లక్కంటే నీదే బాసు.. సింగిల్ బిర్యానీ తిని.. లక్షల విలువైన కారు గెలుచుకున్నాడు!

న్యూఇయర్ వేళ తిరుపతికి చెందిన రాహుల్ జాక్ పాట్ కొట్టాడు. తిరుపతికి చెందిన యువకుడు ఒక్క బిర్యానీ తిని లక్షలు విలువ చేసే కారును గెలుచుకున్నాడు. ఆ వివరాలు మీకోసం..

న్యూఇయర్ వేళ తిరుపతికి చెందిన రాహుల్ జాక్ పాట్ కొట్టాడు. తిరుపతికి చెందిన యువకుడు ఒక్క బిర్యానీ తిని లక్షలు విలువ చేసే కారును గెలుచుకున్నాడు. ఆ వివరాలు మీకోసం..

అదృష్టం ఎప్పుడు ఎవరినీ ఎలా వరిస్తుందో తెలియదు. కాలం కలిసొస్తే అదృష్టమే మిమ్మల్ని గాలమేసి పట్టుకుంటుంది అన్నట్లు ఇటీవల కొందరికి లాటరీల్లో కోట్ల రూపాయల జాక్ పాట్ తగిలిన సంఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. ఇదే విధంగా కొత్త సంవత్సరం వేళ ఓ యువకుడికి అదృష్టం తలుపు తట్టింది. ఓ హోటల్లో కేవలం సింగిల్ బిర్యానీ తిని ఏకంగా లక్షలు విలువ చేసే కారును సొంతం చేసుకున్నాడు. ఆ అదృష్టవంతుడు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి చెందిన రాహుల్ అనే యువకుడు. ఇక ఇది తెలిసిన వారు లక్కంటే నీదే బాసు అంటూ పొగిడేస్తున్నారు. ఇంతకీ అసలు బిర్యానీ తింటే కారు గెలుచుకోవడం ఏంటీ.. అని అనుకుంటున్నారా.. అయితే ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

న్యూఇయర్ వేళ తిరుపతికి చెందిన రాహుల్ జాక్ పాట్ కొట్టాడు. తిరుపతి నగరంలోని రోబో హోటల్లోనిర్వహించిన లక్కీ డ్రాలో ఏకంగా రూ. ఏడు లక్షలు విలువ చేసే నిస్సాన్ మాగ్నట్ కారును ఉచితంగా పొందాడు. ఒక్క బిర్యానీ తిని లక్షల విలువ చేసే కారును గెలుచుకున్నాడు ఈ లక్కీ మ్యాన్. కాగా గత సెప్టెంబర్ నెలలో రోబో హోటల్ కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ఆలోచించి ఓ స్కీంను తీసుకొచ్చింది. హోటల్ లో బిర్యాని తిన్న ప్రతి ఒక్కరికి కూపన్ అందజేసింది. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి విలువైన బహుమతులను ప్రకటించింది హోటల్ యాజమాన్యం. కాగా స్కీం ప్రారంభం అయినప్పటి నుంచి సుమారు 20 వేలకు పైగా కూపన్లు జమయ్యాయి.

అయితే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి, నీలిమ దంపతులు హోటల్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో కూపన్ వెలికి తీశారు. ఈ లక్కీ డ్రాలో తిరుపతికి చెందిన రాహుల్ అనే యువకుడిని అదృష్టం వరించింది. ఈ లక్కీ డ్రాలో అతడు విజేతగా నిలిచారు. రాహుల్ కు రూ. ఏడు లక్షలు విలువ చేసే నిస్సాన్ మ్యాగ్నెట్ కారు ఉచితంగా లభించింది. రోబో హోటల్ యాజమాన్యం స్వయంగా రాహుల్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపి రాహుల్ కు కారును అందజేశారు. మరి హోటల్లో సింగిల్ బిర్యానీ తిని లక్షలు విలువ చేసే కారును ఉచితంగా పొందిన రాహుల్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments