Tirupathi Rao
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0లో ఆటగాళ్లు- పోటుగాళ్లు విజయం సాధించాలి అని వీర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వాళ్లు ఛాలెంజెస్ లో ప్రాణం పెట్టి ఆడుతున్నారు. శోభాలాంటి వాళ్లు హౌస్ మేట్స్ కి మాత్రమే కాకుండా.. ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పిస్తున్నారు. ప్రతి టాస్కులో ఇష్టానికి ఆడేసి.. నా స్ట్రాటజీ అని చెబుతోంది. హౌస్ లో అర్జున్ ఆట అందరినీ ఆక్టటుకుంటోంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రిన్స్ యావర్ కి సంబంధించిన ఒక విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇన్నాళ్లు యావర్ అందరినీ ఇంత మోసం చేశాడా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్, ప్రేక్షకులు అందరినీ యావర్ చాలా చీట్ చేశాడు.
ప్రిన్స్ యావర్ కు బిగ్ బాస్ సీజన్ 7లో చాలా మంచి క్రేజ్ వచ్చింది. అందరూ అతని ఆటకు, పోరాట పటిమకు ఫిదా అయిపోయారు. పైగా హౌస్ లో ఉన్న వాళ్లంతా నీకు ఏం అర్థం కాదు అంటూ కేకలు వేస్తుంటే ఆడియన్స్ యావర్ కి సపోర్ట్ చేశారు. అతడిని టార్గెట్ చేస్తున్నారు అంటూ యావర్ ని సేవ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరి కంటే చాలా తెలివిగల వాడు. ఎంత అంటే.. ప్రేక్షకులు, ఫ్యాన్స్ ని మాత్రమే కాదు.. హోస్ట్ నాగార్జున, ఆఖరికి బిగ్ బాస్ ని కూడా గట్టిగానే చీట్ చేశాడు. మోసం అని ఎందుకు అంటున్నాం అంటే.. అతను చేసిన పని అంత చిన్నది కాదు. ప్రిన్స్ యావర్ ఇన్నాళ్లు ఆడిన ఆట ఒక మోసంగా భావించాలి. హౌస్ లో కి రాబోయో ముందే యావర్ గట్టి ప్రణాళికతో వచ్చాడు. అదే వ్యూహాన్ని పక్కగా అమలు చేస్తున్నాడు.
అందరూ బిగ్ బాస్ కి పెద్ద పెద్ద స్ట్రాటజీలతోనే వస్తారు. కానీ, ప్రిన్స్ యావర్ స్కెచ్ చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. బిగ్ బాస్ హౌస్ లో ప్రిన్స్ యావర్ ఒక్కడికే తెలుగు అర్థం కాదు. పైగా బిగ్ బాస్ ఏం చెప్తున్నాడో కూడా అర్థం చేసుకోలేడు. ఇన్నాళ్లు అందరూ అదే అనుకున్నారు. కానీ, అదంతా పచ్చి అబద్ధం. యావర్ చాలా బాగా తెలుగు మాట్లాడగలడు, తెలుగు అర్థం చేసుకోగలడు. ఇదంతా ఊరికే చెప్పడం లేదు. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లబోయే ముందు ప్రిన్స్ యావర్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగానే ఇది చెబుతున్నారు. చాలా చక్కగా తెలుగు మాట్లాడాడు, యాంకర్ అడిగిన ప్రశ్నలను చాలా బాగా అర్థం చేసుకున్నాడు. తన హోమ్ టూర్ వీడియోలో చక్కగా వివరించి చెప్పాడు.
బిగ్ బాస్ హౌస్ లో మాత్రం తనకి అస్సలు తెలుగు రాదు అని చెప్పాడు. ఏదైనా చెప్తూ ఉంటే బిత్తిరి చూపులు చూస్తూ తనకి ఏం అర్థం కాలేదు అని చెప్పాడు. కానీ, టీచర్ టాస్క్ లో మాత్రం వాళ్లు అడిగే ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు చెప్పాడు. వరసలు కూడా క్లియర్ గా చెప్పాడు. ఎందుకంటే యావర్ కు రిలేషన్స్ చాలా బాగా తెలుసు. అతను ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా చక్కగా అన్న కూతురు, పెద్ద అన్న కూతురు, వదిన అంటూ తన కుటుంబాన్ని అందరినీ పరిచయం చేశాడు. యావర్ రిలేషన్స్ ని చెప్పిన సందర్భంలో హోస్ట్ నాగార్జున ప్రశ్నించారు. అంత చక్కగా ఎలా చెప్పగలుగుతున్నావ్? అని క్వశ్చన్ చేశారు. అందుకు యావర్ ఏదో అలా కుదిరేసింది అన్నట్లు సమాధానం చెప్పాడు.
ఇప్పటికీ ఇంట్లో ఉన్న వాళ్లంతా యావర్ కు తెలుగు రాదు అనుకుని వివరించేందుకు చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా టేస్టీ తేజ వచ్చీ రాని ఇంగ్లీష్, హిందీలో చాలా కష్టపడుతున్నాడు. ఇక్కడ పాయింట్ యావర్ కి తెలుగు వచ్చా రాదా అని కాదు. యావర్ సింపథీ కోసం ఈ దారి ఎంచుకున్నాడు అనేది పాయింట్. యావర్ కు ఇంకో ఫేస్ ఉంది అని శుభశ్రీ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో తెలిసింది. పల్లవి ప్రశాంత్ తో కలిసి కన్నీళ్ల టాస్కులో గెలిచాక.. ప్రశాంత్ నే అపోనెంట్ గా పెట్టుకుని తర్వాత టాస్సులో ఓడిస్తాను అని చెప్పడం, గౌతమ్ ని యూజ్ చేసుకుని గేమ్ ఆడతాం అని సుబ్బుతో కలిసి ప్లాన్ చేయడం ఇలా అన్నీ చూస్తే యావర్ కావాలనే మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు అని స్పష్టం అయిపోతోంది. మరి.. ఇన్నాళ్లు అందరినీ ప్రిన్స్ యావర్ మోసం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.