Prince Yawar- Rathika Rose: ప్రశాంత్ అయిపోయాడు.. ఇప్పుడు ప్రిన్స్ తో పులిహోర కలుపుతోంది!

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ అయిపోయాడు.. ఇప్పుడు ప్రిన్స్ తో పులిహోర కలుపుతోంది!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట మరింత ఆసక్తిగా సాగుతోంది. హస్ లో కంటెస్టెంట్స్ మధ్య రచ్చ రచ్చ జరగుతోంది. ఎవరూ కూడా ఎక్కడా తగ్గడం లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద గొడవలే పడుతున్నారు. హౌస్ లో గ్రూపులు మరింత బలపడ్డాయి. మాయాస్త్ర టాస్కుతో మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. పవరాస్త్ర కోసం కంటెండర్లను సెలక్ట్ నిర్ణయించే క్రమంలో చాలానే గొడవలు అయ్యాయి. ఇంకా ఆ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత ప్రిన్స్ యావర్- గౌతమ్ కృష్ణ మధ్య కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. తలుపులు తీయండి నేను వెళ్లిపోతా అంటూ గోల చేశాడు. బిగ్ బాస్ పిలిచి మాట్లాడాక కూల్ అయ్యాడు.

అయితే ఇలా గొడవలతో హీటు మీదున్న హౌస్ లో మరోసారి లవ్ ట్రాక్ అనే అంశం తెరపైకి వచ్చింది. అయితే ఆ ట్రాక్ మరెవరో కాదు.. రతిక- ప్రిన్స్ మధ్యనే. ఇప్పటి వరకు హౌస్ లో కేకలు వేసి అలిసిపోయిన ప్రిన్స్.. రతికాతో పులిహోర కలుపుతూ కనిపించాడు. లాన్ లో పల్లవి ప్రశాంత్, రతిక, శివాజీ కుర్చీల్లో కూర్చుని ఉండగా.. ప్రిన్స్ యావర్ మాత్రం కంద పడుకుని ఉన్నాడు. ప్రిన్స్ యావర్ పెద్దయ్యతో మాట్లాడి వచ్చాక సల్లబడ్డాడు అంటూ రతిక అంటుంది. ప్రిన్స్ వెంటనే ఐ లైక్ యూ రతిక అంటాడు. అందుకు రతిక వెంటనే ఐ లైక్ యూ టూ అంటూ సమాధానం చెబుతుంది. ఏమవుతోంది అని అడగ్గా.. ప్రిన్స్ ప్రేమ బయటకు వస్తోంది అని చెబుతాడు.

వర్షం పడుతోందని రతిక పైకి పరుగులు పెట్టగా.. కిందనే ఉన్న ప్రిన్స్ ఆమెను చూస్తూ ఉంటాడు. రతిక పైకి వెళ్లిన తర్వాత అన్వర్ అంటూ కేకలు వేస్తుంది. ప్రిన్స్ కింద నుంచి రతికా అంటూ కేకలు వేస్తాడు. ఇలాంటి సీన్స్ వస్తే బిగ్ బాస్ ఏం చేస్తాడో తెలుసు కదా. వెంటనే ఒక లవ్ బీజీఎం వేసేసి ఆ సీన్ ని ప్రోమోలో హైలెట్ చేశాడు. ఉదయం ఫుల్ హీటున్న ప్రోమో వదిలి.. మధ్యాహ్నానికి లవ్ టచ్ ఇచ్చాడు. ఇంక ఇదే ప్రోమోలో ప్రిన్స్ యావర్ మరో విషయంలో హైలెట్ అయ్యాడు. అట సందీప్ తో ప్రిన్స్ యావర్ కి గొడవ జరుగుతుంది. చపాతీల విషయంలో ఆట సందీప్ కు ప్రిన్స్ యావర్ కు గొడవ జరిగింది. నేను 25 నుంచి 30 వరకు చపాతీలు చేస్తాను అంటూ ఆట సందీప్ అంటాడు. అందుకు ప్రిన్స్ యావర్.. అందరికీ చెప్పు. నాకు అవసరం లేదు అంటూ చెబుతాడు. నేను నీకు చెప్పానా? నా ఇష్టం నా కళ్లురా నేను ఎటైనా చూస్తాను అంటూ సీరియస్ అవుతాడు.

నువ్వు నాకు వేలు చూపించావ్ కాబట్టే నేను రియాక్ట్ అయ్యాను అంటూ యావర్ చెప్తాడు. నీకు చెప్పట్లేదు నేను.. నీకు తెలుగు అర్థం కావడంలేదు నీకు ఇక్కడ వర్కౌట్ కాదు అంటూ సందీప్ అంటాడు. అందుకు ప్రిన్స్ యావర్ అయితే బిగ్ బాస్ కి చెప్పు అంటాడు. ఈ గొడవ తర్వాత కట్ చేస్తే.. పవరాస్త్ర కోసం రెండో పోటీదారుడిని ఎంచుకోమంటూ సందీప్ కే ఛాన్స్ ఇచ్చాడు. ఈ పాయింట్ తో ఆట మరింత ఆసక్తిగా మారనుంది. అయితే ప్రిన్స్ యావర్ కు ఈ ఎపిసోడ్ బాగా మైలేజ్ తెచ్చిపెట్టేలా ఉంది. గత నామినేషన్స్ నుంచి ప్రిన్స్ గేమ్ బాగా ఆడుతున్నాడు. తెలుగు రాకపోయినా.. మంచి పాయింట్ తీసి మాట్లాడుతున్నాడు. మొత్తానికి ప్రిన్స్ యావర్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేలా ఉన్నాడు. మరి.. ప్రిన్స్ యావర్- ఆట సందీప్ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments