iDreamPost

రాహుల్ ని బ్యాడ్ చేస్తూ.. రతిక సిపంథీ గేమ్! ఇచ్చి పడేసిన శుభశ్రీ!

రాహుల్ ని బ్యాడ్ చేస్తూ.. రతిక సిపంథీ గేమ్! ఇచ్చి పడేసిన శుభశ్రీ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో సోమవారం అంటే ఎంతో ఆసక్తిగా సాగుతుంది. ఎందుకంటే ఆరోజు హౌస్ లో నామినేషన్స్ జరుగుతాయి. అప్పుడు ఎవరు ఏంటి? ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనే విషయాలు బయటకు వస్తాయి. ఈ వీక్ కూడా నామినేషన్స్ ఎంతో ఆసక్తిగా సాగాయి. ముఖ్యంగా శుభశ్రీ వర్సెస్ రతికా రోజ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. అలాగే ప్రేక్షకుల మనసులో ఉన్న చాలా అంశాలను మక్కీకి మక్కీ దించుతూ శుభశ్రీ చెప్పేసింది అనిపించింది. ఆమె ఎంతో క్లియర్ గా రతికాది సింపథీ గేమ్ అని స్పష్టం చేసేసింది. రతికా రోజ్ మాజీ ప్రియుడి గురించి కూడా కామెంట్స్ చేసింది.

ఈ వీక్ నామినేషన్స్ ప్రక్రియ కోసం న్యాయస్థానం సెటప్ వేశారు. కన్ఫామ్డ్ హౌస్ మేట్స్ అయిన ఆట సందీప్, శివాజీ, శోభాశెట్టి జ్యూరీ మెంబర్స్ గా ఉన్నారు. నామినేట్ చేసేవాళ్లు ఇద్దరి పేర్లను చెప్పి వారిపై పాయింట్స్ చెప్పాలి. అవి జ్యూరీ మెంబర్ కి నచ్చితే.. ఎవరి పాయింట్ వ్యాలిడ్ ఉంటే వారిని నామినేట్ చేస్తారు. ఒకవేళ రీజన్స్ నచ్చకపోతే వారి నామినేషన్ ని పరిగణలోకి తీసుకోరు. అలా హౌస్ లో ముందు ప్రిన్స్ యావర్ తో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. అతను ప్రియాంక, తేజలను నామినేట్ చేసేందుకు పిలుస్తాడు. ప్రియాంక, తేజపై యావర్ చెప్పిన రీజన్స్ లో ప్రియాంక విషయంలో జ్యూరీ మెంబర్స్ కన్విన్స్ అయి ఆమెను నామినేట్ చేస్తారు. తర్వాత శుభశ్రీ వచ్చి.. రతికా- అమర్ దీప్ పేర్లు చెబుతుంది.

రతికా రోజ్ విషయంలో “నువ్వు నీ మాజీ ప్రియుడి గురించి ఆలోచిస్తూ.. అమర్ దీప్ ని ఫాలో అయిపోయి నన్ను నామినేట్ చేశావ్ అది చాలా తప్పు. ఒక సెలబ్రిటీ గురించి బిగ్ బాస్ షోలో నెగిటివ్ గా మాట్లాడకూడదు అని రూల్ ఉంది. కానీ, నువ్వు నీ ఎక్స్ గురించి కావాలనే బ్యాడ్ చేస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నావ్. అది బిగ్ బాస్ రూల్స్ ని బ్రేక్ చేయడమే అవుతుంది. కేవలం నేమ్, ఫేమ్ కోసమే నువ్వు నీ ఎక్స్ గురించి మాట్లాడుతున్నావు అనిపిస్తోంది” అంటూ శుభశ్రీ చెప్పుకొచ్చింది. శుభశ్రీ చెప్పిన మాటలకు రతికా రోజ్ కౌంటర్ ఇవ్వాలని ప్రయత్నించింది. కానీ, రతికా మాత్రం తప్పు చేసింది అనే విషయాన్ని జ్యూరీ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేశారు. బ్లైండ్ గా అమర్ దీప్ ని ఫాలో అయిపోయాను అనే మాటను పట్టుకుని రతికాను నామినేట్ చేశారు.

బయట ప్రేక్షకుల్లో ఉన్న పాయింట్స్ ని శుభశ్రీ చెప్పినట్లు అనిపించింది. నిజానికి అంత బాగా హౌస్ లో ఉన్న వాళ్లు మరెవరు అర్థం చేలుకోలేదు ఏమో అనిపిస్తుంది. రతికా రోజ్ మొదటి నుంచి సింపథీ కార్డుతో గేమ్ ఆడుతోంది అనే విషయాన్ని శుభశ్రీ బయటపెట్టింది. ఎవరైతే రతికా రోజ్ మాజీ ప్రియుడు అనుకుంటున్నారో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఆ విషయంపై స్పందించాడు. నేమ్- ఫేమ్ కోసం మరొకరి పేరును వాడుకుంటున్నారు అని కామెంట్ చేశాడు. సేమ్ అవే మాటలను శుభశ్రీ వాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కావాలనే తన పేరును వాడుకుంటున్నారు అంటూ రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్ చేయడం చూశాం. దానికి తగినట్లు.. పదే పదే రతికా రోజ్ బ్రేకప్ స్టోరీని హైలెట్ చేసి బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ, శుభశ్రీ ఆ పాయింట్ ని ఓపెన్ గా చెప్పేసింది.

ఇంక అమర్ దీప్ విషయంలో కూడా శుభశ్రీ చాలా మంచి పాయింట్స్ ని రైజ్ చేసింది. కంటెండర్ కావడం కోసం జుట్టు తీసేయను అనే మాటను హైలెట్ చేసింది. హౌస్ లో పెద్దగా పని చేయడం లేదు అని చెప్పింది. అయితే శుభశ్రీ పాయింట్స్ ని అమర్ దీప్ డిఫెండ్ చేసుకోగలిగాడు. కానీ, శుభశ్రీ మాత్రం రతికా- అమర్ దీప్ విషయంలో చాలా స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పింది. చివరకు రతికా రోజ్ ని నామినేట్ చేశారు. ఈ ప్రక్రియకు ముందు కూడా శుభశ్రీ ఇదే విషయాన్ని యావర్ తో డిస్కస్ చేసింది. రతికా రోజ్ మీద నాకు చాలా పాయింట్స్ ఉన్నాయని చెప్పింది. తన ఎక్స్ విషయంలో ఆమె పదే పదే కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అంటూ చెప్పింది. అయితే యావర్ మాత్రం ఆమె వ్యక్తిగత విషయం కదా.. నామినేషన్స్ ఆ పాయింట్ మాత్రం చెప్పకు అంటూ సజీషన్ ఇస్తాడు. కానీ, శుభశ్రీ ఆ మాటను పట్టించుకోలేదు. రతికా సింపథీ గేమ్ ఆడుతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి