iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: నిఖిల్ vs యష్మీ.. చీఫ్స్ మధ్య గొడవలో తప్పు ఎవరిదంటే?

  • Published Sep 06, 2024 | 10:30 AM Updated Updated Sep 06, 2024 | 1:10 PM

Bigg Boss Telugu 8- Nikhil Vs Yashmi: బిగ్ బాస్ హౌస్ లో గొడవలకు అయితే కొదవ లేదు. ఈసారి తొలిరోజు నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి గొడవ బడ్డీస్ మధ్యలో స్టార్ట్ అయ్యింది. ఈ ఇద్దరు బడ్డీస్ చాలా గట్టిగానే జరిగింది.

Bigg Boss Telugu 8- Nikhil Vs Yashmi: బిగ్ బాస్ హౌస్ లో గొడవలకు అయితే కొదవ లేదు. ఈసారి తొలిరోజు నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి గొడవ బడ్డీస్ మధ్యలో స్టార్ట్ అయ్యింది. ఈ ఇద్దరు బడ్డీస్ చాలా గట్టిగానే జరిగింది.

  • Published Sep 06, 2024 | 10:30 AMUpdated Sep 06, 2024 | 1:10 PM
Bigg Boss 8: నిఖిల్ vs యష్మీ.. చీఫ్స్ మధ్య గొడవలో తప్పు ఎవరిదంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే ప్రస్తుతానికి ఆసక్తిగా.. ఉత్కంఠగానే సాగుతోంది. నామినేషన్స్ ముగిసిన తర్వాత సాధారణంగా హౌస్ కాస్త స్తబ్దుగా ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం హౌస్ ప్రతిరోజు గరం గరంగానే ఉంటోంది. ఈసారి హౌస్ లో ఒక కెప్టెన్ కాకుండా.. ముగ్గురు చీఫ్స్ వచ్చారు. ఆ ముగ్గురు చీఫ్స్ కి కొత్తగా క్లాన్స్ అని ఇచ్చారు. ఆ క్లాన్స్ లో మళ్లీ ఎవరు గొప్ప అనే విషయాన్ని తేల్చుకోవాల్సిందిగా గొడవ పెట్టారు. ఎవరైతే ఓడిపోతారో వారి నుంచి ఒకరిని నిఖిల్ గ్రూప్ కి ఇస్తారు. అంటే ఆ ఓడిన క్లాన్ బలం తగ్గిపోతుంది. ఇదంతా పక్కన పెడితే ఏ సీజన్ అయినా కూడా సంచాలక్ గా ఉండటం అంత తలనొప్పి ఇంకొకటి ఉండదు. అలా ఉన్న వారికి గొడవలు వస్తాయి.. నామినేషన్స్ కూడా వస్తాయి. అలాగే అతను విలన్ అయిపోతాడు. ఇప్పుడు నిఖిల్ సంచాలక్ గా చేసి యష్మీకి విలన్ లా మారాడు.

సాధారణంగా నిఖిల్- యష్మీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. యష్మీ డిసర్వ్ అని నిఖిల్ చీఫ్ ని కూడా చేశాడు. నిఖిల్ అభిప్రాయంతో నైనికా ఏకీభవించింది కాబట్టే ఆమె చీఫ్ అయ్యింది. అయితే కామన్ గా యష్మీ ఎప్పుడూ నిఖిల్ తో వాగ్వాదానికి దిగినట్లు కనిపించలేదు. వాళ్లిద్దరు హౌస్ లో బడీస్ కూడా. కానీ, ఈసారి తన క్లాన్ కోసం యష్మీ గొడవకు దిగింది. అసలు ఏం జరిగిందంటే.. క్లాన్స్ మధ్య జరుగుతున్న పోరులో రెండో పోటీ మొదలైంది. ఇందులో ఒకవైపు ఉన్న రింగ్స్ ని మరోవైపునకు తీసుకురావాలి. బిగ్ బాస్ హౌస్ లో ఏ ఆట అంత సింపుల్ గా ఉండదు కదా? క్లాన్ సభ్యులు ఒక చైన్ లా నిలబడి ఒకవైపు ఉన్న రింగ్స్ మరోవైపునకు వారి శరీరం మీదుగా తీసుకురావాలి.. చేతులు వదలకుండా.

ఆట మొదలైంది. నైనికా టీమ్ రింగ్స్ ని మెడ నుంచి చేతుల మీదుగా మరోవైపునకు తీసుకెళ్లారు. కానీ, యష్మీ టీమ్ మాత్రం ఆ రింగ్స్ ని శరీరం మొత్తం తిప్పి తీసుకెళ్లారు. ఈ ఆటలో నైనికా టీమ్ గెలిచింది అని నిఖిల్ ప్రకటిస్తాడు. అక్కడే అసలు గొడవ స్టార్ట్ అవుతుంది. అలా ఎలా చెప్తావ్ అంటూ నిఖిల్ మీద యష్మీ టీమ్ మాత్రమే కాదు.. యష్మీ కూడా ఫైర్ అవుతుంది. మేము రూల్స్ ప్రకారమే ఆడాం అంటూ నైనికా టీమ్ చెప్పుకుంది. ఇక్కడే నిఖిల్ కూడా తన వాదనను వినిపించాడు.

శరీరాల మీదుగా అన్నారు.. హోల్ బాడీ అని చెప్పలేదు. మీరు ఇలా అర్థం చేసుకుని చేశారు. వాళ్లు అలా ఆడారు. వాళ్లు రూల్స్ బ్రేక్ చేయలేదు అని నిఖిల్ స్పష్టం చేశాడు. ఈ విషయంలో నిఖిల్ చాలా క్లారిటీతో ఉన్నాడు. అంతేకాకుండా అదే నిజం కూడా. బిగ్ బాస్ శరీరాల మీదుగా అన్నాడు. కానీ, యష్మీ టీమ్ మాత్రం శరీరాలను చుట్టి తీసుకొచ్చింది. ఇక్కడే వాళ్లు రింగులో కాలేశారు. ఆటలో ఓడిపోయారు. తొలి టాస్క్ లో యష్మీ టీమ్ గెలిచింది. రెండో టాస్క్ తొలి రౌండ్ లో నైనికా టీమ్ గెలిచింది. అయితే యష్మీ తన క్లాన్ కోసం.. తాను నమ్మిన మాట కోసం తన బడ్డీ నిఖిల్ తో కూడా గొడవ పడటం ఆమెకు మంచి మార్కులు వచ్చేలా చేస్తుంది. మరి.. నిఖిల్- యష్మీ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet