బుల్లితెర ప్రేక్షకులకు మోస్ట్ ఫేవరేట్ రియాలిటీ షో అయిన ‘బిగ్ బాస్ సీజన్ 7’ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. హోస్ట్ నాగార్జున.. గత సీజన్స్ లాగే అదే ఎనర్జీతో షోని ప్రారంభించారు. ఇప్పటిదాకా ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకోగా.. ఏడో సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు ఆడియన్స్. మొత్తానికి విమర్శలు, ఆరోపణల మధ్య.. ఈసారి ఇదివరకటిలా ఉండదు అంటూ బిగ్ బాస్ 7 మొదలైంది. ఈ ఏడో సీజన్ లో మొత్తం పదిహేను కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. చాలామంది తెలిసిన వారితో పాటు డిఫరెంట్ కేటగిరిస్ కింద కొత్త వాళ్లను కూడా పరిచయం చేశారు. అలా వచ్చి రాగానే తన గ్లామర్, పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది రాయగురు శుభశ్రీ.
అరే.. స్టేజ్ పై సమ్మోహనుడా అంటూ పెర్ఫార్మన్స్ అదరగొట్టింది. హోస్ట్ నాగ్ తో పాటు ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అయ్యారు. ఇంతకీ ఎవరీ శుభశ్రీ..? ఆ వివరాల్లోకి వెళ్తే.. హౌస్ లోకి 5వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శుభశ్రీ టాలీవుడ్ లో నటిగా రాణిస్తోంది. ఇప్పటిదాకా తెలుగుతో పాటు తమిళంలో సైతం చాలా సినిమాలలో మెరిసిన ఈ భామ.. ఇటీవల కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమాలో చిన్న పాత్రతో పలకరించింది. అయితే.. హోస్ట్ నాగ్ శుభశ్రీ గురించి చెబుతూ.. ఆమె నటి కాకముందే లాయర్ అని సర్ప్రైజ్ చేశాడు. ఒడిశాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో కాస్త బోల్డ్ గానే కనిపిస్తుంది. తెలుగులో సినిమాలు చేస్తున్నప్పటికి.. తెలుగు భాషపై అంతగా అవగాహన లేదని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా మాట్లాడటం నేర్చుకుంటోంది.
ఇక తెలుగు కొంచం ఉంది.. తెలివి మాత్రం చాలా ఉందంటూ నాగ్ కి ఝలక్ ఇచ్చిన శుభశ్రీ.. ఒడిశా నుండి బిగ్ బాస్ వరకు ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఒడిశాకు చెందిన ఈ భామ.. ఓవైపు లాయర్ గా వర్క్ చేస్తూనే నటనపై ఆసక్తితో హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. స్కూల్ డేస్ నుండే ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి స్పోర్ట్స్ లో చురుకుగా తన ప్రతిభ చాటింది. అలా కాలేజీ డేస్ లో మెల్లగా మోడలింగ్ వైపు అడుగులు వేసి.. 2020లో “VLCC ఫెమినా మిస్ ఇండియా ఒడిశా” టైటిల్ ని గెలిచింది. ఆ తర్వాత యాంకర్ గా లైవ్ షోస్ చేసి. ఎం 2022లో రుద్రవీణ సినిమాతో టాలీవుడ్ లో నటిగా డెబ్యూ చేసింది. అలా డెవిల్ మూవీతో తమిళంలోకి వెళ్ళింది. ఇప్పటిదాకా చాలా సినిమాలలో మెరిసిన శుభశ్రీ.. నటిగా మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. మరి ఇప్పుడు బిగ్ బాస్ 7లో ఎలా రాణిస్తుందో చూడాలి. శుభశ్రీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.