iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: తెలివైన నిర్ణయం తీసుకున్న యావర్! 15 లక్షల సూట్ కేసుతో బయటకు..

బిగ్ బాస్ సీజన్ 7లో ప్రిన్స్ యావర్ ఓ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాస్ ఆఫర్ ను అంగీకరించి.. హౌస్ నుంచి బయటకు వచ్చాడు.

బిగ్ బాస్ సీజన్ 7లో ప్రిన్స్ యావర్ ఓ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాస్ ఆఫర్ ను అంగీకరించి.. హౌస్ నుంచి బయటకు వచ్చాడు.

Bigg Boss 7 Telugu: తెలివైన నిర్ణయం తీసుకున్న యావర్! 15 లక్షల సూట్ కేసుతో బయటకు..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అనేక షోలు ఆకట్టుకున్నాయి. అలాంటి వాటిల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఈ షో దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యింది. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్ లో పూర్తి చేసుకున్న ఈ షో.. ఏడవ సీజన్ నడుస్తోంది. ఈ బిగ్ బాస్ సీజన్ 7 కూడా ఆదివారం(డిసెంబర్ 17)న ముగిసింది. ఉల్టాపుల్టా అంటూ ఊపేసిన ఈ సీజన్ లో అన్నీ ఊహించని ట్విస్ట్ లో చోటుచేసుకున్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్‌లో పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్, యావర్, అర్జున్, ప్రియాంక ఫైనలిస్ట్‌లుగా ఉన్నారు. అయితే ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ముందుగా అర్జున్ ఆ తర్వాత ప్రియాంకలు ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యాడు.

గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఆరో స్థానంలో అర్జున్ అంబటి ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఐదో స్థానంలో ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తర్వాత ఎలిమినేషన్ కోసం నాగార్జున మరో ఇద్దరు సెలబ్రిటీలను హౌస్ లోకి పంపించారు. వారెవరో కాదు అల్లరి నరేష్, రాజ్ తరుణ్. వీరిద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి రూ. 15 లక్షల సూట్ కేస్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఆ డబ్బు తీసుకుని తమతో ఎవరు వస్తారు? అంటూ వారికి ఆప్షన్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన సోదరుడి సలహా మేరకు, కుటుంబ కోసం రూ.15 లక్షల సూట్ కేసుతో యావర్ నాలుగో స్థానంలో హౌస్ నుంచి బయటకు వచ్చాడు. వాస్తవానికి యావర్ కి విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. దీంతో రూ.15 లక్షలు సూట్ కేస్ ఆఫర్ చేసేసరికి.. యావర్ ఇదే మంచి అవకాశం అని హౌస్ నుంచి వచ్చేశాడు. ఇక యావర్ తీసుకున్న నిర్ణయం తెలివైందని అందరూ అంటున్నారు.

కాగా.. బిగ్ బాస్‌ హౌస్ నుంచి సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేయడం ఇది మొదటి సారి అయితే కాదు. గతంలో సీజన్ 4లో సొహైల్.. రూ.25 లక్షల సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బిగ్ బాస్ ఓటీటీలో అరియానా కూడా రూ.10 లక్షల సూట్ కేసు తీసుకుని వచ్చేసింది. ఇప్పుడు సీజన్ 7లో యావర్ రూ.15 లక్షల సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేయడంతో.. ఈషోలో సూట్ కేస్ సాంప్రదాయం కొనసాగించినట్టే అయ్యింది. అయితే యావర్ తీసుకున్న రూ.15 లక్షల్ని విన్నర్ ప్రైజ్ మనీలో కోత కోస్తారు. కాబట్టి.. విన్నర్ అయిన వాళ్లకి వచ్చేది కేవలం రూ.35 లక్షలు మాత్రమే. మరి.. ఈ విషయంపై, యావర్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.