Tirupathi Rao
సాధారణంగా కారు ధర అంటే లక్షల్లో ఉంటుంది. మరీ లగ్జరీ అయితే కోట్లలో ఉంటుంది. కానీ, వందలకోట్లు ఉండటం ఎప్పుడైనా చూశారా? ఈ కారు కొనే డబ్బుతో ఏకంగా విమానం కొనేయచ్చు.
సాధారణంగా కారు ధర అంటే లక్షల్లో ఉంటుంది. మరీ లగ్జరీ అయితే కోట్లలో ఉంటుంది. కానీ, వందలకోట్లు ఉండటం ఎప్పుడైనా చూశారా? ఈ కారు కొనే డబ్బుతో ఏకంగా విమానం కొనేయచ్చు.
Tirupathi Rao
కారు కొనాలి అనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే ఎవరి బడ్జెట్ కి తగ్గట్లు వాళ్లు కారుని సెలక్ట్ చేసుకుంటారు. కొందరు ఐదారు లక్షల్లోపు కారుని కొంటే ఇంకొందరు రూ.50 లక్షల్లో కొనచ్చు. మరికొంతమంది ఐదారు కోట్లు పెట్టి కారు కొనచ్చు. కానీ, వందల కోట్లు పెట్టి కారు కొనడం ఎప్పుడైనా చూశారా? కనీసం అంత ధర పలికే కారు ఉంటుందని మీకు తెలుసా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ కారు తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ కారు ధర కొన్ని వందల కోట్లు ఉంది కాబట్టి. అంతేకాదండోయ్.. ఈ కారు కొనే డబ్బుతో మీరు ఏకంగా విమానాన్నే కొనుగోలు చేయచ్చు.
సాధారణంగా మీరు ఖరీదైన కారు ఏది అంటే రోల్స్ రాయిస్ పేరు చెబుతారు. రోల్స్ రాయిస్ లో బోట్ టెయిల్ అనే కారు ధర 28 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. అయితే చాలా మంది అదే అత్యంత ఖరీదైనా కారు అంటారు. కానీ, ఇప్పుడు ఫెరారీ కంపెనీకి చెందిన ఒక కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ కంటే కూడా రెట్టింపు ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 1962 సంవత్సరానికి చెందిన ఈ ఫెరారీ 250 జీటీవో వేలంలో ఏకంగా 51.7 మిలియన్ డాలర్లు పలికింది. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.450 కోట్ల కంటే కూడా ఎక్కువనమాట. ఇంత ధర పలికింది అందులో అంత ప్రత్యేకత ఏంటి అనే ప్రశ్న అందరికీ కలగచ్చు. నిజానికి ఆ కారు కొనే ధరతో ఏకంగా విమానాన్నే కొనుగోలు చేయచ్చు. కానీ, కొందరికి కొన్ని అలవాట్లు, అభిరుచులు ఉంటాయి. వాటికి అనుగుణంగా తీసుకునే నిర్ణయాలు ఇంతే ఖరీదైనవిగా ఉంటాయి. ఈ ఫెరారీ 250 జీటీవో కారు స్టార్టింగ్ లో 4.0 లీటర్ సిలిండర్ ఇంజిన్ తో వచ్చేది. ఈ కారు 7500 ఆర్పీఎం వద్ద 3,910 హార్స్ పవర్ ని ప్రొడ్యూస్ చేసేది. కాలక్రమంలో ఈ కారును 3.0 లీటర్ జీటీవో డెవలప్మెంటల్ ఇంజిన్ ని ఫిక్స్ చేశారు.
ఈ కారును రేసింగ్ కి ఎక్కువగా వాడే వాళ్లు. ఈ కారు ఫెరారీ క్లబ్ ఆఫ్ అమెరికా ఛైర్మన్ యాజమాన్యంలో ఉండేది. ఇది 1965 సిసిలియన్ హిల్ క్లైంబ్ ఛాంపియన్ షిప్ లో రన్నరప్ గా నిలిచింది. కావల్లినో క్లాసిక్ లో ఎఫ్ సీఎస్ ప్లాటినం అవార్డును సొంతం చేసుకుంది. కొప్పా బెల్లా మచినా అవార్డును కైవసం చేసుకుంది. మీరు ఈ కారు గురించి వినగానే ప్రపంచంలో కెల్లా అత్యధిక ధరకు అమ్ముడైన కారు ఇదే అని ఫిక్స్ అయిపోకండి. ఎందుకంటే గతేడాది ఒక మెర్సిడీజ్ బెంజ్ కారు ఏకంగా రూ.1202 కోట్లకు అమ్ముడైంది. ఇప్పటివరకు జరిగిన వేలాల్లో అత్యధిక ధరకు అమ్ముడైన కారు అదే. ఆ కారు వివరాలు ఏంటంటే.. అది మెర్సిడీజ్ 300 ఎస్ఎల్లార్ ఉహ్లెన్ హాట్ కూప్. దీనిని జర్మనీలో లాస్ట్ ఇయర్ వేలం వేశారు. ఆ వేలంలో ఇది 135 మిలియన్ యూరోస్ కి కొనుగోలు చేశారు. ఆ కారు ఎక్స్ ఛేంజ్ ధర ఇప్పుడు 144 మిలియన్ డాలర్లు ఉంటుందన్నారు. మరి.. ఒక కారుని రూ.450 కోట్లు పెట్టి కోనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A 1962 Ferrari 250 GTO sports car sold for $51.7 million in New York on Monday, Sotheby’s sayshttps://t.co/zQaq0mam1s pic.twitter.com/ZpqTbMGZPa
— AFP News Agency (@AFP) November 14, 2023