Tirupathi Rao
YS Jagana Master Plan: ప్రతిపక్ష కూటమిలో ఉన్న ముగ్గురు ముఖ్యమైన నేతలు పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ ల ఓటమే ప్రధాన లక్ష్యంగా వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్ రచించారు.
YS Jagana Master Plan: ప్రతిపక్ష కూటమిలో ఉన్న ముగ్గురు ముఖ్యమైన నేతలు పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ ల ఓటమే ప్రధాన లక్ష్యంగా వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్ రచించారు.
Tirupathi Rao
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి జోరందుకుంది. అధికార వైఎస్సార్ సీపీ మళ్లీ విజయమే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కూటమి మాత్రం సీట్లు సర్దుబాటు చేసుకోలేక.. బుజ్జగింపు మాటలు చెప్పలేక అల్లాడిపోతోంది. ముఖ్యంగా చంద్రబాబు పార్టీలో అసమ్మతిని, మెండిచేయి ఇచ్చిన వారికి మాయ మాటలు చెప్పలేక నానా ఇబ్బందులు పడతున్నారు. అధికారపక్షం నాయకులు మాత్రం జగన్ చేసిన సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తూ దూసుకుపోతున్నారు. 175కి 175 అసెంబ్లీ 25 లోక్ సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జగన్ 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. అయితే జగన్ ఎంపికలో మూడు స్థానాలు మాత్రం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైనాట్ 175 నినాదంతో వైఎస్సార్ సీపీ, జగన్ దూసుకువెళ్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించారు. గెలుపే లక్ష్యంగా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు. అయితే వీటిలో ఒక మూడు స్థానాలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవేంటంటే.. పిఠాపురం, హిందూపురం, మంగళగిరి. ఈ మూడు స్థానాలు ప్రత్యర్థి కూటమిలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఉన్న స్థానాలు. ఈ స్థానాల్లో చాలా బలమైన నాయకులు బరిలో ఉంటారని చాలామంది అనుకుని ఉండచ్చు. కానీ, ఆ స్థానాల్లో వైసీపీ నుంచి మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ స్థానాలపై జగన్ ఫోకస్ పెట్టలేదు అని కొంతమంది తప్పుగా భావిస్తున్నారు. కానీ, జగన్ అసలు వ్యూహం తెలిశాక మాత్రం ఈ మూడు స్థానాల్లో వైసీపీ ప్రభంజనం ఖాయం అని అంటున్నారు. ఈ స్థానాల్లో మహిళా అభ్యర్థులనే ఎందుకు ఎంచుకున్నారు? అసలు జగన్ వ్యూహం ఏంటో చూద్దాం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈసారి పోటీ చేసే స్థానాన్ని ప్రకటించేందుకు చాలానే తర్జన భర్జన పడ్డారు. కానీ, తీరా చూస్తే పక్కాగా ఓటమిపాలయ్యే స్థానాన్నే ఏరి కోరి ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో తాను ఓడిపోతానని ముందే తెలుసు అంటూ పవన్ ఇటీవల కామెంట్స్ చేయడం చూశాం. వచ్చే ఎన్నికల తర్వాత కూడా పవన్ అదే కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పిఠాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వంగా గీత అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. పిఠాపరంలో వంగా గీత బలమైన అభ్యర్థి మాత్రమే కాకుండా.. ఆమె కాపు వర్గానికి చెందింది. పైగా మహిళ కాబట్టి కాపు ఓట్లు మాత్రమే కాకుండా.. మహిళల ఓట్లు పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలనే వచ్చే ఎన్నికల్లో పవన్ ఓటమికి జగన్ పక్కా ప్లాన్ వేశారు అంటున్నారు. పైగా మిధున్ రెడ్డికి ఈ నియోజకవర్గ బాధ్యత అందించిన విషయం తెలిసిందే.
హిందూపురంలో ఈసారి బాలయ్యకు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది అంటున్నారు. టీడీపీ కంచుకోట అంటూ చెప్పుకునే ఈ హిందూపురంలో ఈసారి నందమూరి బాలకృష్ణ ఓటమే లక్ష్యంగా వైఎస్ జగన్ అభ్యర్థి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హిందూపురంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని, వ్యూహాన్ని వైఎస్ జగన్ రచించారు. ఈసారి హిందూపురంలో వైఎస్సార్ సీపీ నుంచి తిప్పె గౌడ నారాయణ దీపిక అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ ఖరారు చేశారు. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు వైఎస్ జగన్ హవా.. మహిళా అభ్యర్థితో ప్రయోగం ఈసారి టీడీపీ కంచుకోటకు బీటలు కొట్టడం ఖాయంగా చెబుతున్నారు.
వైఎస్ జగన్ మంగళగిరి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెప్తున్నారు. ఈసారి కూడా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కు ఓటమి తప్పదు అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. లోకేష్ ఓటమిని శాసిస్తూ బరిలోకి మురుగుడు లావణ్య అభ్యర్థిత్వాన్ని అధినేత జగన్ ఖరారు చేశారు. మురుగుడు లావణ్య మరెవరో కాదు.. కాండ్రు కమల కూతురే మురుగుడు లావణ్య. అంతేకాకుండా ఆమె ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు కూడా. ఇలా ముప్పేట వ్యూహంతో నారా లోకేష్ ఓటమికి వైఎస్ జగన్ వ్యూహాన్ని రచించారు. ఈ నేపథ్యంలోనే ఈ మూడు స్థానాల్లో జగన్ అసలు వ్యూహం తెలుసుకుని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో ఉన్న మూడు ప్రధాన స్థానాల్లో జగన్ ప్రణాళికలు అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.