Arjun Suravaram
Bhogapuram International Airport: గతంలో అభివృద్ధిని కేవలం గ్రాఫిక్స్ లో చూపించిన నేతలు ఉన్నారు. కానీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం అభివృద్ధిని ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో చూపించారు. అందుకు నిదర్శనమే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం.
Bhogapuram International Airport: గతంలో అభివృద్ధిని కేవలం గ్రాఫిక్స్ లో చూపించిన నేతలు ఉన్నారు. కానీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం అభివృద్ధిని ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో చూపించారు. అందుకు నిదర్శనమే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం.
Arjun Suravaram
ఉత్తరాంధ్రకు చుక్కాని అయినా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు జెడ్ స్పీడ్ లో జరుగుతున్నాయి. 2023 మే 3న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అంతేకాక నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు రూ. 5000 కోట్లతో దీనిని అభివృద్ధి చేయనున్నారు. 2025 నాటికి ఈ భోగాపురం ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకవచ్చేలా పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తైతే.. ఏటా 60 లక్షల మంది ప్రయాణించేలా తొలిదశ పనులను పూర్తి చేయాలని సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే ఈ ఎయిర్ పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం 2203 ఎకరాలను కేటాయించింది. నిర్వాసితుల పునరావాసం, పరిహార సమస్యలను జగన్ సర్కార్ సంపూరణంగా పరిష్కరించింది. దీంతో నిర్మాణ సంస్థ.. ఎయిర్ పోర్టు పనులను పూర్తి స్థాయిలో మొదలు పెట్టింది. ఎయిర్ పోర్టు చుట్టు పటిష్టమైన స్తంభాలను నిర్మించిది. ఆ స్తంబాలపై దాదాపు 10 అడుగల ఎత్తు వరకు ప్రహరి గోడ నిర్మాణం జరుగుతోంది. ఎయిర్ పోర్ట్ చుట్టూ సుమారు 23 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన ఈ ప్రహరీగోడలో ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యింది. ఇదే కీలకమైన రన్ వే నిర్మాణ పనులను కూడా జరుగుతున్నాయి. భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున ఈ రన్ వే నిర్మాణం జరగనుంది.
విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేలా అనుసంధాన రోడ్డును నిర్మిస్తున్నారు. దీని కోసం 25 ఎకరాల భూసేకరణ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ.18 కోట్లు పరిహారం చెల్లించింది. అలానే ఎయిర్ పోర్టులో వివిధ హోదాల్లో పని చేసే అధికారుల కోసం ప్రత్యేకంగా స్టాఫ్ క్వార్టర్లను జీఎంఆర్ సంస్థ నిర్మించనుంది. ఆ సంస్థ వినతి మేరకు ఏపీ ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో 20 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూమి అంతా నిర్మాణ సంస్థకు అప్పగించారు. ఈ నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులన్నింటిలో జగన్ ప్రభుత్వం విజయం సాధించింది.
4 గ్రామాల నిర్వాసితులకు దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస కాలనీలను నిర్మించారు. అంతేకాక వారికి మౌలిక వసతులు కల్పించారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టు టర్మినల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభిస్తే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడంతో పాటు ప్రభుత్వానికి కూడా పెద్దఎత్తున ఆదాయం రానుంది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభిస్తే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడంతో పాటు ప్రభుత్వానికి కూడా పెద్దఎత్తున ఆదాయం రానుంది. దీంతో అందరి దృష్టి విమానాశ్రయ నిర్మాణం పైనే పడింది. మొత్తంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్న చిత్తశుద్దికి భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం ప్రత్యక్ష నిదర్శనం.