Mahesh Babu: 'గుంటూరు కారం' రూమర్లకు చెక్ పెట్టేసిన మహేష్ బాబు!

‘గుంటూరు కారం’ రూమర్లకు చెక్ పెట్టేసిన మహేష్ బాబు!

  • Author ajaykrishna Published - 08:51 AM, Mon - 21 August 23
  • Author ajaykrishna Published - 08:51 AM, Mon - 21 August 23
‘గుంటూరు కారం’ రూమర్లకు చెక్ పెట్టేసిన మహేష్ బాబు!

సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీపై అభిమానులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఆ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఆల్ టైమ్ ఫేవరేట్ లిస్ట్ లో చేరిపోయాయి. అయితే.. ఇప్పుడు తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీలో మహేష్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. కాగా.. కొద్దిరోజులుగా ఈ సినిమా చాలా ఒడిదుడుకుల మధ్య షూటింగ్ జరుపుకుంటుందని టాక్ నడుస్తుంది.

ముఖ్యంగా మహేష్ కి ల, త్రివిక్రమ్ కి స్క్రిప్ట్ విషయంలో విభేదాలు వచ్చాయని.. సినిమా నుండి ఫలానా వాళ్లు తప్పుకున్నారని.. యాక్షన్ సీన్స్ విషయంలో అసంతృప్తి నెలకొంది.. అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా? అంటూ చాలా రూమర్స్ ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండే ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏ ఒక్కరూ వాటిపై స్పందించలేదు. దీంతో రూమర్స్ అన్ని నిజమే అనే భావనలో ఉన్నారు ఓ వర్గం ఆడియన్స్. పైగా మహేష్ బర్త్ డేకి ఓ సాంగ్ రిలీజ్ చేద్దామనుకుని చేయలేకపోయారు. ఆ విషయంలో తమన్ ఇచ్చిన ట్యూన్ మహేష్ కి నచ్చలేదని.. అందుకే రిలీజ్ చేయలేదంటూ కథనాలు వచ్చేసాయి.

ఇన్ని రూమర్స్ మధ్య క్లారిటీ ఇచ్చేందుకు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ ముందుకొచ్చాడు. మొన్నటిదాకా ఫ్యామిలీతో లండన్ టూర్ వెళ్లిన మహేష్.. వేకెషన్ లో రిలాక్స్ అయి వచ్చాడు. వచ్చిరాగానే గుంటూరు కారం మూవీ గురించి రూమర్స్ కి చెక్ పెట్టేసి.. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్‌ లో జరిగిన ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌ లో పాల్గొన్న మహేష్.. “సంక్రాంతికి సినిమా వస్తుందండి.. సంక్రాంతికి రిలీజ్‌ అవుతుంది. మీ అందరు హ్యాపీ అవుతారు” అని స్ట్రెయిట్ గా చెప్పేశాడు. ఈ ఒక్క మాటతో మూవీ గురించి వస్తున్న రూమర్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఇక మహేష్ మాటలను నిర్మాత నాగవంశీ.. ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. సంక్రాంతి సందర్బంగా 2024 జనవరి 12న సినిమా రిలీజ్ చేస్తున్నామని పేర్కొన్నాడు. దీంతో మహేష్‌ ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. మరి గుంటూరు కారం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments