iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్‌ 7 ప్రొమో: విజయ్‌కి ఊహించని షాకిచ్చిన నాగార్జున.. మీ సమంత ఎక్కడంటూ!

  • Published Sep 03, 2023 | 1:02 PM Updated Updated Sep 03, 2023 | 1:02 PM
  • Published Sep 03, 2023 | 1:02 PMUpdated Sep 03, 2023 | 1:02 PM
బిగ్‌బాస్‌ 7 ప్రొమో: విజయ్‌కి ఊహించని షాకిచ్చిన నాగార్జున.. మీ సమంత ఎక్కడంటూ!

మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ప్రారంభం కానుంది. ఈ సీజన్‌ మిగతా సీజన్లలా ఉండదు.. పూర్తి ఉల్టా పుల్టా అంటూ.. ఇప్పటికే విడుదలైన ప్రొమోలతో ఈ సీజన్‌ మీద విపరీతమైన హైప్‌ క్రియేట్‌ చేశారు మేకర్స్‌. ఆదివారం అనగా సెప్టెంబర్‌ 3 సాయంత్రం 7 గంటలకు బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ప్రారంభం కాబోతుంది. ఈ సారి హౌజ్‌లోకి ఎంత మంది రాబోతున్నారు.. అసలు ఈ సీజన్‌ ఎలా ఉండబోతుంది అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో.. పెరిగి పోయింది. ఈ అనుమానాలన్నింటికి మరి కొన్ని గంటల్లో సమాధానాలు లభించనున్నాయి.

లాంచింగ్‌ ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రొమో.. సీజన్‌ మీద ఒక రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ చేసింది. ఇక నేడు ప్రసారం కాబోయేల లాంచింగ్‌ ఎపిసోడ్‌లో భాగంగా.. ఖుషి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విజయ్‌ దేవరకొండ ప్రత్యేక అతిథిగా వచ్చాడు. ఆరాధ్య అంటూ ఎంట్రీ ఇచ్చిన విజయ్‌ దేవరకొండకు.. నాగార్జున ఊహించని షాకిచ్చారు. ఆ వివరాలు..

2.10 నిమిషాల నిడివితో వదిలిన ప్రోమోలో కంటెస్టెంట్స్‌ హౌస్‌లోకి అలా అడుగుపెట్టారో లేదో.. వెంటనే వాళ్లు ఒకరి మీద ఒకరు పడి కొట్టుకునే టాస్క్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక ఫైనల్‌ ఎపిసోడ్‌ సందర్భంగా ఇచ్చే.. సూట్‌కేస్‌ని ఈ సారి తొలిరోజునే ఇచ్చారు. ఇదిగో సూట్ కేసు.. ఈ డబ్బులు తీసుకుని ఇప్పుడే హౌస్ నుంచి దొబ్బేయొచ్చని కంటెస్టెంట్స్‌కి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇక బిగ్‌బాస్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌ సందర్భంగా.. ‘ఖుషి’ సినిమా ప్రమోషన్స్‌ నిర్వహించారు. విజయ్‌ దేవరకొండ ఆరాధ్యా.. ఆరాధ్య.. నువ్వే లేనిదేదీ వద్దూ ఆరాధ్యా అంటూ స్టేజ్‌ మీదకు వచ్చేశాడు.

ఆ తర్వాత స్టేజ్‌ మీదకు వచ్చిన బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాగార్జున.. ఊహించని క్వశ్చన్‌తో ఇటు రౌడీ హీరోకు.. అటు ప్రేక్షకులకు భారీ షాకిచ్చారు. విజయ్ దేవరకొండను ఉద్దేశించి.. ‘‘ఏమీ మీ హీరోయిన్ సమంత ఏది’’ అంటూ ప్రశ్నించి.. అందరికి షాకిచ్చారు సామ్స్‌ మాజీ మామ నాగార్జున. ఇక ఆయన అడిగిన ప్రశ్నకు విజయ్ ఒక్క నిమిషం షాక్‌ అయ్యాడు.. ఆ తర్వాత నవ్వుతూ అలా ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రొమోకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet