iDreamPost
android-app
ios-app

శ్రీకాళహస్తిలో లేడీ అఘోరీ రచ్చ.. అసలు రూపం వెలుగులోకి..

  • Published Nov 07, 2024 | 4:23 PM Updated Updated Nov 07, 2024 | 4:23 PM

Lady Aghori: లేడీ అఘోరీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా శ్రీకాళహస్తికి చేరుకున్న ఆమె నానా రచ్చ చేసింది. ఈ క్రమంలో అఘోరీ అసలు రూపం వెలుగు చూసింది.

Lady Aghori: లేడీ అఘోరీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా శ్రీకాళహస్తికి చేరుకున్న ఆమె నానా రచ్చ చేసింది. ఈ క్రమంలో అఘోరీ అసలు రూపం వెలుగు చూసింది.

  • Published Nov 07, 2024 | 4:23 PMUpdated Nov 07, 2024 | 4:23 PM
శ్రీకాళహస్తిలో లేడీ అఘోరీ రచ్చ.. అసలు రూపం వెలుగులోకి..

గత కొన్ని రోజులుగా లేడీ అఘోరీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా నాగసాధు గురించిన చర్చే వినిపిస్తున్నది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. నిత్యం మీడియా కంటపడుతూ లేడీ అఘోరీ రచ్చ రచ్చ చేస్తోంది. హైదరాబాద్ లో ఇటీవల దుండగుడు ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో అమ్మవారి భక్తులు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. సికింద్రాబాద్ ప్రాంతమంతా ఆందోళనలతో అట్టుడికిపోయింది. తొక్కిసలాట, పోలీసుల లాఠీ చార్జ్ తో రణరంగంగా మారింది. ఇదే సమయంలో హఠాత్తుగా ప్రత్యక్షమైంది లేడీ అఘోరీ. ముత్యాలమ్మ గుడి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసింది. ఆ తర్వాత సనాతన ధర్మం కాపడడానికి పోరాడుతానని తెలిపింది.

సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరు కదిలిరావాలని పిలుపునిచ్చింది. అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన వారిని ఎందుకు శిక్షించడం లేదంటూ ప్రశ్నించింది. ఈ వ్యవహారంతో లేడీ అఘోరీ పాపులర్ అయిపోయింది. యూట్యూబ్ చానల్స్ అన్నీ లేడీ అఘోరీ ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డాయి. అయితే ఈ ఇంటర్వ్యూల్లో పొంతన లేని విషయాలు వెల్లడించడంతో లేడీ అఘోరీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు ఆమె లేడీ కాదని, హిజ్రా అని ప్రచారానికి తెరలేపారు. మనిషి మాంసం తింటాని, తనకు దేశంలోని చాలా భాషలు వస్తాయని మీడియా ముందు ప్రగల్భాలు పలికింది. అయితే ఉన్నట్టుండి లేడీ అఘోరీపై వ్యతిరేకత రావడంతో ఆమె యూట్యూబ్ చానల్స్ పై ఫైర్ అయ్యింది.

మీ అంతుచూస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. ఆ తర్వాత తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన గురువును కలిసేందుకు కేధార్ నాథ్ కు వెళ్లింది. తిరిగి తెలంగాణకు వచ్చిన లేడీ అఘోరీ ఆత్మార్పణం చేసుకుంటానని స్టేట్ మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చింది. దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఆమెను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. గృహనిర్భందం అనంతరం లేడీ ఆఘోరీన ఆంధ్రప్రదేశ్ కు పయనమైంది. ఈ క్రమంలో శ్రీకాళహస్తికి చేరుకుంది. ఇక అసలు వ్యవహారం ఇక్కడే మొదలైంది. లేడీ అఘోరీ కాళహస్తి పరమశివుడి ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది.

అయితే ఆమెను సెక్యూరిటీ సిబ్బంది లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో లేడీ అఘోరీ నానా హంగామా చేసింది. ఆలయంలోకి వెళ్లనివ్వకపోతే ఆత్మార్పణం చేసుకుంటానని క్యాన్ లో ఉన్న పెట్రోల్ ను తనమీద కుమ్మరించుకుని రచ్చ రచ్చ చేసింది. ఈ క్రమంలోనే లేడీ అఘోరీ అసలు రూపం లీక్ అయ్యింది. తొలిసారి లేడీ అఘోరీ అసలు రూపం చూసి జనాలు బిత్తరపోయారు. ఇంతకాలం ఒళ్లంతా విభూది పూసుకుని నుదిటన పెద్ద సైజులో కుంకుమ బొట్టుతో దర్శనమిచ్చింది. మెడలో రుద్రాక్ష దండలతో.. చేతులకు రుద్రాక్షలు కట్టుకుని పెదాలకు లిప్ స్టిక్ రాసుకుని లేడీ అఘోరీ హల్ చల్ చేసింది. అయితే ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో అక్కడున్న వారు ఆమెను కాపాడేందుకు నీళ్లు కుమ్మరించారు.

దీంతో లేడీ అఘోరీ అసలు రూపం వెలుగులోకి వచ్చింది. సాధారణ రూపంలో కనిపించే సరికి జనాలు అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్లాలంటే దుస్తులు ధరించాలని చెప్పి అఘోరికి బట్టలు తొడిగించారు. కాసేపు ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం కొనసాగింది. పరిస్థితి చక్కబడ్డ అనంతరం పోలీసులు లేడీ అఘోరీని ఏపీ బార్డర్ దాటించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరి లేడీ అఘోరీ అసలు రూపంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş