Dharani
పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీని ముందు వరుసలో ఉంచుతున్నారు సీఎం జగన్. ఇక తాజాగా ఏపీ సర్కార్ మరో ఘనత సాధించింది. ఆ వివరాలు..
పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీని ముందు వరుసలో ఉంచుతున్నారు సీఎం జగన్. ఇక తాజాగా ఏపీ సర్కార్ మరో ఘనత సాధించింది. ఆ వివరాలు..
Dharani
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించినప్పుడే నిజమైన డెవల్పమెంట్ అని భావించిన సీఎం జగన్.. వారిని ఆర్థికంగా ఆదుకోవడం కోసం నవర్నతాల పేరుతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. పథకాల అమలులో ఎక్కడా ఎలాంటి అవినీతికి తావులేకుండా.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు.
అలానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేక రకాల చర్యలు తీసుకున్నారు సీఎం జగన్. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడం కోసం.. భారీ ఎత్తున రాయితీలు కల్పిస్తూ.. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు జారీ చేస్తూ.. ఏపీని పెట్టుబడలకు అనుకూలమైన రాష్ట్రంగా మార్చారు. జగన్ చర్యల కారణంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ముందు వరుసలో ఉంటుంది. కానీ విపక్షాలు మాత్రం వైసీపీ సర్కారు చేస్తోన్న అభివృద్ధిని పట్టించుకోకుండా.. కేవలం సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని అసత్య ప్రచారానికి దిగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసుకుంటూ.. జగన్ పాలనలో అవి శూన్యం అన్నట్లు అసత్య ప్రచారానికి తెర లేపాయి.
ఈ అసత్య ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టింది. చంద్రబాబు పాలనలో కన్నా జగన్ హయాంలోనే ఏపీలోకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని ప్రకటించింది. 2014–18 క్యాలండర్ ఇయర్ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాస్తవ రూపంలోకి వచ్చి ఉత్పత్తిని ప్రారంభించిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.32,803 కోట్లు మాత్రమే. కానీ జగన్ హయాంలో రూ.1,00,103 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయయని స్వయంగా కేంద్రమే ప్రకటించింది. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు పూర్తై ఏడాది కాకుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. జీఐఎస్‌లో మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమల పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఇక తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ మరో ఘనత దక్కించుకుంది. ఏసీ హాబ్ గా అవతరించి.. కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా నిలిచింది ఏపీ. వైసీపీ అధికారంలోకి వచ్చాక బ్లూ స్టార్, డైకిన్, అంబర్, ఈప్యాక్ డ్యూరబుల్, హావెల్స్, ఐఏపీఎల్ గ్రూప్ వంటి ఏసీ తయారీ కంపెనీలు ఏపీలోని శ్రీ సిటీలో తమ ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పాయి. ఇప్పటికే ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం అయ్యింది. ఇక 2027 నాటికి దేశంలో తయారయ్యే ఏసీల్లో 50 శాతం ఏపీలోనే ఉత్పత్తి కాబోతున్నాయి. అయితే ఈ పరిశ్రమలు, పారిశ్రామిక పెట్టుబడుల గురించి జగన్ సర్కార్ ఏనాడు ఆర్భాటంగా ప్రచారం చేసుకోలేదు. ఆయనకు కావాల్సింది ప్రచారం కాదు.. ఫలితం. దాని వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగే ఉపాధి మాత్రమే. అందుకే మౌనంగా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. వైసీపీ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదనే వారు.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాయి వైసీపీ శ్రేణులు.