iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ పై ట్రోల్స్! అయినా.. పెరుగుతున్న క్రేజ్!

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ పై ట్రోల్స్! అయినా.. పెరుగుతున్న క్రేజ్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. హౌస్ లో ఇప్పుడిప్పుడే హీట్ పెరుగుతోంది. తొలివారం నామినేషన్స్ తర్వాత అందరూ ముసుగులు తీసేసి.. బాహాటంగానే గొడవలు పడుతున్నారు. ప్రస్తుతానికి ఈ సీజన్ లో ఉన్న వాళ్లంతా బయట కూడా మంచి క్రేజ్, గుర్తింపు ఉన్న వాళ్లనే చెప్పాలి. యూట్యూబర్లు, సీరియల్ ఆర్టిస్టులు, సినిమా వాళ్లు అంటూ అన్ని విభాగాలను కలిపుతూ కంటెస్టెంట్స్ ని సెలక్ట్ చేశారు. అయితే ఇప్పుడున్న వాళ్లలో పల్లవి ప్రశాంత్ పై బయట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. కానీ, రియల్ లైఫ్ లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది.

కొందరైతే పల్లవి ప్రశాంత్ ని బాగా తీసేసి మాట్లాడుతున్నారు. అసలు అతను ఎవరు? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. ఇంకొందరు మనం కూడా నెక్ట్స్ ఇయర్ అన్నపూర్ణ స్టూడియో మెట్లు మీద కూర్చుని బిగ్ బాస్ కి వెళ్దాం అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరు అయితే పల్లవి ప్రశాంత్ తొలివారమే ఎలిమినేట్ అయ్యి బయటకు రావాలి అంటూ కోరుకుంటున్నారు. అయితే వీళ్లంతా ఎందుకు ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారని ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ తన గేమ్ తను ఆడుతున్నాడు. హౌస్ లో అందరితో కలివిడిగా ఉంటున్నాడు. అందరికీ మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాడు.

వీళ్ల ప్రాబ్లమ్ ఏంటని చూస్తే.. కొందరు నెటిజన్స్ తమ అభిప్రాయాలను ఈ విధంగా వ్యక్త పరుస్తున్నారు. అవేంటంటే.. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో ఉన్నాడని వీళ్లకు ఈర్ష్య, రతిక రోజ్ లాంటి హీరోయిన్ పల్లవి ప్రశాంత్ తో చనువుగా ఉంటోందని కుళ్లు అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ట్రోల్ చేసే వారికి తెలియని విషయం ఏంటంటే.. ప్రేక్షకుల్లో పల్లవి ప్రశాంత్ క్రేజ్ మరింత పెరుగుతోంది. అందుకు ఒక ఉదాహరణ కూడా ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే రోజు పల్లవి ప్రశాంత్ కు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 5,46,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈరోజు(మంగళవారం) చూస్తే పల్లవి ప్రశాంత్ ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో ఫాలోవర్స్ 5,71,000కు పైగా పెరిగారు.

 

View this post on Instagram

 

A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)

అంటే నిజంగా పల్లవి ప్రశాంత్ ని ప్రేక్షకులు కూడా ద్వేషిస్తుంటే.. ఫాలోయింగ్ ఆ స్థాయిలో పెరిగే అవకాశం లేదు. నిజానికి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఏ సెలబ్రిటీకి కూడా ఈ స్థాయిలో ఫాలోయింగ్ పెరిగింది లేదు. అందరికీ మహా అయితే 3 వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే.. పల్లవి ప్రశాంత్ కు ఉన్న ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో చాలామందికి లేదు. కేవలం వేలల్లోనే ఫాలోవర్స్ ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. వారితో పోలిస్తే నిజంగా పల్లవి ప్రశాంత్ ను సెలబ్రిటీ అనే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే.. ట్రోల్స్ వల్ల పల్లవి ప్రశాంత్ క్రేజ్ పెరుగుతుంది గానీ.. నెగిటివ్ మాత్రం కాదంటూ అతని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇతని ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో ఒక రీల్ కి 1.7 మిలియన్ లైక్స్, రెండో రీల్ కి 1 మిలియన్ కి పైగా లైక్స్ ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి