iDreamPost
android-app
ios-app

కొట్టేసుకున్న ఇంటి సభ్యులు! మొదటిరోజే కుంపటి పెట్టేసిన బిగ్ బాస్!

కొట్టేసుకున్న ఇంటి సభ్యులు! మొదటిరోజే కుంపటి పెట్టేసిన బిగ్ బాస్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇప్పటికే లాంఛింగ్ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తైంది. షోకి సంబంధించిన ఫస్ట్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో సభ్యులు ఎవరు అనేది చూపించలేదు. కానీ వాళ్ల మాటలు మాత్రం వినిపించారు. వారిలో ప్రిన్స్ యావర్, యాంకర్ వర్షిణి ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇంక గేమ్ విషయానికి వస్తే.. ఈ సీజన్ నిజంగానే చాలా భిన్నంగా ఉండబోతోందనే చెప్పాలి. ఆ విషయంపై ఈ ప్రోమోతో క్లారిటీ వచ్చింది.

బిగ్ బాస్ షో అనేది ఈ 6 సీజన్స్ దాదాపుగా ఒకేలా ఉంది. అలా ఉండబట్టే కొత్తగా రాబోయే సభ్యులు పాత సీజన్స్ చూసి ఎలా ఆడాలో స్ట్రాటజీలు ప్లాన్ చేసుకుని వచ్చేవాళ్లు. అందుకే ఈ సీజన్ ని పూర్తిగా మార్చేస్తున్నారు. సభ్యులకు మాత్రం ఈ సీజన్ అస్సలు తేలికగా ఉండదని చెబుతున్నారు. హోస్ట్ నాగార్జున కూడా ఈ సీజన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్ మునుపటిలా ఉండదని స్పష్టం చేశారు. అంతేకాకుండా మీరు ఎంత అయినా ఊహించుకోండి.. దానికి మించి ఈ సీజన్ ఉంటుందని ప్రేక్షకులకు సవాలు విసిరారు. అలాగే ఇంటి సభ్యులకు ఇది హెవెన్ మాత్రం కాదని చెప్పారు.

అలాగే ఎప్పుడూ బిగ్ బాస్ సీజన్ లో గ్రాండ్ ఫినాలేకి క్యాష్ సూట్ కేస్ ఇచ్చేవాళ్లు. కానీ, ఈసారి మొదటి వారమే క్యాష్ తీసుకుని వెళ్లిపోండని చెబుతున్నారు. వెళ్లాలి అనుకునేవాళ్లు ఆ సూట్ కేస్ తీసుకోండి అంటూ నాగార్జున చెప్పగానే అందరూ దాని కోసం ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు పడుతూ నానా హంగామా చేశారు. ఈ సీన్ చూస్తే ప్రేక్షకులకు ఈ సీజన్ లో ఫుల్ మీల్స్ ఉంటాయని చెప్పచ్చు. ఎందుకంటే ఏ సీజన్లో కూడా తొలిరోజే హౌస్ మేట్స్ ఈ స్థాయిలో ప్రవర్తించింది లేదు. బిగ్ బాస్ కూడా తొలిరోజే టాస్కులు మొదలు పెట్టింది లేదు. కానీ, ఈ సీజన్ మాత్రం మొదటిరోజు నుంచే హౌస్ లో కుంపటి పెట్టేశారు. సభ్యులు కొట్టేసుకోవడం కూడా ప్రారంభించేశారు. ఈ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 7లో ఇంకెన్ని అద్భుతాలు చూడాల్సి వస్తుందో అని ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఊహించుకోవడం ప్రారంభించారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibombetandyou girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis