iDreamPost
android-app
ios-app

వీడియో: మొదటి రోజే హౌస్ లోకి 35 లక్షలు పంపిన బిగ్ బాస్!

  • Published Sep 03, 2023 | 1:45 PM Updated Updated Sep 03, 2023 | 1:45 PM
  • Published Sep 03, 2023 | 1:45 PMUpdated Sep 03, 2023 | 1:45 PM
వీడియో: మొదటి రోజే హౌస్ లోకి 35 లక్షలు పంపిన బిగ్ బాస్!

టెలివిజన్ చరిత్రలోనే సన్సేషన్ గా మారిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ ను చాలా గ్రాండ్ గా లాంఛ్ చేసేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి కంటెస్టెంట్లను కూడా కాస్త నేమ్, ఫేమ్ ఉన్న వారినే తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్ ను చాలా కొత్తగా ప్లాన్ చేశామని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. మొత్తం ఉల్టా పుల్టాగా ఉంటుందని ఇప్పటికే నాగార్జున చాలాసార్లు చెప్పారు. అయితే మరీ ఇంత కొత్తగా ఉంటుందని ప్రేక్షకులు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే లాస్ట్ వీక్ లో పంపే సూట్ కేస్ ని మొదటిరోజే ఇంట్లోకి పంపేశారు.

తాజాగా విడుదలైన ప్రోమోలో అందరూ ఈ సీన్ చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నిజానికి క్యాష్ సూట్ కేస్ ని లాస్ట్ వీక్ లో టాప్ 5 ఇంటిసభ్యుల కోసం పంపిస్తారు. కానీ, ఇలా మొదటిరోజే సూట్ కేస్ పంపడం పెద్దఎత్తున చర్చకు దారి తీస్తోంది. మరి.. ఆ సూట్ కేస్ ని ఎవరు తీసుకున్నారు అనే ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రోమోలో సూట్ కేస్ కోసం కొట్టుకున్నట్లు చూపించారు. అంటే ఎవరో ఒకరు తీసుకుని ఉంటారనే ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకే ఆ లక్కీ పర్సన్ ఎవరూ అంటూ తెగ వెతికేస్తున్నారు. అయితే ఆ సూట్ కేస్ ని ఎవరూ తీసుకుని ఉండరు అనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ లో ఏమైనా జరగచ్చు. వాళ్లు గేమ్ ని ఎలా అయినా మార్చచ్చు. ఇప్పుడు సూట్ కేస్ తీసుకోమని చెప్పి.. వెంటనే తీసుకున్న వ్యక్తిని ఎలిమినేట్ చేస్తున్నాం అని కూడా చెప్పచ్చు. ఇంకో రీజన్ ఏంటంటే.. బిగ్ బాస్ ద్వారా మంచి రెమ్యూనరేషన్, ఫేమ్ కూడా వస్తుంది. అలాంటి ఛాన్స్ మళ్లీ వస్తుందని కూడా చెప్పలేం.

బిగ్ బాస్ లాంటి అవకాశాన్ని వదులు కునేందుకు హౌస్ మేట్స్ తప్పకుండా జంకుతారు. ఇంకొకటి బిగ్ బాస్ వాళ్లు అంత డేర్ గా ఆ సూట్ కేస్ పంపారు అంటే.. లోపల ఉన్న వాళ్లు తీసుకోరు అనే నమ్మకంతోనే పంపి ఉండాలి. ఒకవేళ ఎవరైనా తీసుకుని ఉంటే మాత్రం వాళ్లు బయటకు వచ్చిన తర్వాత ఫుల్ ఫేమస్ అవుతారనే చెప్పాలి. ఎందుకంటే ఒక రోజు హౌస్ లో లేకుండా.. ఒక టాస్క్ ఆడకుండా.. ఒక ఎలిమినేషన్ ఎదుర్కోకుండా రూ.35 లక్షలు రావడం అంటే గొప్పే కదా. కానీ, ఆ అవకాశాన్ని అందరూ రిజెక్ట్ చేశారనే చెబుతున్నారు. ప్రోమోలో చూస్తే వెళ్లిన కొందరు తప్పకుండా కప్పుకొడతామని.. బిగ్ బాస్ మా డ్రీమ్ అని చెప్పడం చూశాం. ఇలాంటి మాటలు మాట్లాడి.. వెంటనే సూట్ కేసు తీసుకుని రావడానికి నిజానికి ఎవరైనా కాస్త ఆలోచిస్తారు. ఆ రీజన్ తోనే బిగ్ బాస్ ఈ టాస్క్ పెట్టినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ సీజన్ మొత్తం ఇలాంటి ఉల్టా పుల్టాలు ఇంకెన్నీ చూపిస్తారు. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7 మీద అంత బజ్ లేదు. కానీ, ఈ ప్రోమో వచ్చిన తర్వాత నెట్టింటి ఇప్పుడు అంతా బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom