Arjun Suravaram
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. అలానే వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఏళ్ల తరబడి పడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. అలానే వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఏళ్ల తరబడి పడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన పాలనతో ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్ ప్రవేశ పెట్టారు. అంతేకాక తాను 2019కి ముందుకు పాదయాత్ర సమయంలో ప్రజలు పడుతున్న ఎన్నో సమస్యలను చూశారు. అలానే నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించారు. ఆ విధంగానే అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగారు సీఎం జగన్. అలాంటి వాటిల్లో ఉద్దానం సమస్య. దశాబ్దాల సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపించి.. అక్కడి ప్రజల కళ్లలో సంతోషం నింపారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతం పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది కిడ్నీ బాధితులు. రాష్ట్రంలో ఎక్కడ లేనంతగా ఇక్కడ అత్యధిక సంఖ్యలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఉద్దానం అనగా ఉద్యానవనం. పేరుకి తగిటన్లు ఆ ప్రాంతంమంతా ఉద్యావనం గానే ఉంటుంది. కానీ ఇక్కడి ప్రజల్లో ఎక్కువ మంది కిడ్నీ సమస్యలతో అల్లాడిపోతున్నారు. చికిత్స కోసం భారీగానే డబ్బులు ఖర్చు పెట్టి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారిన వారి సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం తాగునీటి ఏర్పాటు, కిడ్నీ బాధితుల కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేసి వారి సమస్యకు పరిష్కారం చూపించారు. సీఎం జగన్ పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో కిడ్నీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌తో పాటు ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ నిర్మించారు.
అత్యున్నత ప్రమాణాలతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది జగన్ సర్కార్. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు చేశారు. ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందిస్తోంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం 6 లక్షలకుపైగా జనాభా ఉండగా అవసరాలకు సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈ విధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో తాను ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ ప్రజల మనస్సును గెల్చుకున్నారు.