iDreamPost
android-app
ios-app

సూపర్ హిట్టైన ‘సిద్ధం’ సభ.. మరోసారి YSRCP మ్యాజిక్ రిపీట్?

YSRCP: మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక శనివారం వైసీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభను చూస్తే.. మాత్రం మరోసారి వైసీపీ మ్యాజిక్ రీపిట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

YSRCP: మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక శనివారం వైసీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభను చూస్తే.. మాత్రం మరోసారి వైసీపీ మ్యాజిక్ రీపిట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సూపర్ హిట్టైన ‘సిద్ధం’ సభ.. మరోసారి YSRCP మ్యాజిక్ రిపీట్?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మర్చిపోలేనివి. ఆ ఎలక్షన్లలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఇక వైఎస్సార్ సీపీ సృష్టించిన ప్రభజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019 ఏపీ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి ధాటికి ప్రతిపక్షాలు ఎగిరిపోయాయి. ఇక ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అయితే ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర చరిత్రలోనే గుర్తుండిపోయేలా 151 స్థానాల్లో విజయం సాధించింది. 2024లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వైఎస్సార్ సీపీ మ్యాజిక్ రిపీట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భీమిలిలో నిర్వహించిన సిద్ధం సభే ఈ అభిప్రాయాలకు కారణం.

2019లో వైసీపీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలు సాధించగా, టీడీపీకి 23 స్థానాలకే పరిమితం అయింది. అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. సీఎం జగన్ తనదైన పాలనతో ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఐదేళ్ల పాలన పూర్తి చేసుకుని 2024లో మరోసారి ఎన్నికలకు సిద్దమయ్యారు. ఈసారి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే శనివారం సిద్ధం పేరుతో ఎన్నికల శంఖరావాన్ని సీఎం జగన్ పూరించారు.

భీమిలిలో సిద్ధం పేరుతో వైఎస్సార్ సీపీ సభను నిర్వహించింది. ఈ సభకు కనీవినీ ఎరుగుని రీతిలో జనం హాజరయ్యారు. దాంతో ఈ సభను చూసిన విపక్షాలు ఎంత మంది జనాలు వచ్చి ఉంటారు అన్న లెక్కల్లో మునిగితేలుతున్నారు. ఇక ఈ సభకు మూడు లక్షలకు పైగా జనాలు వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సభలో జన సముద్రాన్ని తట్టుకోవడానికి ఈ సభా స్థలి సరిపోవడం లేదని, దీనికి పదింతలు కావాలని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇక ఈ సభ భారీ సక్సెస్ కావడంతో వైసీపీ కార్యకర్తలల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక జగన్  కూడ తన స్పీచ్ తో క్యాడర్ కి ఇవ్వాల్సిన హుషార్ ఇచ్చారు.

భీమిలీ సభ ద్వారా వైసీపీని మళ్లీ ఎలా గెలిపించాలన్నది కార్యకర్తలకు, నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. దీంతో ఇప్పటిదాకా కాస్తా స్తబ్దుగా ఉన్న క్యాడర్ లో కొత్త ఉత్సాహం వచ్చింది.  ఈ స్పీడ్ తో 2019లో మాదిరిగానే పని చేస్తే.. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయ పడుతున్నారు. ఉత్తరాంధ్రాల్లో రూరల్ బెల్ట్ అంతా వైసీపీకి గట్టి సపోర్టుగా ఉంటోందని చెబుతున్నారు. ఇలానే మిగిలిన ప్రాంతాల్లో కూడా వైసీపీ గట్టి మద్దతు ఉంది. శనివారం జరిగిన సభను చూసి.. ప్రత్యర్థి పార్టీల్లో వణుకు మొదలైందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే సమయంలో 2024లో మరోసారి వైసీపీ మ్యాజిక్ రిపీట్ అవుతుందని చాలా మంది అభిప్రాయా పడుతన్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.