iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ షోపై వ్యతిరేకత.. మొదలు కాకముందే నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక!

  • Author ajaykrishna Updated - 05:40 PM, Sat - 12 August 23
  • Author ajaykrishna Updated - 05:40 PM, Sat - 12 August 23
బిగ్ బాస్ షోపై వ్యతిరేకత.. మొదలు కాకముందే నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక!

తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో ఈసారి చాలా బజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటిదాకా ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఏడో సీజన్ తో అలరించేందుకు సిద్ధం అవుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా కంటిన్యూ అవుతున్న ఈ షో గురించి.. రోజురోజుకి ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే.. ఇదివరకటిలా కాకుండా ఈసారి కొత్తగా.. సరికొత్త కాన్సెప్ట్ లు, టాస్క్ లతో రెడీ చేస్తున్నట్లు.. ప్రచార చిత్రాలలో నాగార్జున చెబుతూ వస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ షో ద్వారా జనాలకు పెద్దగా ఉపయోగం లేదని.. వెంటనే ఈ షోని ఆపాలంటూ భారీ ఎత్తున విమర్శలు, కోర్టులో పిటిషన్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసుల నుండి హెచ్చరికలు జారీ అయినట్లు సమాచారం.

అదేంటి షో ఇంకా మొదలు కాలేదు.. అప్పుడే పోలీసులు వార్నింగ్ ఇవ్వడం ఏంటని మీకు సందేహం రావచ్చు. అసలు వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ నిర్వాహకులకు సడన్ గా షాకిచ్చారు పోలీసులు. బుల్లితెరపై అత్యంత పాపులర్ షోలలో ఒకటైన బిగ్ బాస్.. తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో చాలా ఏళ్లుగా బిగ్ బాస్ రన్ అవుతోంది. ఇక తెలుగులో ఆరు సీజన్స్ ముగించుకొని.. ఏడో సీజన్లో అడుగు పెడుతోంది. అయితే.. బిగ్ బాస్ షో తెలుగు రాష్ట్రాలలో ఎంత పాపులర్ అయ్యిందో.. అదే రేంజ్ లో విమర్శలు కూడా ఫేస్ చేస్తోంది. ఇప్పటిదాకా ఎంతోమంది అభ్యంతరాలు తెలుపుతూ.. కోర్టుల వరకు వెళ్లారు. షో నిలిపివేయాలని డిమాండ్ కూడా చేశారు.

ఇలాంటి తరుణంలో పోలీసులు.. కొత్త సీజన్ మొదలు కాకముందే నిర్వాహకులకు ముందస్తు సూచనలు జారీ చేశారట. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని.. గతంలో మాదిరి ఈసారి వివాదాలకు తావివ్వకుండా షోని నిర్వహించాలని చెప్పారట. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెలక్షన్ టైమ్ లో కాస్టింగ్ కౌచ్ పై కూడా దృష్టి పెట్టాలని.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బయటికి వచ్చాక హంగామా చేస్తే వాటికి నిర్వాహకులే బాధ్యత వహించాలని తెలిపారట. ఇంకా షో జరిగినన్ని రోజులు సెక్యూరిటీ కూడా కట్టుదిట్టంగా ఉండాలని.. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించినా.. చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినట్లు సమాచారం. మరి బిగ్ బాస్ షో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.