Bigg Boss 7 Telugu- Pallavi Prashanth- Rathika: రతికకు ఇచ్చి పడేస్తున్న పల్లవి ప్రశాంత్.. ఛాన్స్ దొరికినప్పుడల్లా..!

రతికకు ఇచ్చి పడేస్తున్న పల్లవి ప్రశాంత్.. ఛాన్స్ దొరికినప్పుడల్లా..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఇంకా సరైన లవ్ ట్రాక్ సెట్ కాలేదనె చెప్పాలి. సాధారణంగా హౌస్ లో కచ్చితంగా ఒక్కటన్నా ట్రాక్ వర్కౌట్ అవుతుంది. కానీ, ఈ ఉల్టా పుల్టా సీజన్ లో మాత్రం అది ఇంకా సాధ్యం కాలేదు. హౌస్ లో పల్లవి ప్రశాంత్- రతికా రోజ్ మధ్య ట్రాక్ వర్కౌట్ అయింది అనుకుంటున్న సమయంలో అందరికీ షాకిస్తూ.. రతిక ప్లేట్ ఫిరాయించింది. పల్లవి ప్రశాంత్ పై తనకి ఎలాంటి ఫీలింగ్స్ లేవని.. తాను ఒక వ్యక్తిగానే ఇష్టం అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే అది నేరుగా ప్రశాంత్ కి కాకుండా కంటెస్టెంట్స్ తో మాట్లాడింది. ప్రశాంత్ కంటెంట్ కోసమే ఇలా చేస్తున్నాడేమో అంటూ తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చింది. ఆ తర్వాత నామినేషన్స్ లో విరుచుకుబడింది.

పల్లవి ప్రశాంత్- రతికా రోజ్ మధ్య జరిగింది మొత్తం చూసిన ప్రేక్షకులు ఈ విషయంలో ప్రశాంత్ కే మద్దతుగా నిలిచారు. అలాగే నామినేషన్స్ లో ప్రశాంత్ టార్గెట్ అవడంతో మరింత సింపథీ వచ్చింది. అయితే ఈ లవ్ ట్రాక్ గురించి రతికా ఇంకా వదిలిపెట్టడం లేదు. ఎపిసోడ్ 13లో కూడా ప్రశాంత్ దే తప్పు అని నిరూపించే ప్రయత్నం చేసింది. యావర్ తో కూర్చుని ఉన్నప్పుడు ప్రశాంత్ నువ్వు అంతా కావాలనే చేశావ్ కదా అన్నట్లుగా ప్రశ్నించింది. అతను ఒక క్లోజ్ ఫ్రెండ్, మనవాళ్లు అనే ధోరణిలో తనతో క్లోజ్ గా ఉన్నాను అంటాడు. అయితే ఆ విషయాన్ని అందరి ముందు చెప్పుంటే బాగుండేది.

ఇదంతా చూసిన తర్వాత ప్రేక్షకులు పల్లవి ప్రశాంత్ ఎప్పుడు రతిక చేసిన మోసంపై స్పందిస్తాడు అని ఎదురుచూశారు. అయితే ప్రశాంత్ తన రివేంజ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు కూడా. హౌస్ లో రతికా ఏం చేసినా కౌంటర్స్ ఇస్తున్నాడు. ఎక్కడా కూడా రతికా గేమ్ ని ఎంకరేజ్ చేయడం లేదు. ఆమె బఫూన్స్ అన్నప్పుడు కూడా అదే టీమ్ లో నువ్వు కూడా ఉన్నావ్ అంటూ కామెంట్ చేస్తాడు. మాయాస్త్రం టాస్కులో కూడా  ఆమె ప్రిన్స్ పేరు చెప్పాలి అనుకున్నాను అన్నప్పుడు.. ప్రశాంత్ అదేదో అప్పుడే చెప్పుండాలి. ఇప్పుడు వచ్చి ఇలా టీమ్ ని ఎందుకు అంటున్నావ్ అంటూ కౌంటర్ ఇస్తాడు. ఇలా ఒక్క విషయంలో కాదు.. ప్రతి విషయంలో రతికాకి కౌంటర్ ఇస్తున్నాడు. ఇది చూసిన ఆడియన్స్.. ప్రశాంత్ రివేంజ్ స్టార్ట్ చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొత్తగా ప్రిన్స్ యావర్- రతికా రోజ్ పులిహోర్ హైలెట్ అయింది. ప్రిన్స్ కూడా రతికాకి ఫిదా అయినట్లు కనిపిస్తోంది. అయితే ప్రిన్స్ యావర్- పల్లవి ప్రశాంత్ పడుకుని మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ప్రశాంత్.. యావర్ ని అడుగుతాడు. ‘నువ్వు రతికాని లవ్ చేస్తున్నావా?’ అని. అందుకు యావర్ అలా ఏం లేదు. కాకపోతే కాస్త ఫీలింగ్స్ ఉన్నాయి అని చెబుతాడు. ఆమె ఎందుకో గుడ్ హార్టెడ్ పర్సన్ లా ఉంది అంటాడు. అందుకు పల్లవి ప్రశాంత్ గట్టి రిప్లయ్ ఇచ్చాడు. గుడ్ హార్టా? కొద్దిరోజులు పోతే నీకే అర్థమైద్దిలే అంటూ నవ్వుతాడు. ఎపిసోడ్ 13లో ఈ క్లిప్ చాలా బాగా హెలెట్ అయింది. మంచిగా ఉన్నన్ని రోజులు ఉండి. ఒక్కసారిగా ప్రశాంత్ పై విరుచుకుపడిన రతికాకి.. ప్రశాంత్ బాగానే బుద్ధి చెబుతున్నాడు అంటూ అభిప్రాయపడుతున్నారు. పల్లవి ప్రశాంత్ రివేంజ్ గేమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments