iDreamPost
android-app
ios-app

రామోజీకి షాక్.. సుప్రీం కోర్టులో యూరీ రెడ్డి పిటిషన్!

మార్గదర్శి విషయంలో రామోజీరావుపై జి యూరీ రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఫిర్యాదులతో పాటు అనేక ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రామోజీ రావుకు షాక్ తగిలింది. మార్గదర్శి అంశంపై యూరీరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీ రావుపై జీజే రెడ్డిగా పేరుగాంచిన గాదిరెడ్డి జగన్నాధ రెడ్డి కుమారుడు జి. యూరి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రామోజీ రావు తుపాకీతో బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకం చేయమని బలవంతం చేసి..మార్గదర్శి గ్రూప్‌లో తన కుటుంబానికి హక్కుగా వాటాలు లేకుండా చేశారని యూరీ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ ఇష్యూపై గత కొంతాకాలంగా అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే యూరీ రెడ్డి రామోజీరావు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై పోలీసులుకు ఫిర్యాదు చేయడం కోర్టులను ఆశ్రయిచడం చేశారు.

యూరీ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఏపీ సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే  తాజాగా మార్గదర్శి విషయంలో రామోజీరావుకు షాక్ తగిలింది. యూరిరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  మార్గదర్శి విషయమై రామోజీరావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ ను యూరీ రెడ్డి దాఖలు చేశారు. మార్గదర్శిలో తన షేర్లను బలవంతంగా బదలాయింపు చేశారని యూరీ సీఐడీకీ చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రామోజీ రావు తనను తుపాకీతో బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని యూరీ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలోనే యూరి రెడ్డి ఏకంగా సుప్రింకోర్టునే ఆశ్రయించారు. మరి.. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.