iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: బిగ్ బాస్ ఓటింగ్స్ లో షాకింగ్ రిజల్ట్స్.. నాగ మణికంఠ టాప్ ప్లేస్ లోకి!

Bigg Boss Telugu 8 Voting- Naga Manikanta In Top: బిగ్ బాస్ హౌస్ లో తొలివారం నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు ఇంటి సభ్యులు నామినేషన్స్ లోకి వచ్చారు. మరి.. వారిలో ఎవరు టాప్ లో ఉన్నారు? ఎవరు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు? ఎవరికి ఎలాంటి ఓటింగ్ జరుగుతోందో చూద్దాం.

Bigg Boss Telugu 8 Voting- Naga Manikanta In Top: బిగ్ బాస్ హౌస్ లో తొలివారం నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు ఇంటి సభ్యులు నామినేషన్స్ లోకి వచ్చారు. మరి.. వారిలో ఎవరు టాప్ లో ఉన్నారు? ఎవరు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు? ఎవరికి ఎలాంటి ఓటింగ్ జరుగుతోందో చూద్దాం.

Bigg Boss 8: బిగ్ బాస్ ఓటింగ్స్ లో షాకింగ్ రిజల్ట్స్.. నాగ మణికంఠ టాప్ ప్లేస్ లోకి!

బిగ్ బాస్ హౌస్ లో తొలివారం ప్రస్తుతానికి బాగానే సాగుతోంది. మూడు టాస్కులు.. ఆరు గొడవలతో కళకళ్లాడుతోంది. అయితే బిగ్ బాస్ అంటే టాస్కులు, గొడవలు మాత్రమే కాదు.. నామినేషన్స్, ఓటింగ్స్ కూడా ఉంటాయి. మరి.. ఫస్ట్ వీక్ ఓటింగ్స్ సరళి ఎలా ఉంది? అసలు ఎవరు ఓటింగ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు? ఎవరు ఓటింగ్ లో దూసుకుపోతున్నారు? ఇలాంటి ప్రశ్నలు అయితే చాలానే ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలకు షాకింగ్ ఆన్సర్ దొరుకుతోంది. అది కూడా అస్సలు ఎవరూ ఊహించని ఒక పేరు ఓటింగ్స్ లో దూసుకుపోతోంది. సీరియల్ బ్యాచ్, సెలబ్రిటీలు కూడా అతని దెబ్బకు వెనక్కి వెళ్లిపోయారు.

బిగ్ బాస్ హౌస్ లో తొలివారం ఆట చూసుకుంటే.. అన్ని విధాలుగా నిఖిల్ టాప్ ప్లేస్ లో కనిపిస్తున్నాడు. అతని ఆర్గుమెంటల్ స్కిల్స్, లీడర్ షిప్ క్వాలిటీస్, ఫిజికల్ స్ట్రెంథ్, ఎమోషనల్ డెసిషిన్స్ అన్నీ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. హౌస్ మేట్స్ అంతా కూడా నిఖిల్ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఆ పాజిటివిటీ అనేది ఇంకా ఆడియన్స్ లో కనిపించడం లేదు. నిఖిల్ నామినేషన్స్ లో లేడు కాబట్టి మనకు అది అర్థం కావట్లేదు. కానీ, నామినేషన్స్ లో ఉన్న సెలబ్రిటీలు కూడా అంత ప్రభావం చూపించకపోవడం గమనార్హం. అందరినీ కాదని.. నాగ మణికంఠ టాప్ లోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇక్కడ అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనాలి. ఎందుకంటే నాగ మణికంఠ పేరు మొదటి రోజు నుంచి వైరల్ అవుతూనే ఉంది. అదే ఇప్పుడు ఓటింగ్స్ లో కూడా కనిపిస్తోంది.

మరి.. ఈ ఓటింగ్స్ అన్నీ మీరు బిగ్ బాస్ వాళ్లను అడిగి చూశారా? అని అడిగితే.. కాదు అనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో అనధికారిక ఓటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. దాదాపుగా వాటి ప్రకారమే హౌస్ లో సేవింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఓటింగ్స్ ని మనం కచ్చితంగా ఒకసారి దృష్టిలో ఉంచుకోవాల్సిందే. ఆ లెక్కల ప్రకారం చూస్తుంటే నాగ మణికంఠ దాదాపుగా ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తున్నాడు. టాప్ లో అందరూ అనుకున్నట్లు విష్ణు ప్రియ ఉంది. ఆమెకు హౌస్ లో ఉన్న వాళ్ల అందరి కంటే ఫాలోయింగ్ ఎక్కువ అనే చెప్పాలి. అందరికంటే రెమ్యూనరేషన్ కూడా విష్ణు ప్రియాకే ఎక్కువ పారితోషకం అందుతోంది అని తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే హౌస్ లో తొలివారం ఆట కంటే కూడా.. వారి ఫాలోయింగ్ ని బట్టే ఓట్లు పెడతాయి. కానీ, నాగ మణికంఠకు ఓట్లు పడుతున్నాయి అంటే.. అతనికి, అతని గతానికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు అని అర్థమవుతోంది. విష్ణు ప్రియకి నాగ మణికంఠకు ఓటింగ్స్ లో పెద్ద వ్యత్యాసం లేదు అంటున్నారు.

అలాగే ఓటింగ్స్ లో మిగిలిన వారి పొజిషన్ చూస్తే.. టాప్ ప్లేస్ లో విష్ణుప్రియ, తర్వాత నాగ మణికంఠ, మూడో స్థానంలో పృథ్వీ రాజ్, నాలుగో స్థానంలో సోనియా, ఐదో స్థానంలో ఆర్జే శేఖర్ బాషా, ఆఖరి పొజిషన్ లో బెజవాడ బేబక్క ఉన్నట్లు తెలుస్తోంది. విష్ణు ప్రియను మినహాయిస్తే.. ఈ వారం ఓటింగ్స్ లో దాదాపుగా అందరి ఆటకు తగినట్లుగానే ఓటింగ్స్ జరుగుతున్నాయి అనిపిస్తోంది. పృథ్వీకి సీరియల్ బ్యాచ్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల కలిసొచ్చింది. ఇలా రీజన్ ఏదైనా కూడా.. సెలబ్రిటీలు, బాగా తెలిసిన వారిని పక్కకు నెట్టేసి నాగ మణికంఠ ముందుకు రావడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. షోకి ముందు ఆర్జే శేఖర్ బాషా ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. కానీ, అలాంటి శేఖర్ బాషాని కూడా వెనక్కి నెట్టేసి నాగ మణికంఠ ముందుకు వచ్చేశాడు. మరి.. నాగ మణికంఠ ఓటింగ్స్ లో టాప్ ప్లేస్ లో కొనసాగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.