ఆ ఇద్దరి నాయకుల హగ్ తో ఎల్లో బ్యాచ్‌కి చెక్!

Vellampalli, Malladi Hug: ఇటీవల వైసీపీ కొత్త అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ ఒకటి. ఆ నియోజకవర్గంలో వైసీపీపై, అక్కడి నేతలపై ఎల్లో బ్యాచ్ అసత్య ప్రచారాలు చేసింది. ఈ నేపథ్యంలో వారికి చెక్ పెట్టేలా ఆ ఇద్దరు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

Vellampalli, Malladi Hug: ఇటీవల వైసీపీ కొత్త అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ ఒకటి. ఆ నియోజకవర్గంలో వైసీపీపై, అక్కడి నేతలపై ఎల్లో బ్యాచ్ అసత్య ప్రచారాలు చేసింది. ఈ నేపథ్యంలో వారికి చెక్ పెట్టేలా ఆ ఇద్దరు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు  చాలా వాడీవేడీగా ఉన్నాయి. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ ఎన్నికల రంగంలోకి దూకేసింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను, ఇతర ప్రణాళిలను వైసీపీ సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు అభ్యర్థులను మార్చడం, కొత్తవారిని తీసుకురావడం వంటివి వైసీపీ అధినేత చేశారు. ఈక్రమంలో టికెట్ దక్కని కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులు చక్కబడతాయని వైసీపీ నేతలు ముందు నుంచే చెబుతున్నారు. కానీ ఎల్లో మీడియాకు, టీడీపీ నేతలకు ఆత్రం ఎక్కువని చిన్న అలకలను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని వైసీపీ అంటుంది. మాటలే నిజం చేస్తూ  తాజాగా ఓ ఇద్దరు నేతలు హగ్ ఇచ్చుకుని ఆ ఎల్లో బ్యాచ్ నోర్లు మూయించారు.

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి 68 స్థానాల్లో అభ్యర్థులను మార్చిన సంగతి తెలిసిందే. అలాంటి స్థానాల్లో విజయవాడ సెంట్రల్ ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుకు కాకుండా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను ఇన్ ఛార్జీగా నియమించారు. ఈ నేపథ్యంలోనే మల్లాది విష్ణుకు కాస్తా మౌనంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీన్నే టీడీపీ నేతలు, ఎల్లో మీడియా భూతద్ధంలో పెట్టి చూపించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే  ఈ రోజు విజయవాడ సెంట్రల్ పరిణామాలు.. ఆ బ్యాచ్ నోరుళ్లు  మూయించాయి.

మంగళవారం విజయవాడలో జరిగిన వైఎస్సార్ సీపీ పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ నుంచి తొలి గెలుపు విజయవాడ సెంట్రల్‌దే కావాలని.. వెల్లంపల్లి శ్రీనివాస్‌ను గెలిపించాలంటూ ఆయన పిలుపు ఇచ్చారు. అంతేకాక ఆ ఇద్దరు నేతలు హాగ్ చేసుకున్నారు. దీంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వైసీపీలో జోక్ పెరిగింది. టీడీపీ అనుకూల మీడియా చానెల్స్‌, ఎల్లో పేపర్లు చాలారోజుల నుంచి వీళ్ల మధ్య ఏదో వైరం నడుస్తున్నట్లు చూపించే యత్నం చేశాయి. ఒక అడుగు ముందుకేసి ఆయన పార్టీని కూడా వీడుతారంటూ అసత్య కథనాలు కూడా రంగరించి రాశాయి. అయితే ఆ రోతరాతలకు వారిద్దరి హగ్‌తో చెక్‌ పడింది.

గురువారం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని సింగ్ నగర్ లో వైసీపీ ఇంఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్‌ నూతన ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీగా తన ఆఫీస్‌ నుంచి మల్లాది.. వెల్లంపల్లి ఆఫీస్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మల్లాదికి వెల్లంపల్లి ఆత్మీయ స్వాగతం పలికారు. అంతేకాదు.. ఈ ఇద్దరు నేతలు ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. దీంతో విజయవాడ సెంట్రల్  వైఎస్సార్‌సీపీ నేతలు,కార్యకర్తలు సంబరాలు చేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని.. పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు.  కలిసిగట్టుగా పని చేయడం ద్వారా ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని ఈ ఇద్దరు నేతలు ప్రకటించారు. మరి..  ఈ అపూర్వ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments