iDreamPost
android-app
ios-app

YSRCP 12వ జాబితా విడుదల.. గాజువాక ఇన్ చార్జిగా గుడివాడ అమర్ నాథ్

  • Published Mar 12, 2024 | 10:16 PM Updated Updated Mar 12, 2024 | 10:16 PM

YSRCP 12th List: ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ వ్యూహాలు రచిస్తుంది. పార్టీ కేడర్ లో పలు మార్పులు చేస్తూ.. విడతల వారిగా జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా 12వ జాబితాను వైఎస్సార్ సీపీ విడుదల చేసింది.

YSRCP 12th List: ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ వ్యూహాలు రచిస్తుంది. పార్టీ కేడర్ లో పలు మార్పులు చేస్తూ.. విడతల వారిగా జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా 12వ జాబితాను వైఎస్సార్ సీపీ విడుదల చేసింది.

  • Published Mar 12, 2024 | 10:16 PMUpdated Mar 12, 2024 | 10:16 PM
YSRCP 12వ జాబితా విడుదల.. గాజువాక ఇన్ చార్జిగా గుడివాడ అమర్ నాథ్

ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల గురించి టాక్ వినిపిస్తుంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపు తమ ఖాతాలో వేసుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్తూ మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికార పార్టీ గెలుపును ఆపేంతుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. జరగబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ఒంటరిగా వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తున్నారు. తాజాగా మరో జాబితా రిలీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు ఏపీలో తాము చేసిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో పలు మార్పులు చేర్పులు చేస్తున్న విషయం తెలిసిందే.  దీనికి సంబంధించిన పలు జాబితాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 11 జాబితాలు విడుదల చేయగా.. తాజాగా 12వ జాబితా రిలీజ్ చేశారు.

రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను ప్రకటిస్తూ.. మంగళవారం సాయంత్రం అధిష్టానం ఒక ప్రకటన చేసింది. చిలకలూరి పేట (అసెంబ్లీ) సమన్వయ కర్తగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక (అసెంబ్లీ) సమన్వయ కర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ను పార్టీ అధిష్టానం నియమించింది. ఏపీ సీఎం, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వీరిని ఎంపిక చేశారు. కర్నూల్ మేయర్ గా సత్యనారాయణమ్మను ఎంపిక చేయగా, బీవీ రామయ్యను కర్నూల్ పార్లమెంట్ ఇన్ చార్జ్ గా ప్రకటించారు.