iDreamPost
android-app
ios-app

Pallavi Prashanth: నన్ను CMని చేయండి! పల్లవి ప్రశాంత్ కామెడీ మళ్ళీ స్టార్ట్ భయ్యా!

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తనను సీఎం చేయాలని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో నెటిజన్లు ప్రశాంత్ మళ్ళీ కామెడీ స్టార్ట్ చేశాడు భయ్యో అంటూ ట్రోల్ చేయడం మెుదలుపెట్టేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తనను సీఎం చేయాలని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో నెటిజన్లు ప్రశాంత్ మళ్ళీ కామెడీ స్టార్ట్ చేశాడు భయ్యో అంటూ ట్రోల్ చేయడం మెుదలుపెట్టేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Pallavi Prashanth: నన్ను CMని చేయండి! పల్లవి ప్రశాంత్ కామెడీ మళ్ళీ స్టార్ట్ భయ్యా!

పల్లవి ప్రశాంత్.. రైతు బిడ్డగా బిగ్ బాస్ లాంటి ఓ రియాలిటీ షోలోకి అడుగుపెట్టడమే కాకుండా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా నిలిచి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విన్నింగ్ ర్యాలీలో చేసిన రచ్చ కారణంగా జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. తాను గెలిచిన డబ్బును రైతులకు పంచి పెడతానని మాటిచ్చిన అతడు, ఇటీవల ఆ సహాయం కూడా చేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను సీఎం చేయాలంటూ అర్ధం పర్ధం లేని కామెంట్స్ చేశాడు. దీంతో పల్లవి ప్రశాంత్ మళ్ళీ కామెడి స్టార్ట్ చేశాడు భయ్యో అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేయడం మెుదలుపెట్టేశారు.

రైతుబిడ్డగా, సాధారణ యూట్యూబర్ గా తన ప్రయాణం మెుదలుపెట్టిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం ఓ సెలబ్రిటీగా మారాడు. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ సాధించి.. అందరిని షాక్ కు గురిచేశాడు. కాగా.. తాను గెలుచుకున్న డబ్బులో కొంత రైతులకు పంచిపెడతానని అప్పట్లో మాటించాడు. తాజాగా ఆ మాటను నిలబెట్టుకున్నాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. మరోసారి విచిత్రమైన స్టేట్మెంట్ తో న్యూస్ లో నిలిచాడు. లేటెస్ట్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ తనను సీఎం చేయాలని, అప్పుడే రైతులు బాగుపడతారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కామెంట్స్ వైరల్ కావడంతో.. ట్రోలర్స్, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

సీఎం చాలా? పీఎం కూడా చేయాలా? రాజకీయాలు అంటే రస్నా తాగినంత ఈజీ అనుకుంటున్నావా? అందుకే అంటారు చెప్పేటోడు అది అయినా.. వినేటోడు ఇవరమంతుడు కావాలంట, ప్రశాంత్ అన్న మళ్లీ కామెడీ స్టార్ట్ చేశాడు భయ్యో అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ హోదాలో ఉన్నప్పుడు కాస్త చూసుకొని మాట్లాడాలి కదా ప్రశాంత్ బ్రో ఇలాంటి కామెంట్స్ చేసి కమెడియన్ అయిపోకు అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. మరి సీఎం ను చేయండి అన్న పల్లవి ప్రశాంత్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఆ హీరో ఇచ్చిన సలహాను ఇప్పటికీ పాటిస్తాను: శ్రియా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి