iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: అన్నీ తెలిసే చేస్తున్న రతిక.. ప్రశాంత్ ని బకరా చేస్తోందిగా!

Bigg Boss 7 Telugu: అన్నీ తెలిసే చేస్తున్న రతిక.. ప్రశాంత్ ని బకరా చేస్తోందిగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 స్టార్ట్ అయినప్పటి నుంచి అందరినీ పల్లవి ప్రశాంత్- రతిక జోడీ ఆశ్చర్య పరుస్తోంది. వీళ్లు హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి కలిసే తిరగడం, కలిసే ఆడటం, కలిసే తినడం చేస్తున్నారు. బిగ్ బాస్ ఎడిటర్ల పుణ్యమా అని వీళ్ల మధ్య ఏదో ఉంది అని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. వాటికి అదనంగా రతిక ప్రతిసారి నీ మనసులో ఎవరున్నారో చెప్పు? నీ దిల్ ఎవరికి ఇస్తావ్? అంటూ అడగడం ఇవన్నీ చూసి వీళ్ల మధ్య ఏదో జరుగుతోంది అంటూ ఒక కంక్లూజన్ కి వచ్చారు. అయితే అలాంటిది ఏమీ లేదని ఒక్క మాటతో రతిక తేల్చేసింది. ఆ క్లారిటీనే ఇంకా ప్రశాంత్ కు రావడం లేదు. తాజాగా ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రేక్షకులకు అయితే ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్- రతికా రోజ్ మధ్య ఏదో జరగుతోంది.. అనుకుంటున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. ఎందుకంటే వారి మధ్య ఏమీ లేదని స్వయంగా రతికానే కామెంట్ చేసింది. కాకపోతే ఆ విషయం మొత్తం చెప్పింది పల్లవి ప్రశాంత్ కి కాదులెండి.. శుభ శ్రీతో మాట్లాడుతూ తన మనసులోని మాటలు వెల్లడించింది. పల్లవి ప్రశాంత్ పై నీ ఒపినీయన్ ఏంటి అని శుభశ్రీ ప్రశ్నించగా.. అందుకు రతికా ఒక వ్యక్తిగా నాకు ప్రశాంత్ అంటే ఇష్టం అని చెప్పింది. మరి ఫీలింగ్స్ ఉన్నాయా? అని శుభ శ్రీ అడగ్గా.. అలాంటివి ఏమీ లేవు అని కుండ బద్దలు కొట్టేసింది. వారి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది. ఆ టాపిక్ ని శుభ శ్రీ కంటిన్యూ చేస్తూ.. ప్రశాంత్ కి మాత్రం నీపై ఫీలింగ్స్ ఉన్నాయి అంటుంది. అందుకు రతికా చెప్పిన సమాధానం అందరినీ షాక్ కి గురి చేసింది.

అలాంటి డిస్కషన్ వారి మధ్య జరిగిందని చెప్పింది. అయితే అతను జెన్యూన్ గా ఉన్నాడా? లేక గేమ్ కోసం అలా బిహేవ్ చేస్తున్నాడా? అనే విషయాలు మాత్రం తనకి తెలియదని చెప్పింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఇక్కడే రతికా ప్రవర్తనపై కొన్ని అనుమానాలు వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ ఏం అనుకుంటున్నాడో అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. తనకి ఎలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు ప్రశాంత్ తో ఎందుకు అంత క్లోజ్ గా ఉండాలి? ఆ మాట అడిగితే.. ఫ్రెండ్స్ అన్నాక క్లోజ్ గా ఉండరా? అని తిరిగి ప్రశ్నించవచ్చు. అయితే పదే పదే లవ్, అట్రాక్షన్ టాపిక్స్ గురించి ఎందుకు ప్రశ్నించాలి? ఏదో కంటెంట్ క్రియేట్ చేయడం కోసమే ఇలా చేస్తున్నట్లు అర్థమైపోతుంది. అంతేకాకుండా కావాలనే రతిక– పల్లవి ప్రశాంత్ ని బకరా చేయాలని చూస్తోంది అంటూ కొందరు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.

మరోవైపు రతికా మాట్లాడిన మాటల ప్రకారం పల్లవి ప్రశాంత్ కూడా స్ట్రాటజీ పరంగానే ముందుకు వెళ్తున్నాడు ఏమో అనిపిస్తోంది.  ఎందుకంటే బిగ్ బాస్ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు హౌస్ లో ఎలా ఉంటే అతను హైలెట్ అవుతాడో తెలిసే ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకునే ఇలా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. అంత క్లోజ్ గా ఉండే రతికానే ప్రశాంత్ జెన్యూన్ గా ఇష్టపడుతున్నాడా? గేమ్ కోసం అలా చేస్తున్నాడో తెలియదు అంటే.. ప్రశాంత్ కూడా ఏదో దాస్తున్నాడు అనే అర్థం. ప్రశాంత్ కంటెట్ కోసం కాకపోతే.. ఉన్నది ఉన్నట్లు నాకు నీ మీద ఎలాంటి ఉద్దేశం లేదు అనే ఒక్క ముక్కలో చెప్పేయచ్చు. కానీ, అతను అలా చేయడం లేదు. రతికా ప్రేమ టాపిక్ తెచ్చిన ప్రతిసారి మెలికలు తిరిగిపోతున్నాడు.

ఎవరైనా రతికాకి దగ్గరగా వస్తే జలస్ ఫీలవుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడు. కారణం లేకుండా టేస్టీ తేజాని బాబాయ్ అని పిలువు అంటూ రతికాని ఫోర్స్ చేశాడు. ఇవన్నీ చూసి ప్రేక్షకులు కూడా.. ప్రశాంత్ కంటెంట్ కోసమే ఇలా చేస్తున్నాడేమో అని అనుమానిస్తున్నారు. శోభా శెట్టి వచ్చి ప్రశాంత్ ని చూస్తుంటే నాకు అన్న అనే భావన కలుగుతోంది అంటుంది. అది విన్న ప్రశాంత్ నాకు కూడా శోభాని చూస్తే సిస్టర్ ఫీలింగ్ వచ్చింది అని చెప్పాడు. మరి.. రతికా విషయంలో కూడా ఏదొక ఫీలింగ్ ఎక్స్ ప్రెస్ చేస్తే సరిపోతుంది కదా? ఎందుకు ఊరికే లాగి లాగి ల్యాగ్ చేస్తున్నాడు? కంటెంట్ కోసమే కదా? అంటూ ఇప్పుడు ప్రేక్షకులు కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి.. ఏదో అనుకుంటే ఇకేదో అయ్యేలా ఉంది? పల్లవి ప్రశాంత్ కూడా ఇప్పటికైనా తన వర్షన్ ఏదో వినిపించేస్తే.. ఈ రచ్చ ఇక్కడితే ఆగిపోయే అవకాశం ఉంటుంది. తెగేదాకా లాగితే మాత్రం మొదటికే మోసం అయ్యే ప్రమాదం లేకపోలేదు. పల్లవి ప్రశాంత్- రతికా ఫ్రెండ్ షిప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి