Krishna Kowshik
బిగ్ బాస్ సీజన్ 8.. గొడవలు, అలకలు, టాస్కులు, అరుపులతో బుల్లితెర ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. మూడవ వారంలోకి అడుగుపెట్టిన ఈ షో మరింత రసవత్తరంగా మారింది. రేషన్ కోసం రెండు టీమ్స్ మధ్య టాస్కుల చిచ్చు మొదలైంది.
బిగ్ బాస్ సీజన్ 8.. గొడవలు, అలకలు, టాస్కులు, అరుపులతో బుల్లితెర ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. మూడవ వారంలోకి అడుగుపెట్టిన ఈ షో మరింత రసవత్తరంగా మారింది. రేషన్ కోసం రెండు టీమ్స్ మధ్య టాస్కుల చిచ్చు మొదలైంది.
Krishna Kowshik
బిగ్ బాస్ సీజన్ 8 మూడవ వారంలోకి అడుగుపెట్టింది. గత రెండు ఎలిమినేషన్లలో ఇంట్లోకి జంటగా అడుగుపెట్టిన బెజవాడ బేబక్క, శేఖర్ భాషా బయటకు వచ్చేశారు. ఇప్పుడు రెండు క్లాన్స్‌గా డివైడ్ అయ్యారు కంటెస్టెంట్స్. అభయ్ నవీన్, నిఖిల్ చీఫ్స్‌గా ఎన్నికయ్యారు. మూడవ వారంలోకి ఎంటరైన బిగ్ బాస్‌లో నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఒకరిపై ఒకరు వాగ్భాణాలతో చిన్న యుద్దాన్నే సృష్టించారు. ముఖ్యంగా యష్మీ గౌడపై నాగ మణికంఠ, సోనియా ఆకుల ఫైర్ అయ్యారు. యష్మీ కూడా ఏ మాత్రం తగ్గకుండా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసింది. నాగార్జున అన్ని చీవాట్లు పెట్టినా.. నాగ మణికంఠపై అబ్యూస్ లాంగ్వేజ్ వినియోగించింది. మొత్తంగా ఎనిమిది మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. ఇక ఎవరి రేషన్ వాళ్లు సంపాదించుకునేందుకు టీమ్స్‌కు టాస్క్‌లు ఇచ్చాడు బిగ్ బాస్.
తొలి టాస్క్ ఫోటో పెట్టులో బరిలోకి దిగారు శక్తి టీం (నిఖిల్ టీం) నుండి పృధ్వీ, కాంతార టీం (అభయ్ టీం) నుండి నబీల్. దీనికి సీతను సంచాలక్‌గా నియమించారు. నబీల్ అండ్ పృధ్వీ మధ్య గెలవాలన్న కసి కన్నా.. పక్కనోడిని ఓడించాలన్న ధ్యేయంగానే ఈ పోరు సాగింది. ఇద్దరు ఒకరినొకరు దాడి చేసుకుంటూ ఫిజికల్ టాస్క్ చేసుకున్నారు. సీత ఇద్దర్ని నియంత్రించేందుకు ప్రయత్నించిన.. ఇతర కుటుంబ సభ్యులు ఇద్దర్ని రెచ్చగొట్టడంతో రెచ్చిపోయారు. చివరకు నబీల్ కాస్తంత మైండ్ గేమ్ ఉపయోగించడంతో చివరకు కాంతార టీం విన్ అయ్యింది. ఇక సెకండ్ టాస్క్‌లో భాగంగా కొన్ని క్యాబేజీలను ఇచ్చి.. నత్తలా పాకుతూ.. గమ్యస్థానానికి చేర్చాలని చెప్పాడు బిగ్ బాస్. దీనికి నాగ మణికంఠను సంచాలక్‌గా నియమించాడు. ఇందులో శక్తి టీం నుండి లీడర్ నిఖిల్, సోనియా పోటీ చేయగా.. కాంతార టీం నుండి ఆదిత్య ఓం, ప్రేరణ గ్రౌండ్‌లోకి దిగారు.
నిఖిల్, సోనియా చకా చకా క్యాబేజీలను గమ్య స్థానానికి చేర్చారు. లాస్ట్ క్యాబేజీ కంప్లీట్ కాగానే.. గేమ్ ముగిసిపోయింది అంటూ నాగ మణికంఠ డిక్లేర్ ఇచ్చాడు. అప్పుడు బజర్ మోగింది. దీంతో ప్రేరణ మణిపై గొడవకు దిగింది. క్యాబేజీలు అయిపోతే.. సంచాలక్‌గా తిరిగి తీసుకు వచ్చి పెట్టాలని ఫైర్ అయ్యింది. కానీ నాగ మణికంఠ క్లారిటీ ఇచ్చేందకు ప్రయత్నించాడు. అక్కడ 15 క్యాబేజీలు మాత్రమే ఉన్నాయని, ఎవరు ముందు ఎక్కువ క్యాబేజీలను చేరవేస్తే.. వారే విన్ అవుతారని చెప్పాడు. మళ్లీ మళ్లీ క్యాబేజీలను ఫిల్ చేస్తుంటే గేమ్ కంటిన్యూ అవుతూనే ఉంటుందని, అది కరెక్ట్ కాదు.. ఫాస్ట్‌గా ఆడి..ఉన్న క్యాబేజీల్లో ఏ టీం ఎక్కువ గమ్యస్థానాలకు చేర్చితే ఆ గ్రూపే గెలుస్తుందని చెప్పేందుకు ప్రయత్నించాడు.
సంచాలక్‌గా తను క్లారిటీగానే ఉన్నా.. తను నిజాయితీగా ఆడినా, తన డెసిషన్ కరెక్టే అయినా కూడా ప్రేరణ, యష్మీ గౌడ వినిపించుకోకుండా మణితో గొడవపడుతూనే ఉన్నారు. చివరకు బిగ్ బాస్ ఎవరు విన్ అయ్యారని చెప్పగా.. శక్తి టీం గెలిచిందని చెప్పాడు. ఇక మూడో టాస్క్‌లో కూడా గట్టి ఫైటే జరిగింది. బెలూన్ టాస్క్‌లో అభయ్, నిఖిల్ బరిలోకి దిగగా.. ఈ గేమ్ కూడా రచ్చ రచ్చ అయ్యింది. దీనికి సోనియా ఆకుల సంచాలక్‌గా వ్యవహరించింది. ఆమె బయాస్‌గా ఉందంటూ యష్మీ గౌడ మరోసారి రెచ్చిపోయింది. ఇందులో కూడా శక్తి టీం విన్ అయ్యింది. అది యాక్సెప్ట్ చేయలేదు కాంతార టీం. ఈరోజు విడుదల చేసిన ప్రోమోలో నిఖిల్, యష్మీగౌడ మధ్య పెద్ద వారే నడుస్తున్నట్లు కనిపిస్తుంది. మరీ సంచాలక్‌గా నాగ మణికంఠ నిర్ణయం రైటా రాంగా..? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.