iDreamPost
android-app
ios-app

రూటు మార్చిన సోనియా.. విష్ణు ప్రియ ముందు ఓటమి అంగీకరించిందా?

  • Published Sep 16, 2024 | 1:45 PM Updated Updated Sep 16, 2024 | 1:45 PM

సరికొత్త టాస్కులు, ట్విస్టులతో ఆకట్టుకుంటుంది బిగ్ బాస్ సీజన్ 8. ఈ సారి కెప్టెన్ బదులు.. క్లాన్స్( గ్రూప్), లీడర్స్ అంటూ తీసుకు వచ్చారు. అలాగే తినేందుకు రేషన్, ఇతర వస్తువులు సంపాదించుకునేందుకు పోరాడాల్సిందే. . అయితే కంటెంట్ ఇస్తారు అనుకున్న కంటెస్టెంట్స్.. కొంత మంది నెగిటివిటీని మూటగట్టుకుంటున్నారు. అందులో ఒకరు సోనియా ఆకుల.

సరికొత్త టాస్కులు, ట్విస్టులతో ఆకట్టుకుంటుంది బిగ్ బాస్ సీజన్ 8. ఈ సారి కెప్టెన్ బదులు.. క్లాన్స్( గ్రూప్), లీడర్స్ అంటూ తీసుకు వచ్చారు. అలాగే తినేందుకు రేషన్, ఇతర వస్తువులు సంపాదించుకునేందుకు పోరాడాల్సిందే. . అయితే కంటెంట్ ఇస్తారు అనుకున్న కంటెస్టెంట్స్.. కొంత మంది నెగిటివిటీని మూటగట్టుకుంటున్నారు. అందులో ఒకరు సోనియా ఆకుల.

  • Published Sep 16, 2024 | 1:45 PMUpdated Sep 16, 2024 | 1:45 PM
రూటు మార్చిన సోనియా.. విష్ణు ప్రియ ముందు ఓటమి అంగీకరించిందా?

అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దూసుకెళుతోంది బిగ్ బాస్ సీజన్ 8. ఒకసారి కమిటైతే.. లిమిటే లేదు అంటూ మొదలైన ఈ సీజన్ కావాల్సినంత కంటెంట్ ఇస్తుంది. సరికొత్త టాస్కులు, ట్విస్టులతో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు ఎలిమినేషన్లు చోటుచేసుకున్నాయి. బెజవాడ బేబక్క, శేఖర్ భాషా హౌస్ నుండి బయటకు వచ్చేశారు. మిగిలిన 12 మంది ఇంటి సభ్యుల మధ్య హోరా హోరీ పోరు నడుస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సారి ఈ కంటెస్టెంట్స్ ఫుల్ కంటెంట్ ఇస్తారు అనుకుంటే.. వియర్డ్ బిహేవియర్‌తో నెగిటివిటీ మూటగట్టుకుంటున్నారు. వారిలో ఒకరు సోనియా ఆకుల. ఆర్జీవీ శిష్యురాలిగా ఇంట్లోకి అడుగుపెట్టిన సోనియా.. వెళ్లడం వెళ్లడం..బేబక్కతో కుక్కర్ పంచాయతీ పెట్టుకుంది.

ఆట కన్నా మాటలతోనే యుద్ధం చేసేందుకు ప్రయత్నించింది. బహుశా ఇది ఆమె స్టైల్ ఆఫ్ గేమ్ అనుకున్నారు తొలుత. కానీ రాను రానూ హర్టింగ్ వర్డ్స్, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వీక్షకులకు చిరాకు తెప్పించింది. తనను తాను ఆడపులి అనుకోవడమే తప్ప.. ఎక్కడా అలా ప్రవర్తించలేదు. తాను మాటల్లో కూడా ఓడిపోతున్నానని తెలియగానే.. ఎదురు దాడికి ప్రయత్నిస్తుంది. అందుకు ఉదాహరణ.. విష్ణుప్రియపై ఆమె చేసిన వల్గర్ కామెంట్స్. అడల్ట్ కామెడీ అనడంతో పాటు.. నిన్ను పట్టించుకునే వాళ్లు ఎవరు లేరేమో విష్ణు..నన్ను పట్టించుకుంటారు, నాకు ఫ్యామిలీ ఉంది అంటూ కామెంట్స్ చేయడం, ఆమెకు డ్రెస్ సెన్స్ లేదని, టాస్క్ అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యలు చేయడం విష్ణు ప్రియ, బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు.. నాగార్జున సైతం ఫైర్ అయ్యారు.

ఇలా అనడం కరెక్టేనా అంటూ ఆమెను ప్రశ్నించడంతో పాటు కీప్ క్వైట్, ఆమె గురించి తెలిసి కూడా అంత హర్టింగ్ వర్డ్స్ ఎలా అన్నావని, మాటలు అదుపులో పెట్టుకోవాలంటూ సోనియాకు వార్నింగ్ ఇచ్చాడ్ నాగ్ సార్. అదే సమయంలో 90 మార్కులు వస్తాయనుకునే స్టూడెంట్‌కు.. 40 మార్కులు వస్తే డిసప్పాయింట్ అవుతామా లేదా అంటూ ఆమె ఆట తీరు ఎలా ఉందో హింట్ ఇచ్చాడు. ఇలాగే ఉంటే గ్రాఫ్ తగ్గిపోతుందంటూ చెప్పాడు హోస్ట్ నాగార్జున. దీంతో అప్పటి వరకు ఒకలా ఉన్న సోనియా.. మరుసటి రోజుకు రూటు మార్చింది. ఈ ఆదివారం విషయానికి వస్తే.. విష్ణుప్రియతో మింగిల్ అవ్వడానికి విపరీతంగా ప్రయత్నించింది. ఆమెను అంటిపెట్టుకుని ఉండటమే కాకుండా టాస్క్ విషయంలో కూడా విష్ణుకు ఫేవర్‌గా ఉండటం చేసింది. అలాగే పృధ్వీ వీరి మధ్యలోకి వచ్చేందుకు ప్రయత్నించిన సమయంలో కూడా అడ్డుకుంది సోనియా.

విష్ణు ఎలిమినేషన్ నుండి బయటపడినప్పుడు కూడా ఆమెకు కంగ్రాట్స్ చెప్పింది సోనియా. దీంతో ఈ ఇద్దరి మధ్య జరిగిన పోరులో విష్ణుదే పై చేయిగా మారింది. నాగార్జున హింట్ ఇవ్వకముందు.. విష్ణు ప్రియను అనరాని మాటలు అని.. సారీ కూడా అడిగితే.. నేనేందుకు చెబుతా..నేను బరా బర్ ఇట్లానే అంటా అంటూ కామెంట్స్ చేసిన సోనియా.. శనివారం ఎపిసోడ్ తర్వాత ఒక్కసారిగా మహానటిని మించిపోయేలా మంచి తనం అనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది. దెబ్బకు ఆట తీరు మార్చేసింది. తాజాగా విష్ణుతో ఆమె ప్రవర్తన చూస్తే.. అప్పుడు సోనియా రియలా.. ఇప్పుడు ఈ సోనియా రియలా.. ఏదీ ఫేకో తేల్చుకోలేకపోతున్నారు. మరి సోనియా ప్రవర్తనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom