సీరియల్స్ లో హీరో.. బిగ్ బాస్ లో జీరో.. శుభశ్రీని ఏడిపించేశాడు!

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అప్పుడు ఉండే రచ్చ అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ రచ్చ రచ్చ చేస్తారు. ఈసారి ప్రిన్స్ యావర్, అమర్ దీప్ అయితే కొట్టుకునేంత పని చేశారు. మిగిలిన వాళ్లు కూడా అంతకన్నా ఏం తక్కువ చేయడంలేదు. ఒకరిపై ఒకరు చిందులు తొక్కుతున్నారు. ప్రేక్షకులు మాత్రం మీలో మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్ టైన్ చేయండి అంటూ చక్కగా బిగ్ బాస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ పార్ట్-2 ప్రోమో చూసిన ప్రేక్షకులు కూడా డల్ అయిపోయారు. ఎందుకంటే క్యూట్ గా ఉండే శుభశ్రీ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఏడవడం చూసి ఆడియన్స్ గుండె చివుక్కు మంటోంది.

ఈసారి నామినేషన్స్ లో కోర్ట్ సెటప్ వేసి ముగ్గురు హౌస్ మేట్స్ ని జ్యూరి సభ్యులు అని చెప్పి ప్రక్రియ ప్రారంభించారు. అయితే నామినేషన్స్ లో భాగంగా శుభశ్రీ.. రతికా రోజ్, అమర్ దీప్ పేర్లు చెప్పింది. అందుకు తగిన కారణాలు కూడా చెప్పింది. రతికా విషయంలో అయితే తన మాజీ  ప్రియుడి పేరు వాడుతూ సిపంథీ గేమ్ ఆడుతోందని.. బిగ్ బాస్ రూల్స్ కి వ్యతిరేకంగా ఆమె ఆడుతోందంటూ కారణాలుగా చెప్పింది. అమర్ దీప్ అయితే ఇంకా హౌస్ లో ఆట మొదలు పెట్టలేదని చెబుతున్నాడు. నాకు అతని ఆట చూడాలని ఉంది. ఇంకా మైల్డ్ గానే ఆడుతున్నాను అని ఒప్పుకున్నాడు కూడా. కంటెండర్ కాబట్టి జుట్టు ఇవ్వలేదని కామెంట్స్ చేశాడు అంటూ శుభశ్రీ తన పాయింట్స్ చెప్పుకొచ్చింది.

అమర్ దీప్ వినకపోగా ఆమెపై.. శుభశ్రీ రోటీస్ అని బోర్డు పెట్టుకో అంటూ సెటైర్లు కూడా వేశాడు. తర్వాత అమర్ దీప్ నామినేషన్ సమయంలో అంతా రచ్చ మొదలైంది. “ఓడిపోయిన మనిషి.. నేను ఓడిపోయాను సార్ అని చెప్పిన తర్వాత.. వాడు ఓడిపోయాడు అని చెప్పడంలో పాయింట్ లేదు సుబ్బు. ప్రియాంకతో ఫేవర్ గా ఉన్నాను, ఆడుతున్నాను అంటే అది మా స్ట్రాటజీ. ఆమె అన్న ఆ పాయింట్ నాకు హర్టింగా అనిపించింది. నా మనసు దెబ్బతినింది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి” అంటూ అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. అందుకు శుభశ్రీ కౌంటర్ ఇచ్చింది. తాను నామినేట్ చేసినందుకు తనని తిరిగి నామినేట్ చేస్తున్నాడంటూ చెప్పింది. అది అసలు ఒక రీజనేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛీ అంటూ శుభశ్రీ అనగానే అమర్ మరింత రెచ్చిపోయాడు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ కామెంట్ చేస్తాడు.

ఇప్పుడు ఎలా డిఫెండ్ చేస్తున్నారు. మరి.. అప్పుడు ఎందుకు దమ్ము లేదు అంటూ శుభశ్రీ పాయింట్ పట్టుకుని క్వశ్చన్ చేసింది. గేమ్ ఆడలేదు అంటూ శుభశ్రీ మళ్లీ కామెంట్ చేసింది. అందుకు అమర్ దీప్ నేను ఆడను నా ఇష్టం అంటూ కామెంట్ చేశాడు. తర్వాత అమర్ దీప్ మాటలకు శుభశ్రీ ఏడ్చేసింది. దమ్ముంటే నామినేషన్ కి రీజన్ చెప్పాలి. అదేంటి రీజన్ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ గేమ్ కి వచ్చి నీ మనోభావాలు చూసుకోవాలి అదే కదా కావాల్సింది అంటూ శుభశ్రీ మాట్లాడుతుంది. ఆమె ఏడవటం చూసి ప్రేక్షకులు అంతా శుభశ్రీని ఎందుకు ఏడిపిస్తారు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. నిజానికి శుభశ్రీ చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్. ఆమె వ్యాలిడ్ పాయింట్స్ చెప్పి నామినేషన్ వేసింది. కానీ, అమర్ దీప్ మాత్రం ఆమె నామినేట్ చేసింది కాబట్టే.. కావాలని నామినేట్ చేస్తున్నట్లు అనిపించింది. పైగా లాస్ట్ వీక్ గేమ్ ఆడలేదు అనే విషయాన్ని అమర్ దీప్ స్వయంగా ఒప్పుకున్నాడు.

మైల్డ్ గా ఉన్న తన గేమ్ ని వైల్డ్ గా తీసుకెళ్తానని చెప్పాడు. అతని గేమ్ సరిగ్గా లేదని అతనే ఒప్పుకున్నాడు. పైగా ప్రియాంకతో 3.5 సంవత్సరాలు ట్రావెల్ చేశాను కాబట్టే.. ఆమె అనర్హుడు అన్నప్పుడు మాట్లాడలేకపోయాను అని చెప్పాడు. ఇప్పుడు ఆమెతో కలిసి ఆడటం నా స్ట్రాటజీ అంటున్నాడు. నిజానికి గేమ్ మీద అమర్ దీప్ కి క్లారిటీ ఉందో లేదో అర్థం కావడం లేదు. అలాగే తను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో కలిసి ఆడుతూ.. మిగిలిన వాళ్లని నామినేట్ చేస్తూ గేమ్ ఆడటం అతనికే బ్యాక్ ఫైర్ అవుతోంది. మూడో వారం నామినేషన్ నుంచి సేవ్ అయితే అమర్ దీప్ టైటిల్ కొట్టినంత ఆనందం వ్యక్తం చేశాడు. అంటే ఈ వీక్ సేవ్ అవుతాననే నమ్మకం కూడా లేకుండా గేమ్ ఆడుతున్నాడు. టైటిల్ ఫేవరెట్ గా హౌస్ లోకి వచ్చి.. గేమ్ లో మాత్రం జీరో అనే బిరుదు సొంతం చేసుకున్నాడు. మరి.. అమర్ దీప్– శుభశ్రీ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments