iDreamPost
android-app
ios-app

YS Viveka: వీడియో: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. వెలుగులోకి రెండో భార్యతో ఉన్న వీడియో!

  • Published Apr 18, 2024 | 12:28 PM Updated Updated Apr 18, 2024 | 12:28 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ హత్య చుట్టు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా వివేక హత్య కేసు విషయంలో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ హత్య చుట్టు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా వివేక హత్య కేసు విషయంలో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది.

  • Published Apr 18, 2024 | 12:28 PMUpdated Apr 18, 2024 | 12:28 PM
YS Viveka: వీడియో: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. వెలుగులోకి రెండో భార్యతో  ఉన్న వీడియో!

ప్రస్తుతం ఏపీలో రాజకీయం పలు ప్రధాన అంశాల చుట్టూ తిరుగుతోంది. అలాంటి వాటిల్లో మాజీ మంత్రి వైఎస్  వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన అంశం ఒకటి. దీనిపై ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, టీడీపీలు అధికార పార్టీ వైఎస్సార్ సీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయి. వీరికి మద్దతుగా వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా ఏకంగా వైఎస్సార్ సీపీపై ఆరోపణలు చేస్తుంది. 2019లో వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. అనంతరం వివేకానందరెడ్డి హత్య చుట్టూ అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ సంచలన వీడియో బయటకు వచ్చింది. రెండో భార్య, కొడుకుతో వివేకానందరెడ్డి ఉన్న వీడియో బయటకు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వివేకానందరెడ్డి చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణను కోర్టు పరిధిలో ఉంది. అలానే వివేక కుమార్తె సునీత తరచూ వైఎస్ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కూడా సునీత మాటలను  ఖండిస్తూ కీలక అంశాలను మీడియ ముందు ప్రస్తావించారు. ఇక ఈ విషయాలు అన్ని పక్కన పెడితే.. వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రెండో భార్య, కొడుకుతో వివేక ఉన్న వీడియో  వైరల్ అవుతోంది.  ఈ దృశ్యాల్లో రెండో భార్య షమీన్, కుమారుడు షహాన్ తో  వివేకానంద  ఉన్నారు. తన కొడుకుతో ఆయన ఇంట్లో సరదగా ఆడుకుంటున్నారు.

వివేకాతో తనకు 2010లో వివాహం అయ్యిందని షమీమ్ గతంలో సీబీఐ అధికారులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొంది. అలానే ఆ సమయంలో వివేక రెండో భార్య షమీమ్ మరికొన్ని కీలక అంశాలను సీబీఐ అధికారుల ముందు వెల్లడించారు. తాను, వివేక 2010లో పెళ్లి చేసుకున్నా..2011లో మరోసారి వివాహం చేసుకున్నట్లు వివరించారు. 2015లో తమకు షహన్షాన్ పుట్టినట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్ లో తాము నివాసం ఉంటున్నామని ఆమె తెలిపింది. అలానే తమ కుమారుడిని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో జాయిన్ చేస్తాని వివేకా చెప్పేవాడని ఆమె తెలిపింది. వివేకా హత్యకు కొన్ని గంటల ముందు కూడా తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆమె పేర్కొన్నారు.

తమ వివాహం వివేకా కుమార్తె సునీత, భార్య సౌభాగ్యమ్మ, ఇతర కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని ఆమె తెలిపారు. వివేకా బావమరిది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తనను, తన చాలాసార్లు బెదిరించారని షమీమ్ వివరించారు. వివేకాకు దూరంగా ఉండమని సునీతా రెడ్డి సైతం హెచ్చరించేదని సీబీఐ విచారణలో షమీమ్ వెల్లడించారు. అయితే ఇక్కడ షమీమ్ ఎవరో తమకు తెలియదని సునీత చెప్పడం చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తంగా వివేక హత్య కేసులో ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రెండో భార్య, కుమారుడితో ఆయన ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom