iDreamPost
android-app
ios-app

YSR అవార్డులు..7రంగాల్లో ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం!

ఎంతో ప్రతిష్టాత్మకమైన వైఎస్సార్ అవార్డులను ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాదీ ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన, ప్రముఖలైన 27 మంది వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డులను అందించనున్నారు

ఎంతో ప్రతిష్టాత్మకమైన వైఎస్సార్ అవార్డులను ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాదీ ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన, ప్రముఖలైన 27 మంది వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డులను అందించనున్నారు

YSR అవార్డులు..7రంగాల్లో ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం!

ఎంతో ప్రతిష్టాత్మకమైన వైఎస్సార్ అవార్డులను ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాదీ ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన, ప్రముఖలైన 27 మంది వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డులను అందించనున్నారు. మొత్తం ఏడు రంగాల్లో వైఎస్సాఆర్ పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయం, కళలు- సంస్కృతి, తెలుగు భాషా- సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజ సేవ వంటి  ఏడు విభాగాల్లో వైఎస్సాఆర్ అవార్డులను ప్రకటించారు. 23 వైఎస్సార్ జీవిత సాఫల్య, 4 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను  రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రభుత్వ సలహాదారులు జీవీడి కృష్ణమోహన్ మీడియాకు ఈ అవార్డు గ్రహీతల వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. ఉన్నత సంకల్పంతో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి వచ్చిన ప్రతిపాదనలను ప్రత్యేక కమిటీ వివిధ దశల్లో క్షుణ్ణంగా పరిశీలీంచి  ఎంతో పారదర్శకంగా  అవార్డులకు ఎంపిక చేసిందన్నారు. సమాజంపై తమదైన ముద్ర వేసిన వారిని సముచితంగా గౌరవించేలా సీఎం జగన్ ఆమోదంతో అవార్డులను ప్రకటించిన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 1న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

అవార్డు గ్రహీతల వివరాలు:

 వ్యవసాయం:

పంగి వినీత– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు), వై.వి.మల్లారెడ్డి– అనంతపురం

ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌:

యడ్ల గోపాలరావు–రంగస్థల కళాకారుడు(శ్రీకాకుళం), తలిసెట్టి మోహన్‌–కలంకారీ(తిరుపతి), కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ(బాపట్ల), కోన సన్యాసి– తప్పెటగుళ్ళు(శ్రీకాకుళం జిల్లా), ఉప్పాడ హ్యాండ్‌ లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(కాకినాడ), ఎస్‌.వి.రామారావు– చిత్రకారుడు(కృష్ణా జిల్లా), మతి రావు బాల సరస్వతి– నేపథ్య గాయని (నెల్లూరు), తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత(ప్రకాశం జిల్లా), చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు(అనంతపురం), కలీసాహెబీ మహబూబ్‌– షేక్‌ మహబూబ్‌ సుబానీ దంపతులకు నాదస్వరం (ప్రకాశం జిల్లా)

తెలుగు భాష- సాహిత్యం రంగంలో:

ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మం(పశ్చిమ గోదావరి), ఖదీర్‌ బాబు– నెల్లూరు (ఎచీవ్‌మెంట్‌ అవార్డు) మహెజబీన్‌ (ఎచీవ్‌మెంట్‌ అవార్డు) నెల్లూరు, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు(చిత్తూరు),అట్టాడ అప్పలనాయుడు (శ్రీకాకుళం)

క్రీడలు రంగం:

పుల్లెల గోపీచంద్‌(గుంటూరు), కరణం మల్లీశ్వరి(శ్రీకాకుళం0

వైద్యం:

ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం(ఎన్టీఆర్‌ జిల్లా),ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్‌టీ(వైఎస్సార్‌ జిల్లా)

మీడియా రంగంలో:

గోవిందరాజు చక్రధర్‌(కృష్ణా జిల్లా), హెచ్ ఆర్కే (కర్నూలు)

సమాజ సేవ:

బెజవాడ విల్సన్‌ (ఎన్టీఆర్‌  జిల్లా), శ్యాం మోహన్‌ (ఎచీవ్‌మెంట్‌) అంబేద్కర్‌ కోనసీమ జిల్లా, నిర్మల హృదయ్‌ భవన్‌ (ఎన్టీఆర్‌ జిల్లా), జి. సమరం(ఎన్టీఆర్‌ జిల్లా)

మొత్తం ఏడు రంగాల్లో 27 మందికి వైఎస్సార్ అవార్డులను ప్రకటించారు. నవంబర్ 1 తేదీన ఈ అవార్డునలు గ్రహీతలకు ప్రదానం చేయనున్నారు. మరి.. వైఎస్సార్ అవార్డు గ్రహితలకు మీ కంగ్రాట్స్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి