Arjun Suravaram
Ashwini Sree: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టైన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే అతడు బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇక ప్రశాంత్ అరెస్టు పై బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ కూడా స్పందించారు.
Ashwini Sree: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టైన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే అతడు బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇక ప్రశాంత్ అరెస్టు పై బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ కూడా స్పందించారు.
Arjun Suravaram
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్ కు గెలిచిన ఆనందం ఒక్కరోజు కూడా లేకుండా పోయింది. ఇటివలే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిసిన రోజు జరిగిన రచ్చ ఇంత అంతా కాదు. అన్నపూర్ణ స్టూడియో బయట ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ చౌదరి కారుతో పాటు పలువురు సెలబ్రిటీస్ అయిన అశ్విని శ్రీ , గీతూ రాయల్ తదితర సెలబ్రిటీల కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే.. ఆరు ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని తమ్ముడిని కూడా అరెస్టు చేశారు.
ప్రస్తుతం కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే.. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ అరెస్టు పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రైతు బిడ్డని అరెస్టు చేయడం అన్యాయమని, అతనితో పాటు బిగ్ బాస్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదం పై పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ప్రశాంత్ కు మద్దతుగా నిలిస్తున్నారు. తాజాగా మరో లేడీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రశాంత్ అరెస్టు పై స్పందించింది. ఆయనికి మద్దతును తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ స్పందించిన విషయం తెలిసిందే. రైతు బిడ్డ ప్రశాంత్ త్వరలోనే బయటకు వస్తాడంటూ ఓ వీడియో రీలీజ్ చేశాడు. అయితే ఈ క్రమంలోనే మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని కూడా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై స్పందిస్తూ సోషల్ మీడియలో వీడియో పోస్ట్ చేశారు. ఆమె మాట్లాడుతూ..”పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారని తెలిసింది. ఇది అసలు కరెక్ట్ కాదండి, ఓ కామన్ మ్యాన్‌గా వచ్చిన అతను బిగ్ బాస్ టైటిల్ గెలిచాడు. పాపం ప్రశాంత్ ఏం చేశాడండి? అతన్ని చూసేందుకు అన్నపూర్ణ స్టూడియో వద్దకు ఫ్యాన్స్ వచ్చారు. ప్రశాంత్ మంచి వ్యక్తి , చాలా అమాయకుడు. బిగ్ బాస్ ట్రోఫీ గెలిచి ఒక్కరోజు ముగియకుండానే అతనిని అరెస్ట్ చేశారు.. ఇది చాల తప్పు. అతనికి ట్రోఫీ గెలిచారన్న సంతోషం కూడా లేకుండా చేశారు.
నా తమ్ముడు లాంటి వ్యక్తిని జైల్లో వేశారంటనే చాలా బాధగా ఉంది. అతను త్వరగా బయటికి రావాలని కోరుకుంటున్నా. ప్లీజ్ ప్రశాంత్‌కు అందరూ మద్దతుగా నిలవండి. గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన అల్లర్లు తప్పే. ఇది అతని అభిమానుల అత్యుత్సాహంతో చేసిన పొరపాటు. ఇందులో పల్లవి ప్రశాంత్‌ది తప్పేం లేదు. దయచేసి రైతు బిడ్డను రిలీజ్ చేయాలని తెలంగాణ పోలీసులకు విజ్ఞుప్తి చేస్తున్న” అంటూ అశ్విని శ్రీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం అశ్విని శ్రీ చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చాలామంది అభిమానులు, నెటిజన్లు పల్లవి ప్రశాంత్ కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. మరి..పల్లవి ప్రశాంత్ అరెస్టుపై అశ్విని శ్రీ స్పందిస్తూ చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.