Dharani
Raja Reddy-Priya Atluri: తన కుమారుడు పెళ్లి తేదీ గురించి అధికారిక ప్రకటన చేశారు వైఎస్ షర్మిల. ఇన్ స్టాగ్రామ్ వేదికగా వివరాలు పోస్ట్ చేశారు. ఆ వివరాలు.
Raja Reddy-Priya Atluri: తన కుమారుడు పెళ్లి తేదీ గురించి అధికారిక ప్రకటన చేశారు వైఎస్ షర్మిల. ఇన్ స్టాగ్రామ్ వేదికగా వివరాలు పోస్ట్ చేశారు. ఆ వివరాలు.
Dharani
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కుమారుడు రాజా రెడ్డి పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారు పెద్దలు. ఈ విషయాన్ని షర్మిల సోషల్ మీడియా వేదికగా ప్రకటిచండంతో.. వీరి పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చేసినట్లయ్యింది. షర్మిలలానే ఆమె కుమారుడు రాజా రెడ్డిది కూడా ప్రేమ వివాహం. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లిన రాజా రెడ్డికి.. అక్కడ ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. గత నాలుగేళ్ల నుంచి వీరు లవ్ లో ఉన్నట్లు సమాచారం. గత ఏడాది అనగా 2023, డిసెంబర్ మొదటి వారంలో తొలి సారి వీరి ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చాయి. రాజారెడ్డి-ప్రియా అట్లూరి కలిసి ఉన్న ఫోటో వైరల్ కావడంతో.. వీరి పెళ్లి గురించి జోరుగా ప్రచారం సాగింది.
ఆ తర్వాత ప్రియా అట్లూరికి విజయమ్మ.. సారె పెట్టడంతో.. పెళ్లి కన్ఫామ్ అయినట్లు తెలిసింది. ఇక తాజాగా స్వయంగా షర్మిలనే తన కొడుకు పెళ్లి డేట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని ప్రకారం.. ఈ ఏడాది జనవరి 18న రాజారెడ్డి-ప్రియా అట్లూరి నిశ్చితార్థం జరుపుతుండగా.. ఇదే సంవత్సరం ఫిబ్రవరి 17 వీరిద్దరి పెళ్లికి పెద్దలు ముహుర్తం నిర్ణయించారు. పెళ్లి తేదీ వివరాలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ మేరకు షర్మిల తన ఇన్ స్టాగ్రామ్ లో ముందుగా అందరికి న్యూ ఇయర్ విషెస్ తెలియజేసి.. ఆ తర్వాత తన కొడుకు పెళ్లి గురించిన వివరాలు తెలిపారు. “అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 కొత్త ఏడాదిలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియాతో వివాహం నిశ్చయించాము. ఈ ఏడాది జనవరి నెల 18న వీరిద్దరి నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది” అంటూ రాసుకొచ్చారు.
అంతేకాక “రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి.. నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాము” అని పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు, నెటిజనులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.