iDreamPost

HYDలో 45 లక్షలకే 2 BHK ఫ్లాట్!.. ఇంతకంటే తక్కువకు మళ్ళీ దొరుకుద్దో లేదో

2BHK Flat For 45L: హైదరాబాద్ లో ఫ్లాట్ కొంటారా? అయితే ఈ ఏరియాలో ఒక లుక్ వేయండి. ఎందుకంటే ఇక్కడ ధరలు తగ్గాయి. పైగా సిటీలో మిగతా ఏరియాలతో పోలిస్తే ఇక్కడ సగం ధరకే దొరుకుతున్నాయి. ఫ్యూచర్ లో ఈ ధరలు పెరగవచ్చు.

2BHK Flat For 45L: హైదరాబాద్ లో ఫ్లాట్ కొంటారా? అయితే ఈ ఏరియాలో ఒక లుక్ వేయండి. ఎందుకంటే ఇక్కడ ధరలు తగ్గాయి. పైగా సిటీలో మిగతా ఏరియాలతో పోలిస్తే ఇక్కడ సగం ధరకే దొరుకుతున్నాయి. ఫ్యూచర్ లో ఈ ధరలు పెరగవచ్చు.

HYDలో 45 లక్షలకే 2 BHK ఫ్లాట్!.. ఇంతకంటే తక్కువకు మళ్ళీ దొరుకుద్దో లేదో

హైదరాబాద్ లో ఫ్లాట్ కొనాలని అనుకునుంటున్నారా? అయితే ఈ ఏరియా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా పీస్ ఫుల్ గా.. కొంచెం తక్కువ ధరకే అందుబాటులో ఫ్లాట్స్ ఉన్నాయి. కూకట్ పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రధాన లొకేషన్స్ కి 15 నుంచి 20 కి.మీ. దూరంలో ఉంది. కేవలం అరగంట ప్రయాణ దూరంలో ఉంది ఈ ఏరియా. ఈ ఏరియాలో ఇప్పుడు రేట్లు తగ్గాయి. కూకట్ పల్లి, మియాపూర్, హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో ఫ్లాట్ కొనాలంటే 70, 80 లక్షల నుంచి కోటి, కోటిన్నర పైనే పెట్టాల్సి ఉంటుంది. అదే ఈ ఏరియాలో పెట్టుబడి పెడితే కనుక మీకు సగం డబ్బులు ఆదా అవ్వడమే గాక ఫ్యూచర్ లో ధరలు పెరుగుతాయి. 

ఆ ఏరియా పటాన్ చెరువు. ప్రస్తుతం ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ డల్ అయ్యింది. దీని వల్ల ఇక్కడ కూడా ధరలు తగ్గాయి. గతంలో పలుమార్లు ధరలు తగ్గినప్పటికీ 2020లో చదరపు అడుగు రూ. 2,700 దగ్గర ఉండేది. 2021 వచ్చేనాటికి రూ. 3,300 అయ్యింది. 2022 వచ్చేనాటికి రూ. 3,750, 2023 వచ్చేనాటికి రూ. 4,300 పెరిగింది. 2023 ఏడాది చివరికి చదరపు అడుగు స్థలం రూ. 5 వేలకు పెరిగింది. సిటీలో ఉన్న ప్రధాన ఏరియాలతో ఇది పోటీ పడుతుంది. ధరలు తగ్గడంలో కూడా పోటీ పడడంతో ఇప్పుడు పటాన్ చెరువు ఏరియాలో కూడా అపార్ట్మెంట్ ధరలు తగ్గాయి. ఇక్కడ స్థలాల ధరలతో పాటు ఫ్లాట్ ధరలు తగ్గాయి. ఈ ఏడాది ప్రారంభంలో చదరపు అడుగు ఫ్లాట్ ధర రూ. 4,900 ఉండగా ఇప్పుడు యావరేజ్ గా రూ. 4,500 వద్ద కొనసాగుతుంది.

మీరు ఒక 2 బీహెచ్కే అంటే 1000 చదరపు అడుగుల స్థలం కొనాలని అనుకుంటే కనుక 45 లక్షలు అవుతుంది. 900 చదరపు అడుగుల్లో కూడా 2 బీహెచ్కే అవుతుంది. కాకపోతే 2 బెడ్ రూమ్స్, ఒక బాత్రూం, ఒక కిచెన్, హాల్ వస్తాయి. అప్పుడు మీకు 40 లక్షల్లో 1 బీహెచ్కే కంటే పెద్ద ఫ్లాట్ వస్తుంది. 1 బీహెచ్కే కొనుక్కోవాలనుకుంటే కనుక కనీసం 27 లక్షల 30 లక్షలు అవుతుంది. కానీ 1 బీహెచ్కే ఫ్లాట్స్ కొనడం కంటే కూడా 2 బీహెచ్కే కొనడమే మంచిది. ఎందుకంటే ఫ్యూచర్ లో అమ్మాలనుకున్నా బయ్యర్స్ త్వరగా దొరుకుతారు. ఎందుకంటే 1 బీహెచ్కే ఫ్లాట్స్ కొనేవారు తక్కువ. ఇప్పటికే తగ్గిపోయారు. ఫ్యూచర్ లో అస్సలు దొరకరు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి