా పొందొచ్చు. అదనపు డేటాను కూడా పొందొచ్చు.

ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎయిర్ టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. 149 ప్లాన్ తో 20 ఓటీటీలను ఫ్రీగా పొందొచ్చు. అదనపు డేటాను కూడా పొందొచ్చు.

Airtel నుంచి అదిరిపోయే ప్లాన్.. 149 ప్లాన్ తో 20 OTT సేవలు ఫ్రీ

ఇటీవల టెలికాం సంస్థలు యూజర్లకు బిగ్ షాకిచ్చిన విషయం తెలిసిందే. రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. దీంతో మొబైల్ యూజర్లు ఉసూరుమంటున్నారు. అయితే మార్కెట్ లో తమ సత్తా చాటేందుకు టెలికాం కంపెనీలు కస్టమర్ల కోసం వివిధ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అన్ లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్, డైలీ 1జీబీ డాటా తో పాటు ఓటీటీలను ఫ్రీగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ లవర్స్ కోసం ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ. 149 ప్లాన్ తో 20 ఓటీటీలను పొందొచ్చు. ఓటీటీలక ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఎయిర్ టెల్ ఈ ఆఫర్ ను తీసుకొచ్చినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

థియేటర్ లో తమ అభిమాన నటుల సినిమాలు మిస్ అయిన వారు ఓటీటీలో విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలను యూజర్లకు ఫ్రీగా అందించేందుకు సూపర్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది ఎయిర్ టెల్. రూ. 149 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే యూజర్లు అదనంగా 1జీబీ డేటా పొందొచచు. మీకు అప్పటికే ఉన్న ప్లాన్‌కు యాడ్‌ ఆన్‌ లాగా యూజ్ అవుతుంది. మీకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్‌ వ్యాలిడిటీ ఆధారంగా ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ ఉంటుంది. ఇక ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే యాక్సెస్ పొందొచ్చు.

అలాగే ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే సోనీ లివ్‌, లయన్స్‌ గేట్‌ ప్లే, ఈరోస్‌ నౌతో పాటు మొత్తం 20 ఓటీటీ సేవలు పొందొచ్చు. ఈ ప్లాన్ తో ఓటీటీ లవర్స్ కు పండగే వారికి నచ్చిన కంటెంట్ ను చూడొచ్చు. ఎయిరట్ టెల్‌ యాప్‌ లేదా ఇతర పేమెంట్ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఈ రీఛార్జ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక ప్రధాన టెలికాం సంస్థలు టారీఫ్ ధరలను భారీగా పెంచడంతో మొబైల్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు మారేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. తక్కువ రీఛార్జ్ ప్లాన్ తో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, ప్రయోజనాలు అందిస్తుండడంతో బీఎస్ఎన్ఎల్ కు ఆదరణ పెరుగుతోంది.