iDreamPost
android-app
ios-app

ATMలో జమ చేయాల్సిన రూ.2.50 కోట్లతో సిబ్బంది పరార్! ఎక్కడంటే..

సులభంగా డబ్బులు సంపాదించడం కోసం కొందరు దోపిడీలకు, చోరీలకు పాల్పడుతున్నారు. మరికొందరు తాము పని చేస్తున్న సంస్థనే మోసం చేసి..కోట్ల రూపాయలతో ఉడాయిస్తున్నారు. తాజాగా అలాంటి ఘరాన మోసం ఒకటి తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

సులభంగా డబ్బులు సంపాదించడం కోసం కొందరు దోపిడీలకు, చోరీలకు పాల్పడుతున్నారు. మరికొందరు తాము పని చేస్తున్న సంస్థనే మోసం చేసి..కోట్ల రూపాయలతో ఉడాయిస్తున్నారు. తాజాగా అలాంటి ఘరాన మోసం ఒకటి తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

ATMలో జమ చేయాల్సిన రూ.2.50 కోట్లతో సిబ్బంది పరార్! ఎక్కడంటే..

ఇటీవల కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలనుకునే వారి సంఖ్య ఎక్కువపోతుంది. ఈ క్రమంలోనే కొందరు అక్రమా మార్గాలను ఎంచుకుంటున్నారు. మరికొందరు నమ్మిన యజమానులను, సంస్థలనే నిండా ముంచేస్తున్నారు.  ఇలా కొందరు ఘరాన దోపిడికి పాల్పడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఓ భారీ చోరీ చోటుచేసుకుంది. దాదాపు రూ.2.20 కోట్లతో పరారయ్యారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపుం మండలం మాచరమెట్లకు చెందిన వాసంశెట్టి అశోక్‌కుమార్‌(27) అనే యువకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు డిగ్రీ పూర్తి చేసి.. రాజమహేంద్రవరంలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్‌టీసీ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా చేరాడు. ఈ క్రమంలోనే నగరంలోని వివిధ ప్రాంతాల్లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సంబంధించిన 11 ఏటీఎంల్లో నగదు నింపేవారు. అలానే శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రూ.2.20 కోట్ల చెక్కును దానవాయిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకి వెళ్లి నగదుగా మార్చాడు. ఆ ఆ నగదును ఇనుప పెట్టెలో సర్దుకుని తాను తెచ్చుకున్న కారులో పరారయ్యడు. ఈ దోపిడిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితుడి సెల్‌ఫోనును ట్రాక్‌ చేశారు. అయితే అది నగరంలోని జాతీయ రహదారికి సమీపంలోని  మోడల్‌ కాలనీ సమీపంలో ఉన్నట్లు  గుర్తించారు.

అక్కడికి వెళ్లగా అతడి మొబైల మాత్రమే లభ్యమైంది. నిందితుడు వినియోగించిన కారు కొత్తపేట సమీపంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏటీఎంలో డబ్బులను నింపేందుకు నలుగురు వ్యక్తుల టీమ్ ప్రత్యేక భద్రత కలిగిన  వాహనం వెళ్తుంటారు. కానీ ఈ ఘటనలో మాత్రం అశోక్ ఒక్కడే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని పరారయ్యాడని ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు.  శుక్రవారం మధ్యాహ్నం సమయంలో అశోక్‌ ఒక్కడే వచ్చి డబ్బులు తీసుకెళ్లడం.. అదే సమయంలో ఏజెన్సీ వాహనం బ్యాంకు బయటనే ఉండడం.. ఆ టీమ్ లోని మిగతా ఉద్యోగులు అతడితో పాటు లేకపోవడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి అందిస్తామని పోలీసులు ప్రకటించారు.