1 BHK లేదా 2 BHK ఫ్లాట్.. ఏది కొనడం బెటర్.. ఖచ్చితంగా తెలుసుకోవాలి..

1 BHK vs 2 BHK Which Is Better?: హైదరాబాద్ లాంటి నగరాల్లో ఫ్లాట్ కొనాలంటే ఫస్ట్ ఆలోచించేది 1 బీహెచ్కే ఫ్లాట్ కొనాలా? లేక 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలా? అని. ఈ రెండు విషయాల్లో చాలా మందిలో సందిగ్ధత నెలకొంటుంది. ఈ కథనంలో మీరు ఏది కొనుక్కుంటే మంచిది అనే విషయాలు తెలుసుకోండి.

1 BHK vs 2 BHK Which Is Better?: హైదరాబాద్ లాంటి నగరాల్లో ఫ్లాట్ కొనాలంటే ఫస్ట్ ఆలోచించేది 1 బీహెచ్కే ఫ్లాట్ కొనాలా? లేక 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలా? అని. ఈ రెండు విషయాల్లో చాలా మందిలో సందిగ్ధత నెలకొంటుంది. ఈ కథనంలో మీరు ఏది కొనుక్కుంటే మంచిది అనే విషయాలు తెలుసుకోండి.

హైదరాబాద్ లాంటి సిటీల్లో స్థలం కొని ఇల్లు కొనడం.. కొన్నాక నిర్మాణం కోసం కొన్ని నెలల పాటు వెయిట్ చేయడం ఇవన్నీ కష్టమని చెప్పి చాలా మంది కట్టేసిన ఇళ్లను, ఫ్లాట్స్ ని కొనేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. స్థలం ధరకే ఫ్లాట్ వచ్చేస్తుండడంతో దాన్ని కొనేందుకు వెనుకాడడం లేదు. అయితే ఫ్లాట్ కొనాలి అనుకున్నప్పుడు మదిలో మెదిలే అంశం.. 1 బీహెచ్కే కొనాలా? 2 బీహెచ్కే కొనాలా? అని. అసలు ఏది కొంటే మంచిది? 1 బీహెచ్కే ఫ్లాట్ కొంటే లాభమా? 2 బీహెచ్కే ఫ్లాట్ కొంటే లాభమా? అనేది ఇప్పుడు చూద్దాం. 

చిన్న కుటుంబం.. సింపుల్ గా లైఫ్ ని లీడ్ చేసేయాలి అనుకున్నవారికి 1 బీహెచ్కే సరిపోతుంది. పైగా భారం కూడా తగ్గుతుంది. ఫ్యూచర్ లో అవసరాలు మారతాయి, పిల్లలు ఎదుగుతారు వారి గురించి ఆలోచించాలి వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం 1 బీహెచ్కే ఫ్లాట్ కొనే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటే మంచిది. 2 బీహెచ్కే కొనాలనుకునేవాళ్ళు కళ్ళు మూసుకుని హ్యాపీగా కొనేయవచ్చు. 1 బీహెచ్కే ఫ్లాట్ కొంటే బడ్జెట్ భారం తగ్గుతుందన్న మాటే గానీ దాని వల్ల పెద్దగా లాభాలు ఉండవు. 2 బీహెచ్కేతో పోలిస్తే కాస్త ఇరుకుగా ఉంటుంది. ఫ్యూచర్ లో పిల్లలు ఎదిగినా, ఇంట్లో సామాన్లు ఎక్కువ కొనుక్కున్నా గానీ ఇబ్బంది అవుతుంది. పిల్లలు తిరగడానికి కూడా ఉండదు.

1 బీహెచ్కేలోనే విశాలంగా ఉన్న ఫ్లాట్స్ తీసుకుంటే పర్లేదు. అయితే బాత్రూంకి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు ఎదిగే సమయానికైనా 2 బాత్రూమ్స్ ఉండడం మంచిది. ఒకే బాత్రూమ్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులు వచ్చినా కూడా ఇబ్బందే. అయితే రెండు బాత్రూంలు, ఒక హాల్, కిచెన్, ఒక బెడ్ రూమ్ తో 1 బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి. లేదా ఒకే బాత్రూం హాల్ లో ఉండేవి ఉన్నాయి. ఇలాంటి ఫ్లాట్స్ కొనుక్కుంటే పర్లేదు. అయితే ఫ్యూచర్ లో అమ్మాలి అన్న ఉద్దేశం ఉంటే మాత్రం 1 బీహెచ్కే ఫ్లాట్ కొనకపోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పటికే 1 బీహెచ్కే ఫ్లాట్స్ కొనేవారు తక్కువైపోయారు.

చాలా మంది 2 బీహెచ్కే, 3 బీహెచ్కే ఫ్లాట్స్ ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇరుకుగా ఉండడానికి, చిన్న ఫ్లాట్ లో ఉండడానికి సర్దుకుపోయే విధంగా నేటి తరం ఉండడం లేదు. కష్టపడుతున్నాం కదా.. ఇంటికి పెట్టుబడి పెడితే ఏమవుతుంది అని చెప్పి 2,3 బీహెచ్కే ఫ్లాట్స్ కి వెళ్లిపోతున్నారు. కాబట్టి భవిష్యత్తులో అమ్ముదాం అనుకున్నా కొనేవారు ఉండరు. అదృష్టం బాగుంటే రావచ్చు గానీ అది కూడా కష్టమే. బడ్జెట్ పరంగా తక్కువలో వస్తుంది.. ఫ్యూచర్ లో అమ్మే పని లేదు అనుకుంటే 1 బీహెచ్కే బెటర్. లేదు ఫ్యూచర్ లో అమ్మే ఉద్దేశం ఉంది.. రాజీపడకుండా కాస్త సౌకర్యంగా జీవించాలి అనుకుంటే కనుక 2 బీహెచ్కే బెటర్.  ఒకవేళ అద్దెకు ఇచ్చుకున్నా గానీ 1 బీహెచ్కేతో పోలిస్తే 2 బీహెచ్కేకి ఎక్కువ అద్దె వస్తుంది.

Show comments