iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ హౌస్ లోకి నాగ మణికంఠ భార్య- కుమార్తె?

  • Published Sep 05, 2024 | 12:22 PM Updated Updated Sep 05, 2024 | 12:22 PM

Bigg Boss Telugu 8- Naga manikanta Wife Into The House: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాగ మణికంఠ పేరు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మణికంఠకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితేవైరల్ అవుతోంది.

Bigg Boss Telugu 8- Naga manikanta Wife Into The House: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాగ మణికంఠ పేరు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మణికంఠకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితేవైరల్ అవుతోంది.

  • Published Sep 05, 2024 | 12:22 PMUpdated Sep 05, 2024 | 12:22 PM
బిగ్ బాస్ హౌస్ లోకి నాగ మణికంఠ భార్య- కుమార్తె?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రతి ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా సాగుతోంది. ఎందుకంటే ఈసారి హౌస్ లో తీసుకొచ్చిన కొత్త రూల్స్ వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి అయితే రెట్టింపు అయ్యింది. అలాగే కంటెస్టెంట్స్ కూడా అలాగే ఉన్నారు. ఎవరికి వాళ్లు గేమ్ గెలవాలి అనే ధోరణితోనే దూసుకుపోతున్నారు. అయితే ఈసారి ఉన్న కంటెస్టెంట్స్ కొందరికి మాత్రం ఓవర్ నైట్ రీచ్ అయితే వచ్చింది. ముఖ్యంగా నాగ మణికంఠ పేరు బాగా వైరల్ అవుతోంది. మూడో రోజు జరిగిన ఆట మొత్తంలో మణికంఠ పేరే ఎక్కువ హైలెట్ అయ్యింది. నామినేషన్స్ లో జరిగిన డ్రామా కావచ్చు.. తర్వాత అతను బాధ పడటం అంతా కంటెంట్ మొత్తం అతని చుట్టూనే తిరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే నాగ మణికంఠ భార్య బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మణికంఠ ఫ్లాష్ బ్యాక్:

నాగ మణికంఠ అంత త్వరగా ఆడియన్స్ కి కనెక్ట్ కావడానికి కారణం అతని గతం. ప్రోమో నుంచి కూడా మణికంఠ తన గతాన్ని చెబుతూనే ఉన్నాడు. తండ్రి చనిపోయాడు.. అమ్మ ఇంకో పెళ్లి చేసుకుంది.. స్టెప్ ఫాదర్ అవమానించాడు.. అమ్మ చనిపోగానే ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. తనకు పెళ్లైంది.. కుమార్తె పుట్టింది. ఇప్పుడు భార్యాతో కలిసిలేడు. ఇలా ఇదంతా విన్న తర్వాత ఆడియన్స్ మణికంఠ గతానికి కనెక్ట్ అయిపోయారు. నామినేషన్స్ లో మాకు కనెక్ట్ కావడం లేదు అని అంతా ఓట్లు వేస్తుంటే.. ఆఖరికి మణికంఠ తన ఫ్లాష్ బ్యాక్ మరోసారి చెప్పుకొచ్చాడు. నిజానికి బిగ్ బాస్ హౌస్ కి, అక్కడ ఆటకి అతని గతంతో పనిలేదు. హౌస్ మేట్స్ కూడా అదే చెప్పారు. పృథ్వీ అయితే సింపథీ గేమర్ అనేశాడు. అక్కడితే మణికంఠ బరస్ట్ అయిపోయాడు. నామినేషన్స్ తర్వాత ఏడుస్తూనే ఉన్నాడు.

నిఖిల్ ఓదార్పు:

నామినేషన్స్ సమయంలో చీఫ్ గా ఉన్న యష్మీకి మణికంఠకు కాస్త వాదన జరిగింది. ఆమె క్లాప్స్ కొట్టడంతో కాస్త నెగిటివ్ అయ్యింది అనుకుంది కావచ్చు. ఆ తర్వాత ఎంతగానో ఏడ్చింది. అలాగే మణికంఠను కలిసి ఓదార్చే ప్రయత్నం కూడా చేసింది. ఇవన్నీ పక్కన పెడితే నాగ మణికంఠ మాత్రం అతని ఆటను మెరుగు పరుచుకోలేకపోతున్నాను.. మైండ్ తో గేమ్ ఆడలేకపోతున్నాను అంటూ బాధ పడిపోయాడు. సీత- నిఖిల్ ఇద్దరూ కూర్చుని మణికంఠను మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. అతడిని ఓదార్చడం వాళ్ల వల్ల కూడా కాలేదు. నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటే.. మీకు అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పెట్టుకున్న విగ్గును కూడా తీసి పడేసి.. ఇదే నా రియాలిటీ.. ఇదే నేను అంటూ ఏమోషనల్ అయ్యాడు. అది చూసిన ఆడియన్స్ కూడా నాగ మణికంఠ బాధను అర్థం చేసుకున్నారు. అతను జెన్యూన్ గానే ఉన్నాడు.. సింపథీ ప్లేయర్ కాదు అంటూ అభిప్రాయపడుతున్నారు.

bigg bosss 02

హౌస్ లోకి భార్య:

సాధారణంగా బిగ్ బాస్ కి కావాల్సింది ఇలాంటి కంటెస్టెంట్సే. ఎంత భావోద్వేగ భరిత కథ ఉంటే.. వారికి అంత రీచ్ ఉంటుంది. కాబట్టి నాగ మణికంఠ ఎపిసోడ్ వాళ్లకు ఇంత బాగా పనికొస్తది అని వాళ్లు కూడా ఊహించి ఉండరు. షో స్టార్ట్ అయిన నాలుగు రోజులుగా అతని పేరే వైరల్ అవుతోంది. ఈ అవకాశాన్ని బిగ్ బాస్ కూడా సద్వినియోగం చేసుకునేలాగే కనిపిస్తున్నాడు. బాగా ఎమోషనల్ అయిన నాగ మణికంఠతో కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ మాట్లాడాడు. మానసికంగా అతనికి ధైర్యం చెప్పాడు.

అలాగే మాటల్లో మణికంఠ దేని గురించి అయితే భయపడుతున్నాడో దాని గురించి అసలు చింతించాల్సిన అవసరం లేదు అన్నాడు. అంటే నాగ మణికంఠతో ఇప్పుడే ఎలిమినేట్ కావు.. ధైర్యంగా ఉండు అని చెప్పినట్లు అనిపించింది. ఇప్పుడు గనుక నాగ మణికంఠను ఫ్యామిలీ వీక్ వరకు ఉంచి.. భార్యను తీసుకొచ్చి హౌస్ లో కలిపిస్తే షోకి వచ్చే మైలేజ్ అంతా ఇంతా కాదు. కాబట్టి ఆ దారిలో ప్లాన్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి నాగ మణికంఠ భార్య- కుమార్తె వస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. తనకు భార్య- కూతురు కావాలి అని మణికంఠ కూడా కోరుకుంటున్నాడు. మరి.. ఈ బిగ్ బాస్ షో వల్ల అతని కోరిక తీరుతుందేమో చూడాలి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş