iDreamPost
android-app
ios-app

15 ఏళ్లకే వంద కోట్ల కంపెనీకి యజమాని.. ఎలా అయ్యాడంటే..?

15 ఏళ్లు కూడా నిండని పిల్లవాడిని టీచర్ కానీ, బయట వ్యక్తులు కానీ నిందిస్తే.. ఆ చిన్న పిల్లవాడు.. వాడికేం తెలుసండి అంటుంటారు సాధారణంగా తల్లిదండ్రులు. అలాగే ఏదైనా సందేహం వచ్చినా, సమస్య వచ్చినా తండ్రిని అడిగితే.. పిల్లోడివి, పిల్లోడిలా ఉండు అంటుంటారు.. కానీ..

15 ఏళ్లు కూడా నిండని పిల్లవాడిని టీచర్ కానీ, బయట వ్యక్తులు కానీ నిందిస్తే.. ఆ చిన్న పిల్లవాడు.. వాడికేం తెలుసండి అంటుంటారు సాధారణంగా తల్లిదండ్రులు. అలాగే ఏదైనా సందేహం వచ్చినా, సమస్య వచ్చినా తండ్రిని అడిగితే.. పిల్లోడివి, పిల్లోడిలా ఉండు అంటుంటారు.. కానీ..

15 ఏళ్లకే వంద కోట్ల కంపెనీకి యజమాని.. ఎలా అయ్యాడంటే..?

బుర్రలో గుజ్జు ఉండాలే కానీ..విజయం సాధించేందుకు చిన్నా, పెద్దా అనే తేడా ఉండదు. వయస్సుతో సంబంధం లేదు. తెలివితేటలు, కష్టపడే మనస్తత్వం ఉంటే గెలుపు కాళ్ల కింద సాగిలపడుతుంది అని నిరూపించాడో కుర్రాడు. నూనూగు మీసాలు కూడా మొలవని ఓ బాలుడి విజయ గాథ ఇది. ఓటు హక్కు కూడా రాని ఆ కుర్రాడు.. ఓ వ్యాపారాన్ని పెట్టి..కోట్లకు అధిపతి అయ్యాడు. తోటి పిల్లల్లాగా ఇల్లు, బడి, చదువు, ఆడుకోవడమే ప్రపంచంగా బతకాల్సిన బాలుడు.. పది మందికి ఉద్యోగాలు ఇస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కేవలం ఒక ఐడియానే అతడి జీవితాన్ని మార్చడానికి కారణమైంది. ఏకంగా వంద కోట్ల కంపెనీకి యజమానిని చేసింది. ఇంతకు అతడు ఎవరూ.. అతడి సక్సెస్ స్టోరీ ఏంటంటే..?

అతడి పేరు తిలక్ మెహతా.. 2008లో గుజరాత్‌లో జన్మించిన ఈ కుర్రాడు.. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నాడు. తిలక్ తండ్రి విశాల్.. ఓ లాజిస్టిక్స్ కంపెనీలో పని చేస్తుండటంతో.. అతడి కుటుంబం ముంబయికి మారాల్సి వచ్చింది. అమ్మ గృహిణి. అతడికి ఓ సోదరి కూడా ఉంది. బుద్దుడికి బౌద్ద వృక్షం కింద  జ్ఞానోదయం అయినట్లు.. ఓ ఇన్సిడెంట్ అతడిని వ్యాపారిగా మార్చేసింది. అదేంటంటే..  ఓ రోజు ఆఫీసు నుండి తండ్రి బాగా అలసిపోయి వచ్చాడు. తనకు చదువుకు సంబంధించిన పుస్తకాలు, ఇతర వస్తువులు వస్తూ వస్తూ తీసుకురావాలని తండ్రిని అడిగాడు. అయితే పని ఒత్తిడితో అలసిపోయిన తండ్రి విశాల్.. వాటిని తీసుకురాలేదు. తండ్రిని అడగ్గా.. తాను తేలదని, అంత అవసరం ఉంటే వెళ్లి తెచ్చుకో అని కొడుక్కి చెప్పాడు. దీంతో తన అవసరం కోసం వెళ్లి తెచ్చుకోక తప్పలేదు తిలక్.

అప్పుడే వచ్చింది అతడికి ఓ బ్రహ్మండమైన ఐడియా. తల్లిదండ్రులు ఇతర పనులు, వ్యాపకాల వల్ల తనలా స్టేషనరీ వస్తువులు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, తన లాంటి బాధితులు చాలా మంది ఉన్నారని గ్రహించి.. దీనికో పరిష్కారం వెతకాలని అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ.. పుస్తకాలు, స్టేషనరీ డెలివరీ చేసే సర్వీస్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందబ్బా అని దీర్ఘ ఆలోచన చేశాడు. ఈ విషయాన్ని తండ్రికి చెప్పాడు. అలా తన వ్యాపారానికి బీజాలు పడ్డాయి. దానికి సంబంధించిన పూర్తి ప్రణాళిక తండ్రికి చెప్పడంతో.. కొడుకు ఉత్సాహాన్ని చూసి వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి సమకూర్చాడు విశాల్. వ్యాపారం కాస్త వృద్ధి చెందాక.. మరింత అభివృద్ధి కోసం ఇన్వెస్టర్ల కోసం వెతికారు.

తండ్రి సాయంతో తన వ్యాపారం గురించి ఓ బ్యాంకు అధికారికి వివరించాడు తిలక్. ఆ ఐడియా నచ్చిన బ్యాంకు అధికారి.. కొంత పెట్టుబడి పెట్టాడు. అలా వచ్చిందే.. పేపర్స్ ఎన్ పార్సెల్స్. ఆ పేరుతో కొరియర్ సర్వీస్ ప్రారంభించారు. బ్యాంకు ఉద్యోగి కూడా.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి..ఆ వ్యాపారంలోనే చేరిపోయాడు. ఆన్ లైన్ లో బుక్ చేసిన అదే రోజు స్మాల్ పార్సెల్స్, డాక్యుమెంట్లు, స్టేషనరీ వస్తువులు అందిస్తారు. ప్రతి పార్సీల్ కు రూ. 40 నుండి రూ. 180 వసూలు చేస్తుంటారు. ముంబయి వ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సుమారు 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డబ్బావాలా ఉద్యోగుల సహకారంతో రోజుకు 1200 డెలివరీలు అందిస్తున్నారు. అలా వంద కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు.  మరీ ఈ అబ్బాయి తెలివి తేటలకు ఫిదా అవ్వకుండా ఉండలేకపోతున్నారు కదా.. ఏమంటారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.