iDreamPost
android-app
ios-app

HYDలో రూ.49 లక్షలకే 2 BHK ఫ్లాట్! ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు

  • Published May 06, 2024 | 6:21 PM Updated Updated May 06, 2024 | 6:21 PM

హైదరాబాద్ లో అన్ని జోన్స్ లో స్థలాల రేట్లు ఎలా ఉన్నాయనే దాని మీద ఇప్పటికే కథనాలు ఇచ్చి ఉన్నాం. ఇవాళ వెస్ట్ హైదరాబాద్ లో ఫ్లాట్ రేట్లు ఎలా ఉన్నాయి? ఏ ఏరియాలో తక్కువగా ఉన్నాయి? అనే వివరాలు మీ కోసం. 

హైదరాబాద్ లో అన్ని జోన్స్ లో స్థలాల రేట్లు ఎలా ఉన్నాయనే దాని మీద ఇప్పటికే కథనాలు ఇచ్చి ఉన్నాం. ఇవాళ వెస్ట్ హైదరాబాద్ లో ఫ్లాట్ రేట్లు ఎలా ఉన్నాయి? ఏ ఏరియాలో తక్కువగా ఉన్నాయి? అనే వివరాలు మీ కోసం. 

HYDలో రూ.49 లక్షలకే 2 BHK ఫ్లాట్! ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు

ఈస్ట్ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్ ఏరియాల్లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయో అనే వివరాలు ఇప్పటికే వెబ్ సైట్ లో ఇచ్చి ఉన్నాం. ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లోని ఆయా జోన్స్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ధరలు ఎలా ఉన్నాయి? ఎక్కడ తక్కువగా ఉన్నాయి? అనే వివరాలను ఇవ్వనున్నాం. ఈ కథనంలో మాత్రం వెస్ట్ హైదరాబాద్ లో ఎక్కువ ధరలు పలికే ఫ్లాట్స్, తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఫ్లాట్స్ ఏ ఏ ఏరియాల్లో దొరుకుతాయో అనే వివరాలు మీ కోసం.  

ఎక్కువ ధర పలికే ఏరియాలు:

వెస్ట్ హైదరాబాద్ లో ఎక్కువ ధర పలికే ఏరియాల్లో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట, నానక్ రామ్ గూడ, కొండాపూర్, కొత్తగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, నార్సింగి, ఖాజాగూడ, నల్లగండ్ల, పుప్పాలగూడ, గోపన్నపల్లి, అప్పా జంక్షన్, మణికొండ, నెక్నాంపూర్, హఫీజ్ పేట్, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, మదీనాగూడ ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ ఫ్లాట్ కొనాలంటే చదరపు అడుగుకి 12 వేల నుంచి 6500 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే ఈ ఏరియాల్లో రూ. 65 లక్షల నుంచి కోటి 25 లక్షల రేంజ్ లో ఉంటుంది. వన్ బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే 40 లక్షల నుంచి 75 లక్షల మధ్య అవుతుంది. అది కూడా దొరకడం కష్టమే.

తక్కువ ధర పలికే ఏరియాలు:

ఇక తక్కువ ధర పలికే ఏరియాల గురించి చెప్పుకోవాలంటే.. కిస్మత్ పుర, చందానగర్, మోకిలా, కొల్లూర్, పటాన్ చేరు ఏరియాలు ఉన్నాయి. ఈ ఏరియాల్లో అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనాలంటే చదరపు అడుగు రూ. 5950 నుంచి రూ. 4900 రేంజ్ లో ఉన్నాయి. ఈ ఏరియాల్లో 2 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనాలంటే రూ. 49 లక్షల నుంచి 60 లక్షల రేంజ్ లో ఉంటుంది. అదే వన్ బీహెచ్కే అయితే రూ. 30 లక్షల నుంచి రూ. 36 లక్షల రేంజ్ లో ఉంటుంది. వెస్ట్ హైదరాబాద్ లో బాగా తక్కువ రేటుకి ఫ్లాట్లు దొరికే ఏరియా అంటే పటాన్ చేరు మాత్రమే. అది కూడా రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉన్న ఏరియా. ఆ తర్వాత కొల్లూర్, మోకిలా, చందానగర్, కిస్మత్ పుర ఏరియాల్లో తక్కువ ఉన్నాయి.   

చదరపు అడుగుల్లో ఫ్లాట్ రేట్లు:

  • హైటెక్ సిటీ: రూ. 12,500/-
  • గచ్చిబౌలి: రూ. 10,650/-
  • కోకాపేట: రూ. 10,600/-
  • నానక్ రామ్ గూడ: రూ. 10550/-
  • కొండాపూర్: రూ. 10200/-
  • కొత్తగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్: రూ. 10,000/-
  • మాదాపూర్, నార్సింగి, ఖాజాగూడ: రూ. 9,950/-
  • నల్లగండ్ల: రూ. 9,850/-
  • పుప్పాలగూడ: రూ. 9,500/-
  • గోపన్నపల్లి: రూ. 8,650/-
  • అప్పా జంక్షన్: రూ. 8,100/-
  • మణికొండ: రూ. 7,750/-
  • నెక్నాంపూర్: రూ. 7,700/-
  • హఫీజ్ పేట్: రూ. 7,650/-
  • తెల్లాపూర్: రూ. 7,150/-
  • ఉస్మాన్ నగర్: రూ. 6,750/-
  • మదీనాగూడ: రూ. 6,500/-
  • కిస్మత్ పుర: రూ. 5,950/-
  • చందానగర్: రూ. 5,900/-
  • మోకిలా: రూ. 5,850/-
  • కొల్లూర్: రూ. 5,250/-
  • పటాన్ చేరు: రూ. 4,900/-

మీకు గజాల్లో రేట్లు కావాలనుకుంటే గనుక  చదరపు అడుగుని 9తో గుణించండి. ఉదాహరణకు పటాన్ చేరునే తీసుకుంటే.. ఇక్కడ చదరపు అడుగు ధర రూ. 4900. ఈ సంఖ్యని 9తో గుణిస్తే 44,100 వస్తుంది. ఇదే గజం ధర. స్థలాల కైనా, ఫ్లాట్స్ కైనా ఇదే లెక్క. ఒక గజం విలువ 9 చదరపు అడుగులు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.