P Krishna
Bigg Boss Telugu 8: తెలుగు బుల్లితెరపై ప్రతి ఏడాది బిగ్ బాస్ రియాల్టీ షో సందడి చేస్తుంది.ఇప్పటి వరకు బిగ్ బాస్ రియాల్టీ షో 7 సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్ కి రెడీ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. తాజాగా కొత్త ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.
Bigg Boss Telugu 8: తెలుగు బుల్లితెరపై ప్రతి ఏడాది బిగ్ బాస్ రియాల్టీ షో సందడి చేస్తుంది.ఇప్పటి వరకు బిగ్ బాస్ రియాల్టీ షో 7 సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్ కి రెడీ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. తాజాగా కొత్త ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.
P Krishna
టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ రియాల్టీ షోకి మంచి ఆదరణ లభించింది. బాలీవుడ్‌లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బాగా పాపులర్ కావడంతో ఇతర భాషల్లో కూడా మొదలు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షోకి మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులో మొదటి సీజన్ ఎన్టీఆర్, రెండో సీజన్ నాని హూస్ట్ గా వ్యవహరించగా.. మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఏడు సీజన్లు బాగా సక్సెస్ అయ్యింది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన టీజర్ వచ్చింది. దీనికి కొనసాగింపుగా మరో ప్రోమో రిలీజ్ చేశారు.. ఇందులో కాన్సెప్ట్ చూస్తుంటే ఈసారి కంటెస్టెంట్స్ తో నాగ్ ఓ రేంజ్‌లో ఆడుకోబోతున్నట్లు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే..
బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమోలో ఈసారి కాన్సెప్ట్ ఏంటో నాగ్ చెప్పకనే చెప్పారు. ప్రోమోలో హూస్ట్ నాగార్జున, కమెడియన్ సత్య ఉన్నారు. ఫస్ట్ ప్రోమోలో దొంగతనానికి వచ్చిన సత్య తనకు అన్ లిమిటెడ్ కావాలని అంటాడు. సత్యను లగ్జరీ హౌస్‌లోకి తీసుకు వెళ్తాడు నాగార్జున. అక్కడ అందమైన అమ్మాయిలతో దేఖో.. దేఖో మస్త్ ఆటే బిగ్ బాస్ అంటూ డ్యాన్స్ చేస్తాడు. సత్య తనకు ఏకాంతం కావాలని అంటాడు.అంతే ఏడారిలో మాసిన దుస్తులతో మారుస్తాడు. ఫన్, టర్న్, ట్విస్టులకు కొదవే లేదని నాగ్ చెప్పే డైలాగ్స్ తో ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నట్లు అనిపిస్తుంది. 7వ సీజన్ లో అంతా ఉల్టా.. ఫుల్టా అంటూ కొత్త కాస్సెప్ట్ తో వచ్చిన నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి స్వర్గం- నరకం రెండు ఎలా ఉంటాయో ప్రోమోలో చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తుంది.
సత్యకు ఒక్కసారే స్వర్గం చూపించి.. అతని కోరిక మేరకు నరకం లాంటి ఎడారికి పంపారు. ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి రాబోయే కంటెస్టెంట్స్ విషయంలో కూడా ఇలాంటి చాన్స్ లు ఏమైనా ఉంటాయా? కండీషన్లు అప్లై అంటారా? అన్న విషయంపై ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో 100 రోజులు ఉండాలంటేనే పెద్ద టాస్క్.. మరి ఆ టాస్క్ లో ఈసారి ఎన్ని ట్విస్టులు పెడతారో? చూడాలి. 7వ సీజన్ అంతా రైతు బిడ్డ కాన్సెప్ట్ చుట్టే తిరిగింది.. దీంతో కొంతమందిలో అసహనం పెరిగిందని టాక్ వినిపించింది. బిగ్ బాస్ లో ఎప్పుడు కొట్లాటలు, గొడవలు, తిట్టుకోవడాలు కాకుండా సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటున్నారు. సీజన్ 8 లో మార్పులు కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి డిఫరెంట్ కాన్సెప్ట్ తో నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్ అనేలా రాబోతున్నట్లు తెలుస్తుంది.సెప్టెంబర్ 8వ తేదీన ఈ సీజన్ మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి.. కాకపోతే అఫిషియల్ గా డేట్ ను వెల్లడించలేదు.