Arjun Suravaram
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిలో తనదైన మార్క్ ను చూపించారు. విద్యా, వైద్య రంగాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిలోనూ సీఎం జగన్ తన ప్రత్యేకతను చూపించారు. అలాంటి అభివృద్ధి పనుల్లో విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణం ఒకటి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిలో తనదైన మార్క్ ను చూపించారు. విద్యా, వైద్య రంగాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిలోనూ సీఎం జగన్ తన ప్రత్యేకతను చూపించారు. అలాంటి అభివృద్ధి పనుల్లో విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణం ఒకటి.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..తన ఐదేళ్ల పాలన ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలను చేపట్టారు. సంక్షేమం, అభివృద్ధి రెండిటిని జొడెద్దుల పరుగులు పెట్టించారు సీఎం జగన్. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా సీఎం జగన్ తన పాలనను సాగించారు. అందుకు ఉదాహరణ రాయలసీయ నుంచి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం వరకు చేపట్టిన అనేక అభివృద్ధి పనులే. అలానే ఏపీలోని ప్రధాన నగరాల్లో ఒకటైన విజయవాడ అభివృద్ధిలో సీఎం జగన్ కీలక పాత్ర పోషించారు. అందుకు నిదర్శనే ఇటీవల పూరైన విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణం. దీంతో విజయవాడలో ఉన్న ఏళ్ల నాటి ట్రాఫిక్ సమస్య తీరినట్లు అవుతుంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇంద్రకీలాద్రి వద్ద ప్లైఓవర్, అలానే వరద ప్రభావి ప్రాంతాల వారికి వాల్ నిర్మాణం, అలానే నగరంలోని అనేక అభివృద్ది పనులను సీఎం జగన్ చేసి చూపించారు. ఇప్పటికే విజయవాడలో అనేక అభివృద్ధి పనులు చేసిన సీఎం జగన్.. తాజాగా మరో విషయంలో తనదైన ప్రత్యేకతను చాటుచుకున్నారు. అభివృద్ధి ఎక్కడా అనే వారికి.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు ఇక్కడా అనేలా విజయవాడ నగరాన్నిచూపిస్తున్నారు స్థానిక ప్రజలు. విజయవాడ పశ్చిమ జాతీయ రహదారికి బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తైంది.
త్వరలోనే చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. గతంలో ఈ బైస్ నిర్మాణానికి సీఎం జగన్ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ ఖర్చుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను కూడా ఎన్ హెచ్ఏఐ సూత్రప్రాయంగా ఆమోదించడంతో అన్ని అడ్డంకులు తొలగడంతో పాటు నిర్మాణం పూర్తైంది. దాదాపు రూ.2 వేల కోట్లతో 60 కిలోమీటర్ల మేర విజయవాడ బైపాస్ మార్గం రూపుదిద్దుకుంది. 2021 లో ప్రారంభించిన 60 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణ పనులు దాదాపు పూర్తైంది. భూ సేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50శాతం భరించింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే విజయవాడ నగరానికి శాశ్వత ప్రాతిపదికన ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ఇక చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (NH–16) విజయవాడ నగరంలో నుంచి వెళ్తున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. గత ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యకు తక్షణ పరిష్కారం గురించి ఆలోచించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు తక్షణ పరిష్కారంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అనుకున్నట్లుగానే బైపాల్ నిర్మాణం గురించి కేంద్రంతో సంప్రదింపులు జరిపి..చివరకు పూర్తి చేశారు. కొన్ని వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండానే జాతీయ రహదారిపై బైపాస్ మీదుగా అటు చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌ల వైపు వెళ్లవచ్చు. విజయవాడలో సీఎం జగన్ చేసిన అభివృద్ధికి ఇది ఓ నిదర్శనం. అలానే రాష్ట్రం మొత్తం సీఎం జగన్ విజయవాడ మాదిరిగానే అభివృద్ధి చేశారు. తాము ముప్పైళ్లుగా పడుతున్ననరకాన్ని సీఎం జగన్ 3 ఏళ్లల్లోనే తీర్చేశారని నగరవాసులు చెబుతున్నారు.