Arjun Suravaram
YSRCP: త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటికే అనేక సర్వేలు వచ్చాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ సర్వేల్లో స్పష్టంగా తెేలింది. తాజాగా మరో సంస్థ నిర్వహించిన సర్వేలో వైసీపీకి ప్రజలు పట్టం కట్టినట్లు స్పష్టమవుతుంది. మరి.. ఆ వివరాల్లోకి వెళ్తే..
YSRCP: త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటికే అనేక సర్వేలు వచ్చాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ సర్వేల్లో స్పష్టంగా తెేలింది. తాజాగా మరో సంస్థ నిర్వహించిన సర్వేలో వైసీపీకి ప్రజలు పట్టం కట్టినట్లు స్పష్టమవుతుంది. మరి.. ఆ వివరాల్లోకి వెళ్తే..
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫీవర్ ప్రారంభమైంది. మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎలక్షన్‌లకు సమయం దగ్గర పడుతుండటంతో.. అన్ని పార్టీలు స్పీడు పెంచాయి. అధికార వైఎస్సార్‌సీపీ.. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల్లోను ప్రకటించే పనిలో వైసీపీ అధిష్టానం పడింది. చాలా స్థానాల్లో వైసీపీ మార్పులు చేర్పులు చేస్తూ ప్రత్యర్థి పార్టీలకు చుక్కల చూపిస్తుంది. ఇదే సమయంలో టీడీపీ.. వైసీపీని ఓడించి.. అధికారం హస్తగతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక జనసేన సైతం రానున్న ఎన్నికల కోసం దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఏపీకి సంబంధించి ఓ సర్వే వివరాలు బయటకు వచ్చాయి. అందులో భారీ మెజార్టీలో సీఎం జగన్ కే మరోసారి ప్రజలు అధికారం ఇస్తారని తేలింది.
రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒక్కటి ఒకవైపు.. మిగతా పార్టీలన్ని ఒకవైపుగా పోటీ సాగనుందని స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది.. ఎంత శాతం ఓట్లు రాబడుతుంది.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాల మీద ప్రముఖ సర్వే సంస్థ పొలిటికల్ క్రిటిక్ సర్వే అండ్ ఎనాలసిస్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వైసీపీ వస్తుందని ఈ సర్వే తేల్చింది. మంగళవారం సాయంత్ర ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది.
ఇక ఈ సర్వే సంస్థ వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం తేలింది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే.. వైసీపీ 48 శాతం మేర ఓట్లు రాబట్టి.. మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థ తేల్చింది. దీని ప్రకారం..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని స్పష్టమవుతుంది. అలానే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనతో కూటమికి 44 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలుస్తుందని ఈ సర్వే సంస్థ అభిప్రాయపడింది. ఇక బీజేపీ కి 1.5 శాతం, కాంగ్రెస్ 1.5శాతం, ఇతర స్వతంత్ర అభ్యర్థులు 5 శాతం ఓట్లు సాధిస్తారని అంచనా వేసింది.
అలానే పొలిటికల్ క్రిటిక్ సర్వే అండ్ ఎనాలసిస్ నిర్వహించిన సర్వే ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ సీట్లు గెలుచుకుంటుందో కూడా ఇప్పుడు చూద్దాం. వైఎస్సార్ సీపీ 115 +/-5 , అలానే టీడీపీ జనసేన కూటమికి 60+/-5 స్థానాలు గెల్చుకుంటాయని పేర్కొంది. అలానే బీజేపీ, కాంగ్రెస్ లకు ఒక్కస్థానం కూడా రాదని ఈ సర్వే తేల్చింది. మొత్తంగా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. ఈ ప్రీపోల్ సర్వే.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి.. తాజాగా వెల్లడైన ఈ సర్వేపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Andhrapradesh assembly seats survey results.
If the elections are held right now.
YSRCP: 115+/-5
TDP+JSP: 60+/-5
BJP: 00
Congress: 00Expected vote share for assembly elections
YSRCP: 48%
TDP+JSP: 44%
BJP: 1.5%
CONGRESS: 1.5%
OTHERS: 5% #AndhraPradeshElection2024 pic.twitter.com/2P9fMMmCbd— Political Critic (@PCSurveysIndia) January 22, 2024