P Venkatesh
దేశంలో 11.5 కోట్ల పాన్ కార్డులు రద్దయ్యాయి. ఆధార్ తో పాన్ లింక్ చేయని కారణంగా డీయాక్టివేట్ చేసినట్లు సీబీడీటీ వెల్లడించింది. మరి మీ కార్డు యాక్టివేట్ లో ఉందా లేదా అనే విషయాన్ని ఈ క్రింద తెలిపిన విధంగా తెలుసుకోండి.
దేశంలో 11.5 కోట్ల పాన్ కార్డులు రద్దయ్యాయి. ఆధార్ తో పాన్ లింక్ చేయని కారణంగా డీయాక్టివేట్ చేసినట్లు సీబీడీటీ వెల్లడించింది. మరి మీ కార్డు యాక్టివేట్ లో ఉందా లేదా అనే విషయాన్ని ఈ క్రింద తెలిపిన విధంగా తెలుసుకోండి.
P Venkatesh
ఆధార్ కార్డు మాదిరిగానే పాన్ కార్డుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఐడెంటిటి ప్రూఫ్ కోసం, బ్యాంక్ లావాదేవీలు. అకౌంట్ ఓపెన్ చేయడానికి, వాహనాలు కొనుగోలు చేసే సమయంలో, డీ మ్యాట్ అకౌంట్ ఓపెన్, ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి ఇంకా ఇతర సందర్భాల్లో పాన్ కార్డు అవసరం పడుతోంది. అయితే కొంత కాలం నుంచి పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. లింక్ చేసుకునేందుకు గడువును కూడా ఇచ్చింది. కానీ కొంత మంది మాత్రం ఆధార్ తో పాన్ లింక్ చేసుకోలేదు. అటువంటి కార్డ్స్ అన్నింటిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ డీయాక్టివేట్ చేసింది. ఆధార్ తో పాన్ లింక్ అవ్వని 11.5 కోట్ల పాన్ కార్డులను రద్దు చేసింది.
ఆధార్ కార్డ్ ను పాన్ కార్డ్ తో అనుసంధానం చేయడం తప్పని సరి. పాన్ కార్డు, ఆధార్ కార్డులను లింక్ చేసుకునే గడువు ఈ సంవత్సరం జూన్ 30 తో ముగిసింది. గడువులోగా ఆధార్ తో పాన్ లింక్ చేయని కార్డులు చెల్లకుండా పోయాయి. ఆధార్ కార్డు తో లింక్ చేయని మొత్తం 11.5 కోట్ల పాన్ కార్డు లను ఇప్పటివరకు డీ యాక్టివేట్ చేసినట్లు సీబీడీటీ వెల్లడించింది. భారత్ లో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. వాటిలో సుమారు 11.5 కోట్ల పాన్ కార్డులను డీ యాక్టివేట్ చేశారు. మధ్య ప్రదేశ్ కు చెందిన సమాచార హక్కు కార్యకర్త చంద్ర శేఖర్ అడిగిన ప్రశ్నకు సీబీడీటీ ఈ సమాధానం ఇచ్చింది.
అయితే పాన్ కార్డు డీయాక్టివేట్ అయిన వారు, ఇప్పటి వరకు అనుసంధానం చేసుకోని వారు రూ. 1000 చెల్లించి పాన్ కార్డును మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికంటే ముందుగా, మీ పాన్ కార్డు యాక్టివ్ గా ఉందా? లేక డీయాక్టివేట్ అయిందా అనే విషయాన్ని ఇలా తెలుసుకోండి.
ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ అధికారిక వెబ్ సైట్ www.incometax.gov.in/iec/foportal/ ను ఓపెన్ చేయాలి.
హోం పేజీలో ఎడమవైపు కనిపించే Link Aadhaar Status ను క్లిక్ చేయాలి.
మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ లను ఎంటర్ చేయాలి.
View Link Aadhaar Status’ పై క్లిక్ చేయాలి.
మీ పాన్, ఆధార్ నంబర్లు లింక్ అయ్యాయో లేదో తెలిసిపోతుంది.