iDreamPost
android-app
ios-app

‘బిగ్ బాస్ 7’ అఫిషియల్ అప్డేట్! ఆటకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది!

  • Author ajaykrishna Published - 09:24 AM, Mon - 21 August 23
  • Author ajaykrishna Published - 09:24 AM, Mon - 21 August 23
‘బిగ్ బాస్ 7’ అఫిషియల్ అప్డేట్! ఆటకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది!

బుల్లితెర బిగ్ రియాలిటీ షో.. బిగ్ బాస్ సీజన్ 7తో సిద్ధం అవుతోంది. ఇప్పటిదాకా ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఈసారి మునుపటిలా ఉండదంటూ హోస్ట్ కింగ్ నాగార్జున చెబుతూ వస్తున్నారు. ఇప్పటికి బిగ్ బాస్ నుండి వచ్చిన ప్రోమోలు ప్రేక్షకులలో ఆసక్తి రెట్టింపు చేస్తూ వచ్చాయి. ఇక ఎప్పుడెప్పుడు మొదలవుతుంది? అని ఎదురు చూసిన ఆడియన్స్ కు గుడ్ న్యూస్ చెప్పేసింది బిగ్ బాస్ టీమ్. అసలు ఆట ఎప్పుడు ఆరంభం కానుందో.. డేట్ ఫిక్స్ చేసి అధికారికంగా అనౌన్స్ చేసింది బృందం. ఎట్టకేలకు ఎన్నో రూమర్స్ మధ్య బిగ్ బాస్ 7 ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. కొద్దిరోజులుగా బిగ్ బాస్ లవర్స్ లో అటెన్షన్ తగ్గకుండా ఉండేందుకు వరుసగా ఏదొక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు నిర్వాహకులు. ఈసారి గేమ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని.. రూల్స్, టాస్కులు కూడా కొత్తగా ఉంటాయని అంటున్నారు. ఏడో సీజన్ కి సంబంధించి కొత్త ప్రోమో వదిలారు. ఈసారి ప్రోమోలో స్ట్రెయిట్ గా మ్యాటర్ కి వచ్చేసారు. ఏంటంటే.. బిగ్ బాస్ 7ని గ్రాండ్ గా సెప్టెంబర్ 3న లాంచ్ చేస్తున్నారు. ఈ విషయాన్నీ ప్రోమోలో అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ కి అసలు కావాల్సిన విషయం తెలిసేసరికి ఫుల్ ఖుషి అవుతున్నారు. గత సీజన్స్ కి టిఆర్పీ రేటింగ్ ఆశించిన స్థాయిలో రాలేదు. అందుకు కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు.

ఇకపై ఏడో సీజన్ మాత్రం మునుపటిలా ఉండదని అర్ధమవుతుంది. కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో కూడా నిర్వాహకులు చాలా కేర్ తీసుకుంటున్నారని సమాచారం. ఎందుకంటే.. గత సీజన్ లో దాదాపు 80% కంటెస్టెంట్స్.. సోషల్ మీడియాలో ఫేమస్ తప్ప సినీ, సీరియల్ ప్రేక్షకులకు అంతగా పరిచయం లేరు. సో.. ఆ షో చూసేందుకు కూడా ఎవరు పెద్దగా ఆసక్తి కనబరచలేదట. అలా టిఆర్పీ రేటింగ్స్ కూడా పడిపోయేసరికి.. ఎన్నో విమర్శలు, ఆరోపణల మధ్య కొత్త సీజన్ సిద్ధం చేశారు. ప్రోమోలు చూస్తుంటే.. ఈసారి ఆటలు, టాస్కులు అన్ని కొత్తగా ఉంటాయని అనిపిస్తుందంటూ ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరోవైపు హోస్ట్ నాగ్ లుక్ కూడా కొత్తగా ఉంది. మరి బిగ్ బాస్ 7 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom