Dharani
వైెఎస్ షర్మిల నేడు తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మరీ వీరి భేటీకి కారణం ఏంటంటే..
వైెఎస్ షర్మిల నేడు తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మరీ వీరి భేటీకి కారణం ఏంటంటే..
Dharani
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. నేడు జరగనున్న ఓ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ఆ భేటీ ఏంటి అంటే.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేడు కలవనున్నారు. తన తల్లి విజయమ్మతో కలిసి తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి షర్మిల రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయకు వచ్చిన వైఎస్ షర్మిల.. నేడు అనగా జనవరి 3, బుధవారం మధ్యాహ్నం తాడేపల్లికి రానున్నట్లు తెలుస్తోంది. ప్రసుత్తం వీరిద్దరి భేటీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాక షర్మిల తన వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడం.. అందుకోసం ఢిల్లీ బయల్దేరి వెళ్లడానికి ముందు.. వీరి భేటీ జరగడం ఆసక్తికరంగా మారింది.
అయితే, వైఎస్ షర్మిల, సీఎం జగన్ భేటీకి రాజకీయాలతో సంబంధంలేదని వార్తలు వస్తున్నాయి. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లికి ముహుర్తం పెట్టిన సంగతి తెలిసిందే. రాజారెడ్డి తను ప్రేమించిన ప్రియా అట్లూరి అనే యువతిని వివాహం చేసుకోబోతున్నారు. జనవరి 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న వివాహం జరగనున్నాయి. ఈ మేరకు షర్మిల తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కుమారుడు రాజా రెడ్డి వివాహానికి.. తన సోదరుడు జగన్, వదిన భారతిని స్వయంగా ఆహ్వానించేందుకు వైఎస్ షర్మిల.. తాడేపల్లికి రానున్నట్లు సమాచారం. ప్రియా అట్లూరి.. అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త కుమార్తె. రాజారెడ్డి, ఈమె నాలుగేళ్ల నుంచి లవ్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే షర్మిల తన కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియాతో కలిసి మంగళవారం (జనవరి 2) ఇడుపులపాయకు వచ్చారు. వైఎస్సార్ సమాధి వద్ద కుమారుడి వివాహ మొదటి పత్రికను ఉంచి, ప్రార్థనలు చేశారు. కాబోయే వధూవరులు ఇద్దరూ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదాలు తీసుకున్నట్లు తెలిపారు షర్మిల. రాత్రి అక్కడే బస చేసిన షర్మిల బుధవారం మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి నేరుగా తాడేపల్లికి రానున్నట్లు సమాచారం. షర్మిలతో పాటు కుటుంబసభ్యులు కూడా రానున్నట్లు తెలుస్తోంది. అన్నా వదినలైన వైఎస్ జగన్, భారతి దంపతులకు.. తన కుమారుడి వివాహ పత్రికను అందజేసిన తర్వాత.. షర్మిల అటు నుంచి అటే.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నట్లు సమాచారం.
ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని ఇప్పటికే షర్మిల వెల్లడించారు. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుమని తెలిపారు. జనవరి 4న ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర నేతల సమక్ష్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఏపీ కాంగ్రెస్‌లో షర్మిలకు కీలక బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయంలో షర్మిల కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచారం చేశారు.
ఏపీ ఎన్నికల తర్వాత.. ఆమె తెలంగాణలో వైఎస్సార్టీపీ అంటూ ప్రత్యేక పార్టీ పెట్టి.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయితే తాజా ఎన్నికల సందర్భంగా ఆమె పార్టీ పోటీ నుంచి తప్పుకున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో.. ఆమె పోటీ నుంచి తప్పుకుని.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.