iDreamPost
android-app
ios-app

Bigg Boss 7: రతికను అక్క అనేసిన ప్రశాంత్.. ఇప్పటికి కళ్లు తెరిచాడు!

Bigg Boss 7: రతికను అక్క అనేసిన ప్రశాంత్.. ఇప్పటికి కళ్లు తెరిచాడు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ పార్ట్-1 ఎంతో ఇంటెన్స్ గా సాగింది. ప్రిన్స్, శుభశ్రీ, గౌతమ్ లు తమ పాయింట్స్ ని చెప్పారు. కంటెస్టెంట్స్ మధ్య చాలా స్ట్రాంగ్ ఫైట్ జరిగింది. ఎవరిని వాళ్లు డిఫెండ్ చేసుకున్నారు. అయితే నామినేషన్స్ తర్వాత ఇంకా మంచి ఫైట్ జరిగింది. అది మరెవరి మధ్యో కాదు.. రతికా రోజ్- పల్లవి ప్రశాంత్ మధ్యనే జరిగింది. నిజానికి ఈ ఫైట్ కోసం ఆడియన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ప్రశాంత్ తన గళాన్ని వినిపిస్తాడు అని ఎదురు చూశారు. ఎంతకాలం రతిక విషయంలో మౌనంగా ఉంటాడు అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు అన్నీ ప్రశ్నలకు ప్రశాంత్ సమాధానం చెప్పాడు.

గౌతమ్ ని ప్రశాంత్ నామినేషన్ చేసిన పాయింట్ లో రతికా- ప్రశాంత్ మధ్య గొడవ స్టార్ట్ అయింది. శోభాశెట్టితో గొడవ అంతా అయిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చి షర్ట్ విప్పేయడం నాకు నచ్చలేదు అంటూ ప్రశాంత్ కామెంట్ చేస్తాడు. అందుకు గౌతమ్ మాట్లాడుతూ రతిక సింగిల్ పీస్ వేసుకుందని నువ్ కామెంట్ చేయలేదా? ప్యాంటు ఏసుకోలేదు అంటూ అన్నావు కదా అంటూ కౌంటర్ ఇస్తాడు. అందుకు రతికా కూడా అవును అన్నావు అంటుంది. అందుకు ప్రశాంత్ నువ్వు నన్ను ఇక్కడ ఇక్కడ ఇక్కడ పిన్నీసులతో పొడవలేదా అంటూ చూపిస్తాడు. అందుకు రతికా ఇంకా సీరియస్ అవుతుంది. ఆ తర్వాత కూడా వీళ్ల మధ్య డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ప్రశాంత్ నువ్వు అది చేయలేదా? ఇది చేయలేదా? అంటూ ప్రశాంత్ తప్పు మాత్రమే ఉన్నట్లు కామెంట్స్ చేసింది.

ప్రశాంత్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా రిప్లయ్ ఇచ్చాడు. తనది తప్పు కాదు అన్నట్లు చెప్పుకొచ్చాడు. అందుకు నీ తప్పులేకుండా సారీ ఎందుకు చెప్పావ్ అంటూ రతిక కామెంట్ చేస్తుంది. నామినేట్ చేసినందుకు నువ్వు అంగీకరించలేదు కాబట్టే సారీ చెప్పాను అన్నట్లు ప్రశాంత్ క్లారిటీ ఇచ్చాడు. రతికా రోజ్ మాత్రం ఇష్టానికి సీరియస్ అయిపోయింది. నువ్వు నన్ను ప్రాపర్టీ ఎలా అంటావ్? నువ్వు ఎవడ్రా బై నన్ను ప్రాపర్టీ అనడానికి అంటూ రెచ్చిపోయింది. ప్రశాంత్ కూడా నేను నీతో నాకు వద్దు అని వదిలేసిన తర్వాత మళ్లీ నువ్వే వచ్చి నన్ను కదిలించావ్. నా మీద దొంగతనం నింద వేశావ్ అని నేను మళ్లీ అలా రియాక్ట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. అందుకు అది ప్రాంక్.. నీకు కూడా తెలుసు అంటూ చెబుతుంది. ప్రశాంత్ మాత్రం ప్రాంక్ అయితే చెప్తాను అన్నారు. కానీ, నాకు చెప్పకుండా దొంగతనం అంటకట్టగానే భయం వేసింది. అలా ఎలా దొంగని చేస్తారు అంటూ ప్రశ్నిస్తాడు.

రతికా మాట్లాడుతూ.. “నీకు అర్థం చేసుకునే తెలివి లేదని తెలియక.. అన్న చెప్పాడని ఫాలో అయ్యాను. నీ బుర్రలో మన్ను మశానం తప్ప ఏం లేదు. పీఆర్ అని ఎందుకు రాశావ్? నా ప్రాపర్టీ అని ఎందుకు అన్నావ్? ఎలా అవుతా.. నోటికొచ్చినట్లు మాట్లాడితే అందరూ ఏమనుకుంటారు” అంటూ రతికా రోజ్ కేకలు వేసింది. ప్రశాంత్ కూడా చాలా స్ట్రాంగ్ గానే రిప్లయ్ ఇచ్చాడు. “నీకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టిన రోజే నాకు శని పట్టింది. నీకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి మరీ శనిని కొని తెచ్చుకున్నాను. అవును నా బ్రెయిన్ లో మట్టీ మశానమే ఉంది” అంటూ చెంపలు కూడా వేసుకున్నాడు. తర్వాత నీ జోలికి రాను, నీ ఊసు తీసుకురాను, నీకు నాకు సంబంధం లేదు అంటూ తెగేసి చెప్పాడు. ఆ క్రమంలోనే రతికా రోజ్ ని.. రతిక అక్క నన్ను క్షమించు అని సారీ కూడా చెప్పాడు.

అయితే లైవ్ లో ఆ పార్ట్ కట్ అయింది. ఎపిసోడ్ లో ప్లే చేసే అవకాశం ఉంది. ప్రశాంత్ అక్క అన్నట్లు లైవ్ లో చూపించలేదు. కానీ, శివాజీ మాట్లాడుతూ అక్కా క్షమించు అని చెప్పి మంచి పని చేశావ్ అంటూ చెప్పాడు. రతికా రోజ్- పల్లవి ప్రశాంత్ విషయంలో ఇద్దరితీ తప్పు ఉంది. ఇద్దరూ కంటెంట్ కోసం ఒకరిని ఒకరు వాడుకోవాలని చూశారు. కానీ, రతికా చెప్పినట్లు మొత్తం ప్రశాంత్ తే తప్పు అనడం కరెక్ట్ కాదు. అలాగే ప్రశాంత్ ఏం తెలియకుండా అమాయకంగా ఏం చేయలేదు. కంటెంట్ కోసమే రతికా చుట్టూ తిరిగాడు. ఆమె కూడా అతని చుట్టూ తిరుగుతూ అతని ఫాలోయింగ్ ని వాడుకోవాలని చూసింది. మరి.. రతికా రోజ్- పల్లవి ప్రశాంత్ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişjojobet giriş